News June 13, 2024

కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు: బీజేపీ ఎంపీ

image

TG: మాజీ సీఎం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై కాసేపటి క్రితమే ఈడీ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కేసీఆర్, హరీశ్ రావు, వెంకట్రామి రెడ్డిలకు ముందు ముసళ్ల పండగేనని అన్నారు.

News June 13, 2024

G7లో సభ్యత్వం లేకున్నా.. మోదీకి ఆహ్వానం

image

ధనిక దేశాల కూటమి ‘G7’లో సభ్యత్వం లేకున్నా ప్రధాని మోదీ సదస్సులో పాల్గొంటున్నారు. జూన్ 13-15 మధ్య జరిగే ఈ సదస్సు కోసం ఇప్పటికే ఇటలీ వెళ్లారు. దీనికి ఆతిథ్యం ఇస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు మోదీ ఇందులో పాల్గొంటున్నారు. తాజా సదస్సులో గాజా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించనున్నారు. కాగా ‘G7’లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, USA సభ్య దేశాలుగా ఉన్నాయి.

News June 13, 2024

NEET: కొందరికి గ్రేస్ మార్కులు ఎందుకు కలిపారు?

image

NEET-2024లో కొందరికి కలిపిన <<13431802>>గ్రేస్ మార్కు<<>>లను కేంద్రం రద్దు చేసింది. కొన్ని కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైందని, ఆ కారణంగా సమయం కోల్పోయిన 1,563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల తెలిపింది. గతంలో కామన్ లా అడ్మిషన్ టెస్టు సందర్భంగా సమయం కోల్పోయిన వారి విషయంలో సుప్రీం సూచించిన ఫార్ములానే ఇప్పుడు వర్తింపజేసినట్లు పేర్కొంది.

News June 13, 2024

జనసేనానికి కృతజ్ఞతలు: మంత్రి నాదెండ్ల

image

AP: రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు చెప్పారు. ‘అంకితభావంతో, నిస్వార్థంగా అండగా ఉన్న జనసైనికులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సమన్వయ ప్రయత్నాలను అర్థం చేసుకొని మద్దతుగా నిలిచిన టీడీపీ, బీజేపీ సభ్యులకూ కృతజ్ఞతలు. తెనాలి ప్రజల అభిమానానికి ఎప్పుడూ రుణపడి ఉంటా. రాష్ట్ర భవిష్యత్తు కోసం సమష్టిగా కృషి చేద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు.

News June 13, 2024

రాజకీయాలకంటే సినిమాలే సులువు: కంగన

image

సినీరంగంతో పోలిస్తే రాజకీయాలు కష్టమని ఎంపీ కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘ఒకప్పుడు మా ముత్తాత ఎమ్మెల్యేగా చేశారు. రాజకీయాల్లోకి రావాలంటూ నాకూ ఆఫర్లు వచ్చాయి. సరైన సమయం కోసం ఆగాను. నటుల జీవితం ఒత్తిడిలేనిది. కానీ రాజకీయాల్లో ఎంతోమంది సమస్యలతో వస్తుంటారు. వాటిని జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుంది’ అని తెలిపారు. హిమాచల్‌లోని మండి నుంచి ఆమె బీజేపీ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.

News June 13, 2024

‘RRR’ రికార్డును బద్దలు కొట్టిన ‘కల్కి’

image

అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ప్రభాస్ ‘కల్కి’ మూవీ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బద్దలు కొట్టింది. అమెరికాలో RRR కంటే వేగంగా వన్ మిలియన్ ప్రీ సేల్స్ జరుపుకున్న భారతీయ చిత్రంగా కల్కి నిలిచింది. రిలీజ్‌కు రెండు వారాల ముందే ఈ స్థాయిలో బుకింగ్ జరగడం రికార్డు అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 27న రిలీజ్ కానున్న ఈ మూవీ కొత్త రికార్డులు సెట్ చేస్తుందని అంచనా వేస్తున్నాయి.

News June 13, 2024

సీఎం ఛాంబర్ సిద్ధం

image

AP: రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఛాంబర్ సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటల 41 నిమిషాలకు బాధ్యతలు స్వీకరించనుండటంతో పూలతో ఆఫీసును ముస్తాబు చేశారు. ఎంట్రన్స్ వద్ద సీఎం చంద్రబాబు నాయుడు నేమ్ ప్లేట్ అతికించారు. మరోవైపు బాధ్యతలు తీసుకున్నాక చంద్రబాబు తొలి సంతకం ఏ ఫైల్‌పై చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.

News June 13, 2024

ఈనెల 22న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈనెల 22న ఢిల్లీలో 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొననున్నారు. వస్తువులపై జీఎస్టీ రేట్లను ఈ సమావేశంలోనే నిర్ణయిస్తుంటారు. మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి నిర్వహిస్తున్న సమావేశంలో ఈసారి ఏయే అంశాలపై చర్చిస్తారనేది ఆసక్తిగా మారింది.

News June 13, 2024

అమెరికాకు సౌదీ షాక్.. పెట్రో డాలర్ డీల్ రద్దు!

image

అమెరికాతో పెట్రో డాలర్ డీల్‌ను రద్దు చేస్తూ సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 9న ఈ డీల్ గడువు ముగియగా దానిని పొడిగించేందుకు సౌదీ అంగీకరించలేదు. ఈ నిర్ణయంతో US డాలర్ ఆధిపత్యానికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ప్రపంచ దేశాలకు సౌదీ నుంచి కొనే చమురుకు రూపాయి, యూరో, యెన్ తదితర కరెన్సీల్లోనూ చెల్లించే సదుపాయం కలగనుంది. 1974 జూన్ 8న US-సౌదీ మధ్య ఈ పెట్రో డాలర్ డీల్ జరిగింది.

News June 13, 2024

‘కల్కి’ ట్రైలర్‌లో నా ఆర్ట్‌ను వాడుకున్నారు: సంగ్‌చోయ్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘కల్కి’ సినిమా ట్రైలర్‌లో ఇంట్రో సీన్‌ని కాపీ చేశారని హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంగ్‌చోయ్ ఆరోపించారు. కల్కి బృందం తన అనుమతి లేకుండానే తన ఆర్ట్‌వర్క్‌ను ఉపయోగించిందని ఆయన ఇన్‌స్టా వేదికగా మండిపడ్డారు. 10 ఏళ్ల క్రితం తాను క్రియేట్ చేసిన ఆర్ట్‌తో ట్రైలర్‌లోని VFX షాట్‌ను ఆయన కంపేర్ చేస్తూ పోస్ట్ చేశారు. దీనిపై ‘కల్కి’ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.