News June 14, 2024

ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పెంపు

image

ఆధార్‌ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు నేటితో ముగియాల్సి ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్‌డేట్ చేసుకునేందుకు UIDAI <>వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

News June 14, 2024

రామ్మోహన్ లాంటి నాయకుడు దేశానికి అవసరం: MP విశ్వేశ్వర్ రెడ్డి

image

పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడును తెలంగాణ బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ప్రశంసించారు. ‘2014లో యంగెస్ట్ ఎంపీల్లో మీరూ ఒకరు. లోక్ సభలో మీ పనితీరు అద్భుతంగా ఉండేది. అప్పుడే సీనియర్ ఎంపీలందరూ మిమ్మల్ని గుర్తించారు. మన దేశానికి మీలాంటి విజ్ఞానవంతులు, వాగ్ధాటి గల యువ నాయకుడు మన దేశానికి అవసరం. మిమ్మల్ని కేంద్రమంత్రిగా చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.

News June 14, 2024

నటి శిల్పాశెట్టిపై చీటింగ్ కేసు

image

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాపై కేసు నమోదు చేయాలని ముంబై అదనపు సెషన్స్ కోర్టు పోలీసులను ఆదేశించింది. గోల్డ్ స్కీమ్ పేరుతో తనను మోసగించారని ఓ వ్యాపారి కోర్టులో ఫిర్యాదు చేశారు. సత్‌యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్స్ శిల్పా, రాజ్‌కుంద్రాతోపాటు ఆ సంస్థ డైరెక్టర్లు, మరో ఉద్యోగి మోసం చేశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను జడ్జికి చూపడంతో కేసు నమోదుకు ఆదేశించారు.

News June 14, 2024

T20WCలో ప్రపంచ రికార్డు

image

T20WC హిస్టరీలో అత్యంత వేగంగా(3.1 ఓవర్లలో 48) లక్ష్యాన్ని <<13436346>>ఛేదించిన<<>> జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒమన్‌తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. గతంలో శ్రీలంక 5 ఓవర్లలో(VSనెదర్లాండ్స్) 40, న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో(VSఇంగ్లండ్) 52, ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలో(VSనమీబియా) 73, విండీస్ 5.5 ఓవర్లలో(VS ఇంగ్లండ్)60 టార్గెట్లను ఛేజ్ చేశాయి.

News June 14, 2024

DSC పోస్టులపై వైసీపీ vs టీడీపీ

image

AP: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు మెగా మోసం చేశారన్న YCP విమర్శలకు TDP కౌంటర్ ఇచ్చింది. ‘ఐదేళ్లు మెగా డీఎస్సీ అని ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని నువ్వు ఎక్కడ? వచ్చిన మొదటి రోజే 16వేల టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన చంద్రబాబు ఎక్కడ?’ అని Xలో రిప్లై ఇచ్చింది. కాగా, 25,000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్న చంద్రబాబు.. 16,347 పోస్టులే ఇచ్చారని అంతకుముందు వైసీపీ ట్వీట్ చేసింది.

News June 14, 2024

వైఎస్సార్ పెన్షన్ కానుక ఎన్టీఆర్ భరోసాగా మార్పు

image

AP: వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం పేరును టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసాగా మార్చింది. 2014-19 మధ్య పెట్టిన పేరునే కొనసాగించనుంది. ఇకపై వృద్ధులకు రూ.4,000 పెన్షన్ అందనుంది. ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేస్తున్నందున జులై 1న రూ.7,000 ఇస్తుంది. దివ్యాంగులకు రూ.6వేలు అందనుంది. రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్‌దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

News June 14, 2024

DSC అభ్యర్థులకు గుడ్‌న్యూస్

image

TG: డీఎస్సీ రాయాలంటే డిగ్రీలో ఉండాల్సిన కనీస మార్కుల శాతాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఇక నుంచి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45%, ఇతరులకు 40% మార్కులు ఉంటే సరిపోతుంది. ఇప్పటివరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కుల నిబంధన ఉండేది. కాగా భాషా పండితులు, పీఈటీలకు కనీస మార్కుల నిబంధన వర్తించదు. వారు డిగ్రీ పాసైతే సరిపోతుంది.

News June 14, 2024

గ్రూప్ స్టేజీలోనే ఇంటిదారి పట్టిన లంక

image

మాజీ ఛాంపియన్ శ్రీలంక టీ20 ప్రపంచకప్-2024 నుంచి ఎలిమినేట్ అయింది. సౌతాఫ్రికా, బంగ్లాతో ఓటములు, నేపాల్‌తో మ్యాచ్ రద్దుతో గ్రూప్ స్టేజీలోనే ఇంటిదారి పట్టింది. ఈ టోర్నమెంటులో 3 మ్యాచులు ఆడిన హసరంగా సేన.. కేవలం ఒకే పాయింట్ సాధించింది. గ్రూప్-D నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా సూపర్-8కి చేరింది. ఆ గ్రూపులోని నెదర్లాండ్స్, నేపాల్‌లతో పోలిస్తే సూపర్-8కు వెళ్లేందుకు బంగ్లాకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

News June 14, 2024

ZP హైస్కూల్‌లో ‘నో అడ్మిషన్స్’ బోర్డు

image

TG: ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సిద్దిపేటలోని ZP హైస్కూల్‌ విద్యార్థులను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది 6-10 తరగతుల్లో 250 సీట్లు ఉంటే ఏకంగా 650 దరఖాస్తులు వచ్చాయి. దీంతో నో అడ్మిషన్స్ అనే బోర్డును యాజమాన్యం వేలాడదీసింది. విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి త్వరలో సీట్లు కేటాయించనుంది. గత ఏడాది ఇక్కడ 231 మంది టెన్త్ పరీక్ష రాస్తే 99.13 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఒక్కరే ఫెయిల్ అయ్యారు.

News June 14, 2024

కూతురితో రోహిత్ ఆట.. క్యూట్ ❤️ ఫొటో

image

T20WCలో వరుస విజయాలతో జోరుమీదున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఖాళీ టైమ్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. కెనడాతో చివరి మ్యాచ్‌ కోసం ఫ్లోరిడా చేరుకున్న ఆయన అక్కడి బీచ్‌లో ఇసుక గూళ్లు కడుతూ కూతురితో ఆడుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది క్యూటెస్ట్ ఫొటో అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.