News March 22, 2024

ఎలక్టోరల్ బాండ్స్: వైసీపీకి ఎక్కువ విరాళాలు ఇచ్చిన సంస్థలివే

image

☛ ఫ్యూచర్ గేమింగ్&హోటల్ సర్వీసెస్-₹150కోట్లు
☛ మేఘా ఇంజినీరింగ్ – ₹37కోట్లు
☛ ద రామ్‌కో సిమెంట్స్ – ₹24కోట్లు
☛ ఓస్ట్రో మాధ్య విండ్ ప్రైవేట్ లిమిటెడ్ – ₹17కోట్లు
☛ ఓస్ట్రో జైసల్మేర్ ప్రైవేట్ లిమిటెడ్ – ₹17కోట్లు
☛ స్నేహ కైనెటిక్ పవర్ ప్రాజెక్ట్స్ – ₹10కోట్లు

News March 22, 2024

ఎలక్టోరల్ బాండ్స్: టీడీపీకి ఎక్కువ విరాళాలు ఇచ్చిన సంస్థలివే

image

☛ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్- ₹40కోట్లు
☛ మేఘా ఇంజినీరింగ్ – ₹28కోట్లు
☛ వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ – ₹20కోట్లు
☛ నాట్కో ఫార్మా – ₹14కోట్లు
☛ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్- ₹13కోట్లు
☛ భారత్ బయోటెక్ – ₹10కోట్లు

News March 22, 2024

అలంపూర్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

image

TG: అలంపూర్ BRS MLA విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. తదుపరి విచారణను APR 18కి వాయిదా వేసింది. ‘పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే విజయుడు నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాల్లో తన ఉద్యోగం గురించి ప్రస్తావించలేదు. ఈసీ రూల్స్‌కు ఇది విరుద్ధం. ఆయన ఎన్నిక చెల్లదు’ అని BSP అభ్యర్థి ప్రసన్న కోర్టును ఆశ్రయించారు.

News March 22, 2024

మే 2 నుంచి APRCET

image

AP: రాష్ట్రంలోని వర్సిటీల్లో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి మే 2 నుంచి 5 వరకు APRCET నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దేవరాజులు తెలిపారు. ఈ నెల 19తోనే దరఖాస్తు గడువు ముగియగా, ఈ నెల 29 వరకు రూ.2వేలు, ఏప్రిల్ 6 వరకు రూ.5వేల అపరాధ రుసుముతో అప్లై చేసుకోవచ్చని చెప్పారు. ఏప్రిల్ 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.

News March 22, 2024

BRSకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలు ఇవే!

image

ఎలక్టోరల్ బాండ్స్‌ డేటాలో యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బీఆర్ఎస్ పార్టీకి రూ.94 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తేలింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల ముందు కూడా విరాళం ఇచ్చింది. కాగా ‘MEIL’ రూ.195 కోట్లు, చెన్నై గ్రీన్‌వుడ్స్ ప్రై. లిమిటెడ్ రూ.50 కోట్లు, డా. రెడ్డీస్ ల్యాబ్స్ రూ.32 కోట్లు, హెటిరో డ్రగ్స్ రూ.30 కోట్లు, హెటిరో ల్యాబ్స్ రూ.20 కోట్లు, DIVIS ల్యాబ్స్ రూ.20 కోట్లు BRSకి అందించాయి.

News March 22, 2024

వంగా గీతను గెలిపించి సీఎం వద్దకు వస్తా: దొరబాబు

image

AP: పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించి తీరుతామని సిట్టింగ్ MLA పెండెం దొరబాబు ధీమా వ్యక్తం చేశారు. YCP అభ్యర్థి వంగా గీతను గెలిపించుకొని సీఎం జగన్ వద్దకు వస్తానని తెలిపారు. సీఎంతో సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘పొత్తులతో టీడీపీ-బీజేపీ-జనసేన ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో జగన్ బొమ్మను చెరపడం ఎవరికీ సాధ్యం కాదు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలూ వైసీపీనే గెలుచుకుంటుంది’ అని తేల్చిచెప్పారు.

News March 22, 2024

నేడు అకౌంట్లోకి డబ్బులు

image

TG: రైతుబంధు డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 5 ఎకరాల వరకు రైతుబంధు నగదును ఇవాళ జమ చేస్తామని వెల్లడించారు. అటు ధరణి పేరుతో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ 23 ఎకరాలను తన పేరుపై అక్రమంగా మార్చుకున్నారని తెలిపారు. చాలామంది బీఆర్ఎస్ లీడర్లు వందల ఎకరాల భూమిని తమ పేరు మీదకు మార్చుకున్నట్లు పేర్కొన్నారు.

News March 22, 2024

ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరు?

image

మద్యం పాలసీ కేసులో అరెస్టయినప్పటికీ కేజ్రీవాల్ ఢిల్లీ CMగా కొనసాగుతారని AAP స్పష్టం చేసింది. అయితే ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే లేదా ఆయనకు శిక్ష పడితే నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. రిటైర్డ్ IRS అధికారిణి అయిన ఆయన భార్య సునీత, మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్‌లలో ఒకరికి అవకాశం దక్కొచ్చని చర్చ జరుగుతోంది. అలాగే పార్టీ పగ్గాలను పంజాబ్ CM భగవంత్ మాన్‌కు అప్పగించే అవకాశముందని చెబుతున్నారు.

News March 22, 2024

మోదీ, కేసీఆర్‌కు తేడా లేదు: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో KCR శకం ముగిసిందని, ఇక ఏం చేసినా ఆయనను ప్రజలు నమ్మరని CM రేవంత్ అన్నారు. ‘KCR అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఆయన రాష్ట్రాన్ని అప్పులపాలు, అవినీతిమయం చేశారు. మోదీ, ఆయన ఒకే రకమైన నేతలు. అప్రజాస్వామిక విధానాలు, హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో వారిద్దరికి తేడా లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

News March 22, 2024

భువనేశ్వరి చెక్కుల పంపిణీపై ఈసీకి ఫిర్యాదు

image

AP: ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెక్కులు పంపిణీ చేయడంపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్థిక సాయం చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. చెక్కుల పంపిణీపై కలెక్టర్ల నుంచి నివేదిక కోరినట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. డబ్బుల పంపిణీ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.