News March 20, 2024

ఫోన్ల లాక్ తీయించి ప్రశ్నలు!

image

TG: ఎమ్మెల్సీ కవితను ఈడీ నాలుగో రోజు విచారించింది. ఇవాళ ఆమె పీఏలు రాజేశ్, రోహిత్‌లను కూడా విచారించినట్లు సమాచారం. కవిత అరెస్టు సమయంలో పీఏల ఫోన్లను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. వారి సమక్షంలోనే ఫోన్‌లను లాక్ తీయించి అందులోని సమాచారం ఆధారంగా ఈడీ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఇక రాత్రి 7గంటల సమయంలో కవితను మాజీ మంత్రి కేటీఆర్, లాయర్ మోహిత్ కలిశారు. ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం.

News March 20, 2024

ఆపరేషన్ పిఠాపురం

image

AP: పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ‘ఆపరేషన్ పిఠాపురం’లో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడితో పాటు కాపు నేతలైన ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబులతో ప్రచారం చేయించనున్నట్లు తెలుస్తోంది. కీలక నేతలకు వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. త్వరలోనే పిఠాపురంలో సీఎం జగన్ బస్సుయాత్ర కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

News March 20, 2024

కవిత త్వరగా బయటకు రావాలంటే..: అర్వింద్

image

TS: కవిత అరెస్టుతో BJP, BRS మధ్య ఒప్పందం ఉందనే ప్రచారం అబద్ధమేనని తేలిపోయిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. మొదటి నుంచి తాము ఇదే చెబుతున్నామని వ్యాఖ్యానించారు. కవిత త్వరగా బయటకు రావాలంటే ఆమె భర్త అనిల్ తప్పించుకుని తిరగకుండా.. ఈడీ విచారణకు సహకరించాలని సూచించారు. తెలంగాణలోని 16 ఎంపీ సీట్లలో BRS డిపాజిట్ కోల్పోతుందని, ఒక్క మెదక్ స్థానంలోనే BRSకు డిపాజిట్ వస్తుందని జోస్యం చెప్పారు.

News March 20, 2024

జగ్గీ వాసుదేవ్‌కు ప్రధాని మోదీ ఫోన్

image

ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు <<12891847>>జగ్గీ<<>> వాసుదేవ్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జగ్గీవాసుదేవ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్ చేశారు. దీనికి ‘నాపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ జగ్గీ వాసుదేవ్‌ రిప్లై ఇచ్చారు.

News March 20, 2024

షమీ స్థానంలో సందీప్, మధుశంక స్థానంలో మఫకా

image

IPL: గాయపడ్డ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో సందీప్ వారియర్‌ను తీసుకున్నట్లు గుజరాత్ టైటాన్స్ ప్రకటించింది. రూ.50 లక్షల ధర చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. మీడియం పేసర్ అయిన సందీప్.. ఇది వరకు ఆర్సీబీ, కేకేఆర్, ముంబై తరఫున ఆడారు. ఇక ముంబై పేసర్ దిల్షాన్ మధుశంక స్థానంలో సౌతాఫ్రికా లెఫ్టార్మ్ పేసర్ క్వెనా మఫకాను టీంలోకి తీసుకున్నారు. మఫకా అండర్-19 WCలో అత్యధిక వికెట్లు తీశారు.

News March 20, 2024

కేంద్రమంత్రిపై ఈసీ ఆగ్రహం

image

కేంద్ర మంత్రి శోభ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా కర్ణాటక సీఈవోను ఆదేశించింది. కాగా రామేశ్వరం పేలుళ్ల వెనుక తమిళుల పాత్ర ఉందని శోభ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు తన వ్యాఖ్యలపై శోభ క్షమాపణలు చెప్పింది.

News March 20, 2024

నీట్ పీజీ ఎగ్జామ్ ప్రీపోన్డ్

image

NEET PG-2024 పరీక్ష ప్రీపోన్డ్ అయింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జులై 7న జరగాల్సి ఉంది. అయితే జూన్ 23న నిర్వహించాలని నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయించింది. జులై 15న ఫలితాలు వెలువడనున్నాయి.

News March 20, 2024

పరీక్షలపై విద్యార్థులకు బిగ్ అలర్ట్

image

AP: ఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. మే 13న పోలింగ్ నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన ఈఏపీసెట్ పరీక్షలను మే 16కు వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈఏపీసెట్ నిర్వహిస్తారు.

News March 20, 2024

జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: CBN

image

ఏపీలో ఎన్డీయే కూటమికి జయప్రకాశ్ నారాయణ మద్దతు తెలపడంపై చంద్రబాబు స్పందించారు. ‘టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి సపోర్ట్ చేస్తున్నట్లు జయప్రకాశ్ నారాయణ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. రాష్ట్రంలో ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు, ప్రతి సంస్థ ముందుకు రావాలి’ అని Xలో పిలుపునిచ్చారు.

News March 20, 2024

నాగార్జున అంటే ఎంతో ఇష్టం: నటి

image

సీనియర్ నటి కస్తూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చదువుకునే రోజుల నుంచి హీరో నాగార్జున అంటే తనకు ఇష్టమని చెప్పారు. ఆ రోజుల్లోనే అక్కినేని హీరోను కలిశానని, షేక్ హ్యాండ్ కూడా ఇచ్చానని తెలిపారు. నాగార్జున టచ్ చేసిన చేయి అంటూ అంతా తాకేవారన్నారు. ఆయన అంటే ఇప్పటికీ అదే ఇష్టం ఉందని చెప్పుకొచ్చారు. కాగా ‘అన్నమయ్య’ సినిమాలో నాగార్జున సరసన కస్తూరి నటించారు. ప్రస్తుతం ఆమె సీరియళ్లలో నటిస్తున్నారు.