India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తోన్న రొమాంటిక్ డ్రామా ‘రెట్రో’ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది మే 1వ తేదీన విడుదల చేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా సంతోశ్ నారాయణ్ మ్యూజిక్ అందించారు. సూర్య నటించిన ‘కంగువా’ ఇటీవలే విడుదలవగా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది.
AP: రాష్ట్రాన్ని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్‌గా మారుస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ‘విద్యార్థుల్లో ఇన్నోవేషన్, డీప్ టెక్ నైపుణ్యాలు పెంపొందిస్తాం. ఏఐ, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, హెల్త్ టెక్, ఎడ్యుటెక్ వంటి వాటిని ప్రోత్సహిస్తాం. ఉన్నత విద్యను సంస్కరిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
OLA ఎలక్ట్రిక్ CEO భవీశ్ అగర్వాల్‌కు SEBI స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. లిస్టింగ్ రూల్స్‌ను పాటించకపోతే చర్యలు తప్పవంది. కంపెనీ సమాచారమేదైనా ముందుగా స్టాక్ ఎక్స్‌ఛేంజీలకే ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాతే బహిరంగంగా ప్రకటించొచ్చని సూచించింది. OLA స్టోర్లను ఈ నెల్లోనే 800 నుంచి 4000కు పెంచుతామంటూ భవీశ్ 2024, డిసెంబర్ 2న 9.58AMకి ట్వీట్ చేశారు. BSE, NSEకి మాత్రం 1.36PM తర్వాత సమాచారం ఇచ్చారు.
ఆస్ట్రేలియాతో జరిగిన బీజీటీ చివరి మ్యాచులో టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. గాయం గ్రేడ్-1 కేటగిరీలో ఉండటంతో ఆయన ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అవకాశం లేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని వైద్యులు సూచించినట్లు పేర్కొన్నాయి. ఇక ఆయన ఐపీఎల్‌లోనే ఆడతారని అంచనా వేస్తున్నాయి. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.
TG: ఏసీబీ విచారణకు కేటీఆర్ వెంట లాయర్‌ను తీసుకెళ్లొచ్చని హైకోర్టు తెలిపింది. ఆడియో, వీడియో రికార్డు చేసేందుకు నిరాకరించగా సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది. మరోవైపు కేటీఆర్ వెంట లాయర్ రామచంద్రరావు వెళ్లనున్నారు. లైబ్రరీలో కేటీఆర్ న్యాయవాది కూర్చోని విచారణను చూసే సౌకర్యం ఉందని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. విచారణ తర్వాత అనుమానాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.
టెస్టుల్లో కెప్టెన్ రోహిత్‌కు వారసుడిగా బుమ్రా సరైన ఎంపిక కాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. బ్యాటర్ అయితే సరిగ్గా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. రాహుల్, పంత్‌లో ఆ లక్షణాలున్నాయని, వారిద్దరికీ ఐపీఎల్‌లో సారథ్యం వహించిన అనుభవం ఉందని తెలిపారు. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే బౌలింగ్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు.
AP: ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలి వారంలో ప్రజల్లోకి వస్తానని మాజీ CM జగన్ తెలిపారు. ప్రతి రోజూ రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెప్పారు. ‘YCP ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. చరిత్రలో లేని విధంగా మేనిఫెస్టో అమలు చేశాం. చంద్రబాబు వచ్చాక 3.5 లక్షల మంది పెన్షన్లు కోల్పోయారు. చంద్రబాబు హామీల అమలుపై మనం పట్టుబట్టాలి. బాబు దుర్మార్గపు పాలనపై నిలదీయాలి’ అని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
ప్రధాని మోదీ ఏపీకి చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఆయనకు గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో విశాఖ రైల్వే జోన్ సహా రూ.2లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఎక్కడికెళ్లినా మనీకి బదులుగా UPIని వినియోగించడం పెరిగిపోయింది. దీంతో మార్కెట్‌లో చిన్నా-పెద్దా అన్న తేడా లేకుండా ప్రతిచోట డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. అయితే, ప్రజలు అత్యధికంగా PhonePay వాడుతున్నట్లు తేలింది. డిసెంబర్-2024 UPI మార్కెట్ షేర్ ప్రకారం PhonePayని 47.7%, GooglePayని 36.7%, Paytmని 6.87% మంది వాడుతున్నారు. ఇంతకీ మీరు ఎక్కువగా ఏ పేమెంట్ యాప్ వాడుతారో కామెంట్ చేయండి.
భారత వాయుసేనలో అగ్నివీర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నిన్నటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవ్వగా 17.5-21 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ఇంటర్ పూర్తి చేసిన వారు అప్లై చేసేందుకు అర్హులు. అగ్నిపథ్ స్కీం ద్వారా నాలుగేళ్ల ప్రొబేషన్ తర్వాత 25శాతం మందిని విధుల్లోకి తీసుకుంటుంది. ట్రైనింగ్‌లో జీతం గరిష్ఠంగా రూ.40వేలు ఇస్తారు. ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.