News January 8, 2025

ఆయన ఆడిషన్ అడిగితే షాకయ్యా: హీరోయిన్

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి కాల్ చేసి ఆడిషన్ అడిగితే షాకైనట్లు హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ తెలిపారు. మొదట అనిల్ కాల్ చేయగానే ఎవరో తెలియదని చెప్పినట్లు వెల్లడించారు. ఆయన గురించి గూగుల్ చేసి తెలుసుకున్నట్లు చెప్పారు. సినిమాలో రోల్ కోసం లుక్ టెస్టు చేయాలని దర్శకుడు కోరినట్లు పేర్కొన్నారు. ఈ నెల 14న రిలీజ్ కానున్న ఈ మూవీలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య కనిపించనున్నారు.

News January 8, 2025

చంద్రబాబు వస్తున్నారు.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ట్వీట్

image

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 20 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-2025 వార్షిక సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ విషయాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ X వేదికగా ప్రకటించింది. 2024లో 125 దేశాల ప్రతినిధులు ఫోరమ్‌కు హాజరవగా ఈ ఏడాది కూడా G7 &G20 దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ప్రపంచ ప్రజాప్రతినిధులు రానున్నారు.

News January 8, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

image

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ 38 ఏళ్ల ప్లేయర్ కెరీర్‌లో 198 వన్డేలు, 122 T20లు, 47 టెస్టులు ఆడారు. 3 ఫార్మాట్లలో కలిపి 13,463 రన్స్ చేశారు. అందులో 23 సెంచరీలు ఉన్నాయి. 2022 సెప్టెంబర్‌లో చివరి వన్డే ఆడారు. వన్డేల్లో కివీస్ తరఫున డబుల్ సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచారు.

News January 8, 2025

మే 1న సూర్య ‘రెట్రో’ విడుదల

image

తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తోన్న రొమాంటిక్ డ్రామా ‘రెట్రో’ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది మే 1వ తేదీన విడుదల చేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా సంతోశ్ నారాయణ్ మ్యూజిక్ అందించారు. సూర్య నటించిన ‘కంగువా’ ఇటీవలే విడుదలవగా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది.

News January 8, 2025

గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్‌గా ఏపీ: లోకేశ్

image

AP: రాష్ట్రాన్ని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్‌గా మారుస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ‘విద్యార్థుల్లో ఇన్నోవేషన్, డీప్ టెక్ నైపుణ్యాలు పెంపొందిస్తాం. ఏఐ, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, హెల్త్ టెక్, ఎడ్యుటెక్ వంటి వాటిని ప్రోత్సహిస్తాం. ఉన్నత విద్యను సంస్కరిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News January 8, 2025

OLA ఎలక్ట్రిక్ CEOకు సెబీ స్ట్రాంగ్ వార్నింగ్

image

OLA ఎలక్ట్రిక్ CEO భవీశ్ అగర్వాల్‌కు SEBI స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. లిస్టింగ్ రూల్స్‌ను పాటించకపోతే చర్యలు తప్పవంది. కంపెనీ సమాచారమేదైనా ముందుగా స్టాక్ ఎక్స్‌ఛేంజీలకే ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాతే బహిరంగంగా ప్రకటించొచ్చని సూచించింది. OLA స్టోర్లను ఈ నెల్లోనే 800 నుంచి 4000కు పెంచుతామంటూ భవీశ్ 2024, డిసెంబర్ 2న 9.58AMకి ట్వీట్ చేశారు. BSE, NSEకి మాత్రం 1.36PM తర్వాత సమాచారం ఇచ్చారు.

News January 8, 2025

టీమ్ఇండియాకు బిగ్ షాక్!

image

ఆస్ట్రేలియాతో జరిగిన బీజీటీ చివరి మ్యాచులో టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. గాయం గ్రేడ్-1 కేటగిరీలో ఉండటంతో ఆయన ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అవకాశం లేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని వైద్యులు సూచించినట్లు పేర్కొన్నాయి. ఇక ఆయన ఐపీఎల్‌లోనే ఆడతారని అంచనా వేస్తున్నాయి. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.

News January 8, 2025

కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

image

TG: ఏసీబీ విచారణకు కేటీఆర్ వెంట లాయర్‌ను తీసుకెళ్లొచ్చని హైకోర్టు తెలిపింది. ఆడియో, వీడియో రికార్డు చేసేందుకు నిరాకరించగా సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది. మరోవైపు కేటీఆర్ వెంట లాయర్ రామచంద్రరావు వెళ్లనున్నారు. లైబ్రరీలో కేటీఆర్ న్యాయవాది కూర్చోని విచారణను చూసే సౌకర్యం ఉందని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. విచారణ తర్వాత అనుమానాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.

News January 8, 2025

టెస్టు కెప్టెన్‌గా బుమ్రా సరికాదు: కైఫ్

image

టెస్టుల్లో కెప్టెన్ రోహిత్‌కు వారసుడిగా బుమ్రా సరైన ఎంపిక కాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. బ్యాటర్ అయితే సరిగ్గా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. రాహుల్, పంత్‌లో ఆ లక్షణాలున్నాయని, వారిద్దరికీ ఐపీఎల్‌లో సారథ్యం వహించిన అనుభవం ఉందని తెలిపారు. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే బౌలింగ్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు.

News January 8, 2025

ఈ నెలాఖరు నుంచి జనంలోకి జగన్!

image

AP: ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలి వారంలో ప్రజల్లోకి వస్తానని మాజీ CM జగన్ తెలిపారు. ప్రతి రోజూ రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెప్పారు. ‘YCP ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. చరిత్రలో లేని విధంగా మేనిఫెస్టో అమలు చేశాం. చంద్రబాబు వచ్చాక 3.5 లక్షల మంది పెన్షన్లు కోల్పోయారు. చంద్రబాబు హామీల అమలుపై మనం పట్టుబట్టాలి. బాబు దుర్మార్గపు పాలనపై నిలదీయాలి’ అని పార్టీ కార్యకర్తలకు సూచించారు.