News June 14, 2024

జూన్ 14: చరిత్రలో ఈరోజు

image

✒ ప్రపంచ రక్తదాతల దినోత్సవం
✒ 1916: ప్రముఖ రచయిత బుచ్చిబాబు జననం
✒ 1928: అర్జెంటీనా విప్లవకారుడు చేగువేరా జననం
✒ 1941: సాహితీ చరిత్రకారుడు రంగనాథాచార్యులు జననం
✒ 1961: భౌతిక శాస్త్రవేత్త, పద్మభూషణ్ గ్రహీత కె.శ్రీనివాస కృష్ణన్ మరణం
✒ 2014: నటి తెలంగాణ శకుంతల మరణం
✒ 2014: సమరయోధుడు కానేటి మోహనరావు మరణం

News June 14, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 14, 2024

రూ.3 లక్షలు లంచం.. పారిపోతుండగా అరెస్ట్

image

TG: సీపీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వివాదంలో ఉన్న ఇంటి డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అతను ఓ వ్యక్తితో రూ.15 లక్షలకు డీల్ చేసుకున్నారు. బాధితుడు తొలి విడతలో రూ.5 లక్షలు ఇచ్చాడు. రెండో విడతలో రూ.3 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అక్కడికి రావడంతో సుధాకర్ పారిపోయాడు. సినిమా స్టైల్‌లో అతడిని వెంబడించి అరెస్ట్ చేశారు.

News June 14, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 14, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 14, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:42 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:16 గంటలకు
అసర్: సాయంత్రం 4:53 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:51 గంటలకు
ఇష: రాత్రి 8.13 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 14, 2024

స్కిల్ సెన్సస్‌పై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: రాష్ట్రంలో స్కిల్ <<13434576>>సెన్సన్<<>> చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. నైపుణ్య గణనకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని ఆదేశించింది. నిర్మాణ, ఉత్పత్తి, సేవా రంగాల్లో యువతకు ఉన్న నైపుణ్య వివరాలు సేకరించాలని సూచించింది. స్కిల్ డెవలప్‌మెంట్‌పై విధాన రూపకల్పనకు అవసరమైన సమాచారం సేకరించాలంది.

News June 14, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 14, శుక్రవారం
జ్యేష్ఠమాసం
శు.అష్టమి: అర్ధరాత్రి 12.04 గంటలకు
ఉత్తర ఫల్గుని: ఉదయం 8:14 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.8:14 నుంచి 9:06 వరకు
దుర్ముహూర్తం: మ.12:33 నుంచి 1:25 వరకు
వర్జ్యం: మ.1.16 నుంచి మ.3.04 వరకు

News June 14, 2024

TODAY HEADLINES

image

* ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
* మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన CBN
* కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్
* వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదు: మంత్రి నిమ్మల
* కూటమి విజయానికి పవనే కారణం: YCP ఎమ్మెల్సీ
* TG:రాష్ట్రవ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు: CS శాంతి కుమారి
* పాఠ్యపుస్తకాల నుంచి కేసీఆర్ ఫొటో తొలగింపు సరికాదు: సబిత

News June 14, 2024

ఫస్ట్ ఎయిడ్ అందించనున్న జొమాటో డెలివరీ ఏజెంట్లు

image

రోడ్లపై అత్యవసర సమయాల్లో వైద్య సహాయం అందించేలా తమ డెలివరీ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నట్లు ఆహార డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ దీపీందర్ గోయల్ ట్విటర్‌లో ప్రకటించారు. ‘నిన్న ముంబైలో 4300మంది డెలివరీ పార్టనర్లకు ఫస్ట్ ఎయిడ్ పాఠాలు నిర్వహించి మేం గిన్నిస్ రికార్డ్ బద్దలుగొట్టాం. ఇప్పుడు అత్యవసర సమయాల్లో 30వేలమంది జొమాటో ఏజెంట్లు వైద్య సహాయం అందించగలరు’ అని ట్వీట్ చేశారు.

News June 14, 2024

నెదర్లాండ్స్‌పై బంగ్లాదేశ్ గెలుపు

image

T20WCలో నెదర్లాండ్స్‌పై బంగ్లాదేశ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత 159/5 స్కోరు చేసిన బంగ్లా.. ప్రత్యర్థిని 134/8 స్కోరుకే కట్టడి చేసింది. రిషద్ హుస్సేన్ 3, టస్కిన్ 2 వికెట్లు పడగొట్టగా, ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్, మహ్మదుల్లా తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌లో షకీబ్ అల్ హసన్ 64*, తంజిద్ 35, మహ్మదుల్లా 25 పరుగులతో రాణించారు.