News March 25, 2024

భార్యకు టికెట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజీనామా

image

అస్సాంలో కాంగ్రెస్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తన భార్యకు MP టికెట్ అడిగితే ఇవ్వలేదన్న కోపంతో ఆ పార్టీ MLA భరత్ చంద్ర నారా రాజీనామా చేశారు. ఆయన భార్య రాణీ నారా గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఆమె లఖింపూర్ టికెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్ అక్కడ ఉదయ్ శంకర్ హజారికాకు ఛాన్స్ ఇచ్చింది. దీంతో రాణీ నారా భర్త భరత్ చంద్ర నారా పార్టీకి రాజీనామా చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు.

News March 25, 2024

IPL పూర్తి షెడ్యూల్ ఇవాళ విడుదల

image

ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ ఇవాళ సాయంత్రం విడుదల కానుంది. స్టార్‌స్పోర్ట్స్‌లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. తొలుత మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల తేదీలు వెలువడిన నేపథ్యంలో నేడు పూర్తి షెడ్యూల్‌ను ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించనుంది.

News March 25, 2024

జగదీశ్ రెడ్డి 1.50 లక్షల ఎకరాలు దోచుకున్నారు: వేముల వీరేశం

image

TG: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు. జగదీశ్, ఆయన అనుచరులు నల్గొండ జిల్లాలో 1.50 లక్షల ఎకరాలను దోచుకున్నారని విమర్శించారు. ఆ భూములు ఉన్న గ్రామాలు, సర్వే నంబర్లతో నిరూపించడానికి తాను సిద్ధమని తెలిపారు. కొల్లగొట్టిన భూములను ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఈ భూముల వ్యవహారంపై త్వరలో సీఎం రేవంత్‌కు లేఖ రాస్తానని చెప్పారు.

News March 25, 2024

ప్రత్యర్థిని ఆలింగనం చేసుకున్న తమిళిసై

image

చెన్నైలో ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సౌత్‌ చెన్నై బరిలో ఉన్న BJP అభ్యర్థి డా.తమిళిసై సౌందరరాజన్‌, DMK తరఫున పోటీ చేస్తున్న తమిళచ్చి తంగపాండ్యన్‌ ఒకే సమయంలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో విమర్శలు చేసుకునే వీరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. రాజకీయాల్లో ఇదో మంచి పరిణామమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News March 25, 2024

రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: హరీశ్

image

TG: నీరు లేక పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ‘20లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సీఎం, మంత్రులు అన్నదాతకు భరోసా కల్పించడం లేదు. కాంగ్రెస్ పాలనలో వారు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రుణాలు చెల్లించాలని అధికారులు రైతులను వేధిస్తున్నారు. కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు’ అని హరీశ్ అన్నారు.

News March 25, 2024

కుప్పంలో చంద్రబాబు పూజలు

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో కుప్పానికి చేరుకున్న ఆయన శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థాన శతరత్న జీర్ణోద్ధారణ ప్రతిష్ఠ మహా కుంభాభిషేకంలో పాల్గొని పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లో జరగనున్న సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇవాళ, రేపు కుప్పంలోనే పర్యటించనున్నారు.

News March 25, 2024

కేజ్రీవాల్ అంటే ప్రధానికి భయం: సంజయ్ రౌత్

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయమని, అందుకే ఆయనను అరెస్ట్ చేయించారని శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ మరింత బలంగా మారారని అన్నారు. రాజకీయ నాయకులను భయపెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు మోదీ దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని విమర్శించారు. మార్చి 31న చేపట్టే విపక్షాల ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

News March 25, 2024

వెంకీ-2 స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాం: శ్రీను వైట్ల

image

రవితేజ హీరోగా 2004లో వచ్చిన వెంకీ సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఇటీవలే ఆ సినిమాను రీరిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ లభించింది. కాగా వెంకీ సీక్వెల్‌పై తాజాగా మూవీ డైరెక్టర్ శ్రీను వైట్ల స్పందించారు. ‘వెంకీ రీరిలీజ్ తర్వాత ప్రేక్షుకుల స్పందన చూసి వెంకీ-2 చేయాలనిపించింది. స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం. మళ్లీ అదే కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది కానీ ఎప్పుడని చెప్పలేను’ అని ఆయన తెలిపారు.

News March 25, 2024

ఎవరీ నమన్ ధీర్?

image

MI కొత్త ప్లేయర్ నమన్ ధీర్ అందరి దృష్టిని ఆకర్షించారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు ఏమాత్రం బెదురు లేకుండా ఆడి 10 బంతుల్లో 20 పరుగులు చేశారు. ఫీల్డింగ్‌లోనూ కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్నారు. 24ఏళ్ల నమన్ పంజాబ్‌కు చెందిన వ్యక్తి. అతడు సయ్యద్ ముస్తాక్ అలీ, డీవై పాటిల్, షేర్-ఏ-పంజాబ్ టీ20 టోర్నీల్లో మంచి ప్రదర్శన చేసి హిట్టర్‌గా పేరొందారు. దీంతో వేలంలో అతణ్ని MI రూ.20లక్షలకు సొంతం చేసుకుంది.

News March 25, 2024

రంగుల కేళి

image

హోలీ పండుగని దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రంగులు చల్లుకుంటూ సందడి చేస్తున్నారు. సినీ తారలు, క్రికెటర్లు, రాజకీయ నేతలు ఈ వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన హోలీ సంబరాల్లో విదేశీ క్రికెటర్లూ పాల్గొని సందడి చేశారు.