News June 14, 2024

18 నుంచి బడ్జెట్ సన్నాహక భేటీలు

image

TG: జులై మొదటి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 18 నుంచి శాఖలవారీగా డిప్యూటీ CM భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, పథకాలకు ఖర్చయ్యే మొత్తం, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఆర్థికశాఖ వివరాలు సేకరిస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపుల ఆధారంగా రాష్ట్ర పద్దుకు తుది మెరుగులు దిద్దనున్నట్లు సమాచారం.

News June 14, 2024

బుర్రా వెంకటేశం మెయిల్‌ ఐడీ హ్యాక్‌.. మోసపూరిత మెసేజ్‌లతో జాగ్రత్త

image

TG: రాష్ట్ర విద్య, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మెయిల్‌ ఐడీ హ్యాకింగ్‌కు గురైనట్లు అధికారులు తెలిపారు. కొందరు మోసగాళ్లు ఉద్యోగులు, సాధారణ ప్రజలకు మెయిల్స్‌ పంపుతూ డబ్బులు అడుగుతున్నారని చెప్పారు. వీటికి స్పందించకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. హ్యాకింగ్‌పై ఫిర్యాదు చేశామని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.

News June 14, 2024

భారత్ గురించి తెలుసుకునేందుకు చైనీయుల ఆసక్తి

image

భారత్-చైనా మధ్య సత్సంబంధాలు లేకపోయినా మన దేశం గురించి తెలుసుకోవడానికి చైనీయులు ఆసక్తి చూపుతున్నారు. గ్లోబల్ టైమ్స్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల చైనాలో 1,440 మందిపై సర్వే చేసింది. దాదాపు 90% మంది ఇండియా గురించి తెలుసుకోవాలని, 70% మంది సందర్శించేందుకు ఆసక్తి కనబర్చారు. ముంబై, ఢిల్లీ పర్యటనకు ఎక్కువగా మొగ్గు చూపారు. అలాగే 90% మంది IND సినిమాలను వీక్షించారు. 30% మంది మన ఉత్పత్తులను కొనుగోలు చేశారు.

News June 14, 2024

స్వదేశానికి గిల్, అవేశ్.. జట్టుతో రింకూ, ఖలీల్

image

T20WC కోసం భారత జట్టుతో పాటు USAకు వెళ్లిన క్రికెటర్లు గిల్, అవేశ్ ఖాన్ స్వదేశానికి రానున్నారు. వీరితో పాటు ట్రావెలింగ్ రిజర్వ్‌గా వెళ్లి రింకూ, ఖలీల్ అహ్మద్ జట్టుతోనే ఉంటారు. USAలో జూన్ 15న కెనడాతో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది. తర్వాతి మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో జరుగుతాయి. జట్టులోని ఆటగాళ్లు గాయపడితే అప్పటికప్పుడు రిజర్వ్ ప్లేయర్లు USAకు వెళ్లడం కష్టమైన పని కావడంతో వీరిని ముందే USAకు తీసుకెళ్లారు.

News June 14, 2024

‘థగ్ లైఫ్’ సెట్‌లో ప్రమాదం.. నటుడికి గాయం

image

మణిరత్నం డైరెక్షన్‌లో కమల్ హాసన్ నటిస్తోన్న ‘థగ్ లైఫ్’ సినిమా సెట్‌లో ప్రమాదం జరిగింది. పుదుచ్చేరిలో హెలికాప్టర్‌తో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా నటుడు జోజు జార్జ్ గాయపడ్డారు. వెంటనే మూవీ యూనిట్ ఆయన్ను ఆస్పత్రి తరలించింది. చికిత్స చేసిన వైద్యులు జార్జ్‌ ఎడమ కాలు ఫ్రాక్చర్ అయిందని తెలిపారు. కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఆయన సన్నివేశాలను డైరెక్టర్ చిత్రీకరిస్తున్నారు.

News June 14, 2024

భారత ఎన్నికలపై మేం స్పందించం: పాక్

image

భారత్‌లో జరిగిన ఎన్నికలపై తాము స్పందించబోమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జాహ్రా మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ‘ఇటీవల భారత్‌లో ముగిసిన ఎన్నికల గురించి లేదా ఆ దేశ అంతర్గత వ్యవహారాల గురించి మేం వ్యాఖ్యానించం. నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ మా పీఎం షరీఫ్ ఓ ట్వీట్ చేశారు. అందుకు ఆయన కూడా బదులిచ్చారు. ఈ విషయంలో ఇంతకు మించి మేం మాట్లాడదల్చుకోలేదు’ అని పేర్కొన్నారు.

News June 14, 2024

తొలి CNG బైక్ ఆవిష్కరణ వాయిదా

image

ప్రపంచంలోనే తొలి CNG బైక్(బ్రూజర్ 125) ఆవిష్కరణను జులై 17కు వాయిదా వేస్తున్నట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు గతంలో తెలపగా, ఇప్పుడు అనివార్య కారణాలతో వాయిదా వేసింది. కాగా CNG వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం కేంద్రాన్ని తాజాగా కోరింది. దీనిపై భారీ పరిశ్రమల శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

News June 14, 2024

Common Proverbs-Meaning

image

✒ An idle brain is the devil’s workshop
Meaning: Evil thoughts come to us easily when we are idle
✒ Better safe than sorry
Meaning: It is better to take precautions than to regret later
✒ Appearances can be deceptive
Meaning: Something might be different from how they appear outwardly

News June 14, 2024

ఒలింపిక్స్‌లో భారత్ తరఫున టెన్నిస్ జోడీ ఇదే!

image

పారిస్ ఒలింపిక్స్‌లో టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో భారత్ తరఫున రోహన్ బోపన్న, ఎన్ శ్రీరామ్ బాలాజీ ఆడనున్నారు. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ ఈ మేరకు ప్రకటించింది. డేవిస్ కప్ మాజీ కెప్టెన్ నందన్ బాల్ అధ్యక్షతన సెలక్షన్ కమిటీ మీటింగ్‌లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. యుకీ బాంబ్రి పేరూ పరిశీలనలో ఉన్నప్పటికీ.. కోర్టులో బాలాజీ వేగాన్ని దృష్టిలో పెట్టుకుని అతడికి అవకాశం కల్పించినట్లు వివరించింది.

News June 14, 2024

ఇంటర్నేషనల్ అవార్డు రేసులో ‘కెప్టెన్ మిల్లర్’

image

ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం లండన్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో నామినేషన్ దక్కించుకుంది. ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో నామినేట్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు. అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12న విడుదలై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్ కీలక పాత్రలు పోషించారు.