News January 8, 2025

OLA ఎలక్ట్రిక్ CEOకు సెబీ స్ట్రాంగ్ వార్నింగ్

image

OLA ఎలక్ట్రిక్ CEO భవీశ్ అగర్వాల్‌కు SEBI స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. లిస్టింగ్ రూల్స్‌ను పాటించకపోతే చర్యలు తప్పవంది. కంపెనీ సమాచారమేదైనా ముందుగా స్టాక్ ఎక్స్‌ఛేంజీలకే ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాతే బహిరంగంగా ప్రకటించొచ్చని సూచించింది. OLA స్టోర్లను ఈ నెల్లోనే 800 నుంచి 4000కు పెంచుతామంటూ భవీశ్ 2024, డిసెంబర్ 2న 9.58AMకి ట్వీట్ చేశారు. BSE, NSEకి మాత్రం 1.36PM తర్వాత సమాచారం ఇచ్చారు.

Similar News

News January 13, 2025

అప్పుడు జైలుకెళ్లిన వారికి రూ.20 వేల పెన్షన్

image

1975 నుంచి 1977 మ‌ధ్య దేశంలో ఎమర్జెన్సీ అమ‌లులో ఉన్న సమయంలో జైలుకెళ్లిన వారికి నెలవారీ రూ.20,000 పెన్షన్ మంజూరు చేస్తామ‌ని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. పెన్షన్‌తో పాటు వారి వైద్య ఖర్చులనూ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, జనవరి 1, 2025 నాటికి జీవించి ఉన్న వారందరికీ ఈ సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని తెలిపింది. జైలులో ఎన్ని రోజులు ఉన్నా స‌రే వారందరూ అర్హులే అని హోం శాఖ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది.

News January 13, 2025

టెస్టు కెప్టెన్‌గా జైస్వాల్‌ను ప్రతిపాదించిన గంభీర్?

image

రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరనే దానిపై BCCI తీవ్ర కసరత్తు చేస్తోంది. నిన్న, ఈరోజు అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కోచ్ గంభీర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే వర్క్‌లోడ్ ఎక్కువవుతుందని భావించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే సెలక్షన్ కమిటీ తెరపైకి పంత్ పేరును తీసుకొచ్చిందని సమాచారం. అయితే గంభీర్ అనూహ్యంగా జైస్వాల్ పేరును ప్రతిపాదించారట. మరి దీనిపై BCCI ఏమంటుందో చూడాలి.

News January 13, 2025

ఉక్రెయిన్‌తో యుద్ధంలో కేరళ వాసి మృతి

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో ర‌ష్యా త‌ర‌ఫున పోరాడుతున్న కేర‌ళ‌లోని త్రిసూర్‌ వాసి బినిల్(32) మృతి చెందారు. మ‌రొక‌రు గాయ‌ప‌డ్డారు. కొన్ని రోజుల క్రితం వీరు డ్రోన్ దాడిలో గాయ‌ప‌డిన‌ట్టు ఫ్యామిలీకి స‌మాచారం వ‌చ్చింది. బినిల్ భార్య మాస్కోలోని భార‌త ఎంబ‌సీని సంప్ర‌దించ‌గా ఆయన మృతిని వారు మౌఖికంగా అంగీక‌రించారు. తిరిగి ఇంటికి చేరుకొనేందుకు బాధితులిద్ద‌రూ గతంలో విఫ‌ల‌ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు తెలుస్తోంది.