News January 8, 2025

కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

image

TG: ఏసీబీ విచారణకు కేటీఆర్ వెంట లాయర్‌ను తీసుకెళ్లొచ్చని హైకోర్టు తెలిపింది. ఆడియో, వీడియో రికార్డు చేసేందుకు నిరాకరించగా సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది. మరోవైపు కేటీఆర్ వెంట లాయర్ రామచంద్రరావు వెళ్లనున్నారు. లైబ్రరీలో కేటీఆర్ న్యాయవాది కూర్చోని విచారణను చూసే సౌకర్యం ఉందని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. విచారణ తర్వాత అనుమానాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.

News January 8, 2025

టెస్టు కెప్టెన్‌గా బుమ్రా సరికాదు: కైఫ్

image

టెస్టుల్లో కెప్టెన్ రోహిత్‌కు వారసుడిగా బుమ్రా సరైన ఎంపిక కాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. బ్యాటర్ అయితే సరిగ్గా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. రాహుల్, పంత్‌లో ఆ లక్షణాలున్నాయని, వారిద్దరికీ ఐపీఎల్‌లో సారథ్యం వహించిన అనుభవం ఉందని తెలిపారు. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే బౌలింగ్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు.

News January 8, 2025

ఈ నెలాఖరు నుంచి జనంలోకి జగన్!

image

AP: ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలి వారంలో ప్రజల్లోకి వస్తానని మాజీ CM జగన్ తెలిపారు. ప్రతి రోజూ రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెప్పారు. ‘YCP ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. చరిత్రలో లేని విధంగా మేనిఫెస్టో అమలు చేశాం. చంద్రబాబు వచ్చాక 3.5 లక్షల మంది పెన్షన్లు కోల్పోయారు. చంద్రబాబు హామీల అమలుపై మనం పట్టుబట్టాలి. బాబు దుర్మార్గపు పాలనపై నిలదీయాలి’ అని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

News January 8, 2025

విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ ఏపీకి చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఆయనకు గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో విశాఖ రైల్వే జోన్ సహా రూ.2లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

News January 8, 2025

UPI మార్కెట్ షేర్‌ ఇలా!

image

ఎక్కడికెళ్లినా మనీకి బదులుగా UPIని వినియోగించడం పెరిగిపోయింది. దీంతో మార్కెట్‌లో చిన్నా-పెద్దా అన్న తేడా లేకుండా ప్రతిచోట డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. అయితే, ప్రజలు అత్యధికంగా PhonePay వాడుతున్నట్లు తేలింది. డిసెంబర్-2024 UPI మార్కెట్ షేర్ ప్రకారం PhonePayని 47.7%, GooglePayని 36.7%, Paytmని 6.87% మంది వాడుతున్నారు. ఇంతకీ మీరు ఎక్కువగా ఏ పేమెంట్ యాప్ వాడుతారో కామెంట్ చేయండి.

News January 8, 2025

APPLY.. ట్రైనింగ్‌లోనే నెలకు రూ.40 వేల జీతం

image

భారత వాయుసేనలో అగ్నివీర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నిన్నటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవ్వగా 17.5-21 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ఇంటర్ పూర్తి చేసిన వారు అప్లై చేసేందుకు అర్హులు. అగ్నిపథ్ స్కీం ద్వారా నాలుగేళ్ల ప్రొబేషన్ తర్వాత 25శాతం మందిని విధుల్లోకి తీసుకుంటుంది. ట్రైనింగ్‌లో జీతం గరిష్ఠంగా రూ.40వేలు ఇస్తారు. ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

News January 8, 2025

షేక్ హసీనా వీసా పొడిగించిన కేంద్రం!

image

బంగ్లా మాజీ PM షేక్ హసీనా వీసా గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించినట్టు తెలుస్తోంది. గత ఆగస్టు నుంచి ఆమె భారత్‌‌లోనే తలదాచుకుంటున్నారు. గడువు పెంపుతో ఆమె మరికొంత కాలం ఇక్కడే ఉండేందుకు వీలవుతుంది. అయితే ఇది రాజకీయ ఆశ్రయం కల్పించినట్టు కాదని తెలుస్తోంది. నిన్న ఆమె పాస్‌పోర్టును బంగ్లా ప్రభుత్వం రద్దుచేసింది. ఓవైపు ఆమెను తిరిగి పంపించాలని యూనస్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదు.

News January 8, 2025

గురుకులాల్లో ప్రవేశాలు.. ఇలా అప్లై చేసుకోండి!

image

TG: వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకులాల్లో 5-9 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. <>https://tgcet.cgg.gov.in<<>> సైట్‌లో ఫిబ్రవరి 1లోపు అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష (TG CET)ను ఫిబ్రవరి 28న నిర్వహిస్తారు. SC, ST, BC, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి, SC, ST గురుకులాల్లో 6-9, TGSWREIS గౌలిదొడ్డి, అలుగునూరు COEలలో 9, TGTWREIS ఖమ్మం, పరిగి SOEలలో ఎనిమిదో తరగతి ప్రవేశాలకు సీట్లను భర్తీ చేస్తారు.

News January 8, 2025

మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

TG: కింగ్ ఫిషర్, హీనెకిన్ బీర్లను సరఫరా చేయలేమని యునైటెడ్ బేవరేజెస్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. గత ఐదేళ్లుగా బీర్ల ధరల పెంపునకు TGBCL అంగీకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇంతటి భారీ నష్టాల్లో తాము బీర్లను సరఫరా చేయలేమని పేర్కొంది. కాగా రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ఈ బీర్లు దొరకకపోవడంతో కొన్నేళ్లుగా మందుబాబులు జిల్లా కలెక్టర్లకు కూడా ఫిర్యాదులు చేశారు.

News January 8, 2025

పరీక్షల తొలగింపుపై నిర్ణయం జరగలేదు: BIE

image

ఫస్ట్ ఇయర్ బోర్డు పరీక్షల తొలగింపుపై తుది నిర్ణయం జరగలేదని ఏపీ ఇంటర్ బోర్డు వెల్లడించింది. కొత్త ప్రతిపాదనలపై ప్రస్తుతం సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. అన్ని వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది.