News January 8, 2025

ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి.నారాయణన్

image

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) కొత్త ఛైర్మన్‌గా డా.వి.నారాయణన్ నియమితులయ్యారు. ఈమేరకు ఇస్రో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 14న నారాయణన్ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌గా ఎస్.సోమనాథ్ ఉన్నారు. ఆయన సారథ్యంలోనే చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది.

Similar News

News January 19, 2025

‘కన్నప్ప’ స్టోరీ ఐడియా ఆయనదే: మంచు విష్ణు

image

‘కన్నప్ప’ సినిమా గురించి ఏడెనిమిదేళ్లుగా ప్లానింగ్‌లో ఉన్నట్లు హీరో మంచు విష్ణు చెప్పారు. బడ్జెట్ కారణాల వల్ల ఇప్పుడు కుదిరిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాకు ఐడియా తనికెళ్ల భరణి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ వంటి స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

News January 19, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో నా ఫేవరెట్ టీమ్ పాక్: గవాస్కర్

image

ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో తన ఫేవరెట్ టీమ్ పాకిస్తాన్ అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పారు. స్వదేశంలో పాక్‌ను ఓడించడం అంత సులువు కాదని తెలిపారు. స్వదేశంలో ఆడటం ఆ జట్టుకు కలిసొస్తుందన్నారు. గత వరల్డ్‌కప్ ఫైనల్లో అతిథ్య భారత జట్టు ఓడినా టోర్నీ మొత్తం అదిరిపోయే ప్రదర్శన చేసిందని గుర్తు చేశారు. CTకి పాకిస్తాన్, యూఏఈ అతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

News January 19, 2025

నేటి నుంచి కొమురవెల్లి జాతర

image

TG: నేటి నుంచి కొమురవెల్లి మల్లన్న జాతర మొదలవనుంది. 2 నెలల పాటు జరిగే ఈ జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం నుంచి ఉగాది ముందు వచ్చే ఆదివారం వరకు ఈ జాతర జరగనుంది. ఇవాళ తొలి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు బోనాలు, పట్నాలతో స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు.