News June 5, 2024

వివిధ దేశాల ఖజానాల్లో ఉన్న గోల్డ్

image

*అమెరికా- 8,133.46 టన్నులు
*జర్మనీ – 3,352.65 టన్నులు
*ఇటలీ – 2,451.84టన్నులు
*ఫ్రాన్స్ – 2,436.88 టన్నులు
*రష్యా- 2,332.74టన్నులు
*చైనా – 2,262.45టన్నులు
*స్విట్జర్లాండ్ – 1,040 టన్నులు
*జపాన్ – 845.97టన్నులు
*భారత్ – 822.10టన్నులు

News June 5, 2024

కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ?

image

NDA ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న TDP కేంద్ర కేబినెట్‌లో 4 మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. 16 MP సీట్లతో BJP తర్వాత ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా ఉన్న TDP.. లోక్‌సభ స్పీకర్‌ పదవితో పాటు రవాణా, వ్యవసాయం, జల్ శక్తి, గ్రామీణాభివృద్ధి, హెల్త్ శాఖలను కోరుతున్నట్లు సమాచారం. సాయంత్రం జరగనున్న NDA సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశముంది.

News June 5, 2024

ఎన్డీఏ మిత్రపక్షాలతో రాష్ట్రపతిని కలవనున్న మోదీ

image

కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. 17వ లోక్‌సభను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎల్లుండి బీజేపీ ఎంపీలు పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా కొత్త ఎంపీలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అనంతరం ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలవనున్నారు. తర్వాతి రోజు(8న) ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

News June 5, 2024

టీఎంసీలో మరో ఫైర్ బ్రాండ్!

image

TMCలో మరో ఫైర్ బ్రాండ్ లేడీ సయోనీ ఘోష్ జాదవ్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. బీజేపీకి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ దీదీ లాగానే ఆ పార్టీలో పవర్‌ఫుల్ మహిళగా గుర్తింపు పొందారు. నటి అయిన ఆమె రాజకీయాల్లోకి వచ్చి చేసేదేమీ లేదని BJP విమర్శించినా.. దానిని సవాలుగా తీసుకుని సివంగిలా దూసుకొచ్చారు. అనర్గళంగా ప్రసంగిస్తూ BJPకి దడ పుట్టించారు. భవిష్యత్తులో ఆమె మంచి నేత అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.

News June 5, 2024

నితీశ్ మనసులో ఏం ఉంది?

image

ఎన్డీఏ మిత్రపక్షాలు నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతున్నాయి. చంద్రబాబు, పవన్ సైతం విషెస్ చెప్పారు. బిహార్ సీఎం నితీశ్ మాత్రం స్పందించలేదు. పర్యావరణ దినోత్సవంపై ఆయన ఈరోజు ట్వీట్ చేయడంతో చర్చకు దారితీసింది. మోదీ సైతం CBN, పవన్‌ను అభినందిస్తూ ట్వీట్ చేసినప్పటికీ నితీశ్‌ను మరిచిపోయారు. దీంతో నితీశ్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని చర్చ జరుగుతోంది. కాగా కౌంటింగ్‌కు ముందు రోజు మోదీ, నితీశ్ భేటీ అయ్యారు.

News June 5, 2024

మోదీపై CBN విమర్శలు.. ఓల్డ్ ట్వీట్‌ను షేర్ చేసిన ధృవ్ రాఠీ

image

TDP చీఫ్ చంద్రబాబు చేసిన ఓల్డ్ ట్వీట్‌ను రాజకీయ విమర్శకుడు, యూట్యూబర్ ధృవ్ రాఠీ గుర్తుచేశారు. ‘దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన సంస్థలను మోదీ క్రమపద్ధతిలో ధ్వంసం చేశారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది. CBI నుంచి RBI వరకు ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థలను కూడా విడిచిపెట్టలేదు. ఏపీలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో ఈసీ విఫలమైంది’ అని బాబు 2019లో ట్వీట్ చేశారు.

News June 5, 2024

BRSను చూసైనా జాగ్రత్త పడాలిగా..

image

ఆరునెలల క్రితం TGలో BRS అధికారం కోల్పోయింది. అప్పటి సీఎం KCR ప్రజలకు దూరమవడం, MLAలపై వ్యతిరేకతే ఆ పార్టీని ముంచిందన్నది విశ్లేషకుల మాట. ఎన్నికల ముందు APలోని జగన్ ప్రభుత్వంపైనా ఇలాంటి అభిప్రాయమే ఉంది. దీంతో పక్కరాష్ట్రం పరిస్థితులను చూసైనా అభ్యర్థులను మారిస్తే ఫలితం మరోలా ఉండేదేమో! అలా చేయకుండా ఉన్నవారినే జంబ్లింగ్ చేయడం మొదటికే మోసమైంది. BRS కంటే ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది YCP.

News June 5, 2024

బీఆర్ఎస్ కథ సుఖాంతం: రేవంత్

image

TG: లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ కథ సుఖాంతమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గులాబీ నేతలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ చస్తూ బీజేపీని బతికించిందని దుయ్యబట్టారు. కేసీఆర్ అచేతనస్థితి వల్లే గులాబీ పార్టీ ఈ దుస్థితిలో ఉందన్నారు. కేంద్రంలో మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు, ఓటములకు పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు.

News June 5, 2024

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి: నారా లోకేశ్

image

AP: ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత TDP నాయకులపై ఉందని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఎన్నికల్లో గెలిచిన MLA, MP అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. అద్భుతంగా పోరాడి గెలిచామని అభినందించారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానన్నారు. అహంకారం నెత్తికెక్కడం వల్లే YCPకి గత ఎన్నికల్లో వచ్చిన 151 సీట్లు.. ఇప్పుడు 11 అయ్యాయని విమర్శించారు.

News June 5, 2024

వారి నుంచి స్ఫూర్తి పొందుతా: సమంత

image

తాను పక్కవారి నుంచి స్ఫూర్తి పొందుతానని హీరోయిన్ సమంత అన్నారు. ప్రతి రంగంలో ఒకరితో మరొకరు పోల్చుకోవడం సహజమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వారి విజయాలను చూసి కష్టపడి పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఐఎండీబీ ‘టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్’లో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ఇకపై మరింత కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నారు.