News June 7, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌కు బెయిల్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. తన తల్లి పెద్ద ఖర్మ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 10 నుంచి 14 వరకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. BRS హయాంలో టాస్క్‌ఫోర్స్ మాజీ DCP ప్రభాకర్ అధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారవేత్తలు, హవాలా వ్యాపారం చేసే వ్యక్తుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టిన కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

News June 7, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారం.. ముహూర్తం ఖరారు

image

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉ.11.27 గంటలకు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. CBN ప్రమాణస్వీకారానికి నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు రానున్నారు.

News June 7, 2024

నా తల్లి గౌరవం కోసం వేల ఉద్యోగాలైనా వదులుకుంటా: కౌర్

image

తనకు ఉద్యోగం పోతుందనే భయం లేదని కంగనాపై చేయి చేసుకున్న CISF మాజీ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ అన్నారు. తన తల్లి గౌరవం కోసం ఇలాంటి వేల ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి సిద్ధమని తెలిపారు. కంగనాను చెంపదెబ్బ కొట్టినందుకు అధికారులు ఆమెను జాబ్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు జాబ్ ఇస్తామంటూ పలువురు ముందుకొస్తున్నారు. డ్యూటీలో ఉండగా ఆమె అలా చేయడం సరైంది కాదని మరికొందరు అంటున్నారు.

News June 7, 2024

5 రోజుల్లో ₹579 కోట్లు సంపాదించిన నారా భువనేశ్వరి!

image

ఏపీలో చంద్రబాబు ఘన విజయంతో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు గత 5 రోజుల్లో రికార్డు స్థాయిలో 55% పెరిగాయి. ఇవాళ కూడా 10% పెరిగి అప్పర్ సర్క్యూట్‌‌ను తాకాయి. జూన్ 3న (ఎన్నికల ఫలితాలకు ముందు రోజు) రూ.424గా ఉన్న హెరిటేజ్ షేర్.. ఇవాళ రూ.661కి చేరింది. తద్వారా ఆ కంపెనీ ప్రమోటర్ భువనేశ్వరి సంపద 5 రోజుల్లో రూ.579 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. హెరిటేజ్‌లో భువనేశ్వరి 24.37 శాతం వాటాను కలిగి ఉన్నారు.

News June 7, 2024

ధనిక దేశంలో మ్యాచ్ ఫీజు రూ.20 వేలే!

image

టీ20 వరల్డ్ కప్‌లో పసికూనగా బరిలోకి దిగిన USA సంచలనాలు నమోదు చేస్తోంది. పాక్ లాంటి మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ జట్టు ప్లేయర్లలో చాలా మంది ఉద్యోగాలు చేస్తూనే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నారు. వారి మ్యాచ్ ఫీజు కూడా తక్కువేనని తెలుస్తోంది. ఒక్కో మ్యాచ్‌కు కేవలం రూ.20 వేలు చెల్లిస్తున్నారట. భారత క్రికెటర్లకు టీ20 మ్యాచ్ ఫీజు రూ.3 లక్షలుగా ఉంది.

News June 7, 2024

వాట్సాప్‌లో ‘స్టేటస్ ర్యాంకింగ్’ ఫీచర్

image

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ‘స్టేటస్ ర్యాంకింగ్’ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా యూజర్ల చాట్ హిస్టరీ ఆధారంగా స్టేటస్‌లు ఆర్డర్‌లో కనిపిస్తాయి. తరచుగా చాట్ చేసేవి, రీసెంట్‌గా మెసేజులు చేసిన కాంటాక్ట్‌ల స్టేటస్‌లను టాప్‌లో చూపిస్తుంది. అలాగే ఎక్స్‌పైరీ టైమ్ దగ్గరపడ్డ వాటిని కూడా పైన కనపడేలా డిస్‌ప్లే చేస్తుంది. దీంతో యూజర్లు ముఖ్యమైన అప్‌డేట్స్ కోల్పోకుండా ఉంటారని సంస్థ భావిస్తోంది.

News June 7, 2024

మంగళగిరి AIIMS వద్ద చంద్రబాబు ప్రమాణస్వీకారం?

image

AP: మంగళగిరి ఎయిమ్స్ వద్ద విశాలమైన స్థలంలో చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు స్థలాన్ని పరిశీలించారు. నేడో రేపో వేదికను అధికారికంగా పార్టీ ప్రకటించనుంది. కాగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతోపాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది.

News June 7, 2024

అశోక్ గజపతిరాజు సతీమణికి తీవ్ర అస్వస్థత

image

AP: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు సతీమణి సునీల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం ఎమ్మెల్యేగా అశోక్ కుమార్తె అదితి విజయలక్ష్మి విజయం సాధించారు.

News June 7, 2024

పాక్‌తో మ్యాచ్ చరిత్ర అవుతుంది: హార్దిక్ పాండ్య

image

T20WCలో ఎల్లుండి పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ తనకు మరింత స్పెషల్‌గా ఉంటుందని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వెల్లడించారు. ఇది పోరాటం కాదు.. చరిత్ర అవుతుందని పేర్కొన్నారు. ‘పాక్‌తో పోరు ఎప్పుడూ భావోద్వేగంతో ఉంటుంది. ఆనందం, బాధ, ఆందోళన అన్నింటినీ అభిమానులు, ఆటగాళ్లు అనుభవిస్తారు. కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. హార్దిక్ పాక్‌పై 6 మ్యాచ్‌లలో 84 రన్స్, 11 వికెట్లు పడగొట్టారు.

News June 7, 2024

కాంగ్రెస్: 3 ఎన్నికల్లో 195.. బీజేపీ: 2024లోనే 240

image

2014లో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి బీజేపీ తిరుగులేని శక్తిగా మారింది. 2014 నుంచి ఇప్పటివరకు 3 ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన మొత్తం సీట్ల కంటే 2024లో బీజేపీ సాధించిన సీట్లు ఎక్కువ కావడం గమనార్హం. హస్తం పార్టీ 2014లో 44, 2019లో 52, 2024లో 99 సీట్లు.. అంటే మొత్తం 195 స్థానాల్లో గెలిచింది. అయితే 2024 ఎన్నికల్లోనే బీజేపీ 240 సీట్లు సాధించింది.