News January 8, 2025

కాంగ్రెస్‌కు షాక్: ఢిల్లీలో ఆప్‌కే INDIA మద్దతు

image

‘INDIA’లో కాంగ్రెస్‌పై అపనమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ AAPకే మద్దతు ఇస్తున్నాయి. SP, SS UBT, TMC, RJD అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా ప్రచారం చేయనున్నాయి. హస్తం పార్టీనెవరూ పట్టించుకోవడం లేదు. నిజానికి అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాంధీలే లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్యారీ దీదీ స్కీమ్‌నూ DK శివకుమార్ ప్రకటించారు. INC ఎలాగూ గెలవదనే కూటమి AAP వైపు మళ్లినట్టుంది.

News January 8, 2025

BITCOIN షాక్: 24 గంటల్లో Rs5 లక్షల నష్టం

image

క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో భారీగా పతనమయ్యాయి. మార్కెట్ విలువ 6.29% తగ్గి $3.36Tకు చేరుకుంది. బిట్‌కాయిన్ ఏకంగా 5.45% ఎరుపెక్కింది. $1,02,000 నుంచి $96,000కు తగ్గింది. అంటే $6000 (Rs 5.10L) నష్టపోయింది. మార్కెట్ విలువ $1.91Tకి తగ్గింది. ఇథీరియం 9.98% పడిపోయి $3,349 వద్ద కొనసాగుతోంది. XRP 4.16, BNB 4.59, SOL 8.95, DOGE 10.53, ADA 8.77, TRON 7.56, SUI 7.32, LINK 10.51% మేర ఎరుపెక్కాయి.

News January 8, 2025

ఒకరి మృతి.. అస్సాంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

image

అస్సాం దిమా హసావా జిల్లాలోని కోల్‌మైన్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నెల 6న గనిలోకి ఒక్కసారిగా నీరు చేరడంతో కార్మికులు కేకలేస్తూ బయటికి వచ్చారు. మైన్‌లో చిక్కుకుపోయిన వారిలో ఒకరి మృతదేహాన్ని నేడు వెలికి తీయగా మరో 8మంది కోసం గాలిస్తున్నారు. అయితే మైన్‌లో 15-16 మంది చిక్కుకున్నట్లు అక్కడ పనిచేసే ఓ మైనర్ చెప్పాడు. ఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర CM బిశ్వ‌శర్మ ఆదేశించారు.

News January 8, 2025

కేటీఆర్ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు

image

TG: ఏసీబీ విచారణకు లాయర్లను అనుమతించాలని కేటీఆర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీనిపై కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది. కాగా ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు.

News January 8, 2025

5 రోజులు సెలవులు.. నెట్టింట ఫైర్

image

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టల్స్ 5 రోజులు సెలవులు ప్రకటించాయి. ఈనెల 13 నుంచి 17వరకు మెస్ పనిచేయదని, ఫుడ్ ఉండదని తెలిపాయి. ఇది హాస్టల్స్ అసోసియేషన్ ఆర్డర్ అని, దీనిని ఏ హాస్టలయినా అతిక్రమిస్తే రూ.20వేలు ఫైన్ విధిస్తుందన్నాయి. దీంతో 30 రోజులకూ ఫీజు చెల్లించామని, ఇలా 5 రోజులు ఫుడ్ లేకపోతే ఎక్కడ తినాలని హాస్టలర్స్ ఫైర్ అవుతున్నారు. పండుగ వేళ హోటల్స్ కూడా క్లోజవుతాయని వాపోతున్నారు.

News January 8, 2025

సినిమాలు మానేద్దామనుకున్నా: శివ కార్తికేయన్

image

తాను ఒకప్పుడు సినిమాలు మానేద్దామని అనుకున్నట్లు తమిళ హీరో శివ కార్తికేయన్ వెల్లడించారు. ‘ఏమీలేని స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావు. అజిత్, విక్రమ్ లాంటి వారూ బ్యాగ్రౌండ్ లేకుండానే ఎదిగారు’ అంటూ తన భార్య మోటివేట్ చేయడంతో ఆగిపోయానని తెలిపారు. ‘ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. యాంకర్ స్థాయి నుంచి యాక్టర్‌గా ఎదిగిన నన్ను చాలా మంది అవమానించారు. నా విజయమే వారికి సమాధానం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

News January 8, 2025

ఫార్ములా-ఈ కేసు: విచారణకు హాజరైన నిందితులు

image

TG: ఫార్ములా-ఈ కేసులో HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. పలు డాక్యుమెంట్లతో హాజరైన ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రూ.45.71కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. మరోవైపు ఇదే వ్యవహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.

News January 8, 2025

Stock Markets: O&G షేర్లు అదుర్స్.. మిగతావి బెదుర్స్

image

బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఒపెక్ కంట్రీస్ క్రూడాయిల్ సరఫరాను తగ్గించడం, బలహీనమైన US జాబ్‌డేటా నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. నిఫ్టీ 23,644 (-62), సెన్సెక్స్ 77,986 (-218) వద్ద ట్రేడవుతున్నాయి. Oil & Gas మినహా అన్ని రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. RIL, DRREDDY, ONGC, AXISBANK, BPCL టాప్ గెయినర్స్. TRENT టాప్ లూజర్.

News January 8, 2025

టాటా సుమో మళ్లీ వస్తోంది!

image

1990, 2000ల్లో విపరీతమైన ఆదరణ పొందిన టాటా సుమో మళ్లీ వచ్చే అవకాశముంది. ఈ సంవత్సరం టాటా మోటార్స్ ఈ వాహనాన్ని రీలాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని అలాగే ఉంచి ఆధునాతన ఫీచర్లతో ఈ SUVని రూపొందించనున్నట్లు సమాచారం. ధర రూ.10-15 లక్షలుగా నిర్ణయించే ఛాన్స్ ఉంది. కాగా టాటా సుమో తొలి మోడల్ 1994లో వచ్చింది.

News January 8, 2025

వారి ఎక్స్‌గ్రేషియా రూ.5లక్షలకు పెంపు

image

AP: ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.4 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు చేనేత, చేతి వృత్తులు చేసుకునే వారు ముంపుబారిన పడితే ఇచ్చే సాయాన్ని రూ.10వేల నుంచి రూ.25వేలకు పెంచారు. అలాగే విపత్తుల వేళ నీట మునిగిన ద్విచక్రవాహనాలకు రూ.3వేలు, ఆటోలకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది.