News January 9, 2025

సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే టర్మినల్‌కు 10 నిమిషాలకో బస్సు

image

TG: రెండు రోజుల క్రితం చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను PM మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటివరకు SECBAD నుంచి మొదలయ్యే పలు రైళ్లు ఇకపై చర్లపల్లి నుంచి స్టార్ట్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ టు చర్లపల్లికి ప్రతి 10ని. ఒక బస్సు ఉంటుందని RTC అధికారులు తెలిపారు. SECBAD బ్లూసీ వద్ద మొదలై హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, HPCL మీదుగా అక్కడికి చేరుతాయని పేర్కొన్నారు.

News January 9, 2025

తరచూ మొబైల్ చెక్ చేసుకుంటున్నారా?

image

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌కు అడిక్ట్ అయ్యారు. కానీ ఫోన్‌ను తరచూ చెక్ చేసుకుంటే ఆరోగ్యానికే హాని అని నిపుణులు చెబుతున్నారు. పదే పదే ఫోన్ చూడటం వల్ల తలనొప్పి, అస్పష్టమైన దృష్టి, కళ్లు పొడిబారడం, మెడ, భుజాల నొప్పి వస్తాయి. కంటి ఆకారం మారిపోయి కంటి శుక్లాలకు దారి తీయొచ్చు. నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్‌ కూడా తగ్గిపోతుంది. మెదడుపై ఎఫెక్ట్ పడి జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది.

News January 9, 2025

ఇలా అయితే పెళ్లిళ్లు ఎలా అవుతాయ్..!

image

ఒకప్పుడు అమ్మాయిని బాగా చూసుకోగలడా, బాధ్యతాయుతంగా ఉంటాడా అని చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు అబ్బాయికి రూ.లక్షకు పైగా జీతం, కారు, బంగ్లా ఉంటేనే పెళ్లికి ఓకే చెబుతున్నారు. ఇది అందరికీ సాధ్యం కాకపోవడంతో పెళ్లి అనే పదం భారమవుతోంది. పెద్దలు ఆలోచన తీరు మార్చుకోవాలని యువకులు కోరుతున్నారు. వివాహ వ్యవస్థను వ్యాపారమయంగా మారుస్తున్నారని, బాంధవ్యాలకు విలువ ఇవ్వాలని సూచిస్తున్నారు.

News January 9, 2025

అభివృద్ధికి సహకరిస్తాం.. తాలిబన్ ప్రభుత్వానికి భారత్ హామీ

image

అఫ్గానిస్తాన్‌లో అధికారం చేపట్టిన తాలిబన్ ప్రభుత్వంతో భారత్ చర్చలు చేపట్టింది. ఆదేశ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ దుబాయ్‌లో భేటీ అయ్యారు. అఫ్గాన్‌ ప్రజలకు మానవతా సాయం కొనసాగించడంతో పాటు భవిష్యత్తులో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడానికి IND సిద్ధంగా ఉందని చెప్పారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు, చాబహార్ పోర్ట్ వినియోగంపైనా చర్చలు జరిగాయి.

News January 9, 2025

‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరల పెంపు.. బీఆర్ఎస్ విమర్శలు

image

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టికెట్ ధరలు పెంచబోమని సీఎం <<14942759>>రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా<<>> ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ మూవీకి టికెట్ ధరలు పెంచేందుకు పర్మిషన్‌తో పాటు ఎక్స్‌ట్రా షోలకు అనుమతివ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలకు దిగాయి. నెల తిరగక ముందే సీఎం మాట మార్చారని పోస్టులు చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై మీ కామెంట్?

News January 9, 2025

పవన్ ‘OG’ టీజర్ విడుదలకు సిద్ధం

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘OG’ నుంచి టీజర్ వీడియో విడుదలకు సిద్ధమైంది. 99 సెకండ్ల నిడివితో కూడిన టీజర్‌కు సెన్సార్ పూర్తయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ముంబై బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News January 9, 2025

సీఎం ఆదేశాలు.. తిరుపతికి బయల్దేరిన ముగ్గురు మంత్రులు

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో అధికార వైఫల్యాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాలతో హోం, దేవాదాయ, రెవెన్యూ శాఖ మంత్రులు తిరుపతికి బయల్దేరారు. అక్కడి పరిస్థితులను వారు దగ్గరుండి సమీక్షించనున్నారు. రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అటు రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకోనున్నారు.

News January 9, 2025

జనవరి 09: చరిత్రలో ఈరోజు

image

* 1915: మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగివచ్చిన రోజు
* 1922: ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు, నోబెల్ గ్రహీత హరగోబింద్ ఖురానా జననం
* 1934: బాలీవుడ్ సింగర్ మహేంద్ర కపూర్ జననం
* 1965: సినీ డైరెక్టర్, నటి, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ పుట్టినరోజు
* 1969: తెలంగాణ తొలి దశ ఉద్యమం ప్రారంభం
* ప్రవాస భారతీయుల దినోత్సవం

News January 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 9, 2025

దోమలను చంపేందుకు కొత్త ప్లాన్!

image

మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు కారణమైన దోమల నివారణకు ఆస్ట్రేలియాలోని మాక్వేరీ వర్సిటీ పరిశోధకులు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. మనుషులను కుట్టే ఆడ దోమలతో శృంగారం చేసే మగ దోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని చూస్తున్నారు. దీంతో దోమల బెడద తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈగలపై చేసిన ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీని వల్ల ఎవరికీ హాని లేదని నిర్ధారించాకే ముందుకు వెళ్తామన్నారు.