News January 9, 2025

ఈ నెల 25 తర్వాత సేవలన్నీ నిలిపేస్తాం: ఆశా

image

AP: బకాయిలు చెల్లించకపోతే NTR వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఈ నెల 25 తర్వాత వైద్య సేవలన్నీ నిలిపేస్తామని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) తెలిపింది. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌తో జరిగిన భేటీలో ఆశా ప్రతినిధులు మాట్లాడుతూ రూ.500కోట్లు విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, రూ.1000కోట్లు విడుదల చేస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. 6వ తేదీ నుంచి ఓపీ, EHS సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 26, 2025

ప్రముఖ డైరెక్టర్ గుండెపోటుతో మృతి

image

మలయాళ డైరెక్టర్ షఫీ(56) కన్నుమూశారు. ఈనెల 16న గుండెపోటుకు గురైన ఆయన కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు. కామెడీ చిత్రాలతో పాపులర్ అయిన షఫీ సుమారు 50కి పైగా సినిమాలను డైరెక్ట్ చేశారు. ‘వన్ మ్యాన్ షో’ ఆయన తొలిచిత్రం. కళ్యాణరామన్, పులివల్ కళ్యాణం, తొమ్మనమ్ మక్కలుమ్, టూ కంట్రీస్, చిల్డ్రన్ పార్క్, షెర్‌లాక్ టోమ్స్ తదితర మూవీలు తీశారు. 2022లో వచ్చిన ఆనందం పరమానందం షఫీ చివరి మూవీ.

News January 26, 2025

30 ఏళ్ల పోరాటానికి దక్కిన గుర్తింపు

image

1965లో ఉమ్మడి వరంగల్(D) న్యూశాయంపేటలో జన్మించిన మందకృష్ణ మాదిగ విద్యార్థి దశలోనే కులవివక్షపై పోరాడారు. కొంతకాలం పీపుల్స్‌వార్‌లో పనిచేశారు. తర్వాత బయటికొచ్చి దళిత ఉద్యమకారుడిగా మారారు. SC వర్గీకరణ కోసం 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా గతేడాది SC వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈక్రమంలోనే నిన్న ఆయనకు కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది.

News January 26, 2025

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి యూపీఎస్

image

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS)ను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్‌కు ముందు 12 నెలల్లో పొందిన బేసిక్ పే సగటులో 50 శాతాన్ని పింఛనుగా పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) కింద ఉంటూ, కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని UPSను ఎంచుకున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.