News June 5, 2024

బోయపాటికి CBN ప్రమాణ స్వీకార ఈవెంట్ బాధ్యతలు?

image

AP: ఏపీ సీఎంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ బాధ్యతలను డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో అట్టహాసంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు ఆయన ప్రారంభించినట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా బాలయ్య, చంద్రబాబుకి బోయపాటి సన్నిహితుడనే విషయం తెలిసిందే.

News June 5, 2024

NOTAకు 63 లక్షల ఓట్లు!

image

లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాకు 63,72,220 ఓట్లు పోలైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యధికంగా బిహార్‌లో 8.97లక్షల ఓట్లు నోటాకు పడ్డాయని తెలిపింది. యూపీలో 6.34లక్షలు, మధ్యప్రదేశ్‌లో 5.32L, ప.బెంగాల్‌లో 5.22L, తమిళనాడులో 4.61లక్షలు, గుజరాత్ లో 4.49లక్షలు, మహారాష్ట్రలో 4.12L, ఏపీలో 3.98L, ఒడిశాలో 3.24లక్షల మంది ఓటర్లు నోటాకు వేశారు. 2019 ఎన్నికల్లో 65.22L ఓట్లు పడగా, ఈసారి ఆ సంఖ్య 2L తగ్గింది.

News June 5, 2024

ఐర్లాండ్‌పై భారత్ ఘనవిజయం

image

టీ20 WC-2024లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని 12.2 ఓవర్లలో ఛేదించింది. టీమ్‌ ఇండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ 52, పంత్ 36* రన్స్‌తో రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచును ఈనెల 9న పాకిస్థాన్‌తో ఆడనుంది.

News June 5, 2024

అంబానీ క్రూయిజ్ పార్టీ ఖర్చు రూ.7,500 కోట్లు?

image

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇటలీలోని పోర్టోఫినోలో గ్రాండ్‌గా ముగిశాయి. ఈ వేడుకల్లో సుమారు 800 మంది అతిథిలు హాజరయ్యారు. సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలతో పాటు వ్యాపార దిగ్గజాలు ఈ వేడుకల్లో మెరిశారు. ఇందుకుగాను అంబానీ ఫ్యామిలీ దాదాపు రూ.7,500 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్. వచ్చే నెల 12న ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్-రాధిక వివాహం జరగనుంది.

News June 5, 2024

రోజా పయనమెటు?

image

AP: ఈ ఎన్నికల్లో YCP నేత RK రోజా దారుణ ఓటమి ఎదుర్కొన్నారు. ఎన్నికలు జరగక ముందే రాష్ట్రంలో మొదట ఓడిపోయేది రోజా అనే వార్తలు వచ్చాయి. అందరూ ఊహించినట్టుగానే ఆమె ఓటమిపాలయ్యారు. దీంతో రోజా రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రత్యక్ష రాజకీయాలకు ఆమె దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు టాక్. మరోవైపు ఆమె తిరిగి ‘జబర్దస్త్‌’లో రీ ఎంట్రీ ఇస్తారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

News June 5, 2024

చంద్రబాబును కలిసిన స్టాలిన్

image

తమిళనాడు సీఎం స్టాలిన్ టీడీపీ చీఫ్ చంద్రబాబును కలిశారు. ‘ఢిల్లీ విమానాశ్రయంలో నా చిరకాల మిత్రుడు చంద్రబాబును కలిశాను. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తాం. కేంద్రంలో ఆయన కీలకపాత్ర పోషిస్తారని నాకు నమ్మకం ఉంది. దక్షిణాది రాష్ట్రాల కోసం పోరాడుతూ మన హక్కులను కాపాడతారని విశ్వసిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. కాగా, ఇండియా కూటమి సమావేశం కోసం స్టాలిన్ ఢిల్లీ వెళ్లారు.

News June 5, 2024

నా ప్రియమైన సోదరుడితో..: స్టాలిన్

image

ఈ రోజు ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ Xలో ఓ స్పెషల్ ఫొటో పంచుకున్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన ఆయన.. ‘నా ప్రియమైన సోదరుడితో..’ అని క్యాప్షన్ పెట్టారు. కాగా డీఎంకేకు పార్లమెంటు ఎన్నికల్లో 22 సీట్లు వచ్చాయి.

News June 5, 2024

ట్విటర్‌లో విరాట్ కోహ్లీ రికార్డు

image

ట్విటర్(X)లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్ల లిస్టులో టీమ్‌ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(63.5M) రెండో స్థానానికి చేరారు. తొలి స్థానంలో ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో (111.4M) కొనసాగుతున్నారు. కోహ్లీ తర్వాతి స్థానాల్లో వరుసగా నెయ్‌మర్.Jr (63.4M), బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్(52.8M), సచిన్ టెండూల్కర్ (40M) ఉన్నారు.

News June 5, 2024

రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది.

News June 5, 2024

కొత్త ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక!

image

అవును.. కూటమికి 164 సీట్లు కట్టబెట్టిన ఏపీ ప్రజలు గట్టి హెచ్చరిక కూడా పంపారు. పథకాలు అందిస్తే చాలు.. ప్రజలు ఓట్లు వేసేస్తారని కలలో కూడా అనుకోవద్దని స్పష్టం చేశారు. పథకాల రూపంలో రూ.లక్షల కోట్లు YCP ఇచ్చింది. అయినా కూటమి అభివృద్ధి నినాదానికే పట్టం కట్టారు. ఇటు YCP కంటే ఒకింత ఎక్కువ పథకాలే ప్రకటించిన కూటమి.. సంపద సృష్టించి పంచుతామంటోంది. అది కార్యరూపం దాల్చాలని కూటమిపై AP ప్రజానీకం ఆశలు పెట్టుకుంది.