News June 5, 2024

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి: నారా లోకేశ్

image

AP: ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత TDP నాయకులపై ఉందని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఎన్నికల్లో గెలిచిన MLA, MP అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. అద్భుతంగా పోరాడి గెలిచామని అభినందించారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానన్నారు. అహంకారం నెత్తికెక్కడం వల్లే YCPకి గత ఎన్నికల్లో వచ్చిన 151 సీట్లు.. ఇప్పుడు 11 అయ్యాయని విమర్శించారు.

News June 5, 2024

వారి నుంచి స్ఫూర్తి పొందుతా: సమంత

image

తాను పక్కవారి నుంచి స్ఫూర్తి పొందుతానని హీరోయిన్ సమంత అన్నారు. ప్రతి రంగంలో ఒకరితో మరొకరు పోల్చుకోవడం సహజమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వారి విజయాలను చూసి కష్టపడి పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఐఎండీబీ ‘టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్’లో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ఇకపై మరింత కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నారు.

News June 5, 2024

ఏపీలో ధర్మపాలన సాగించండి: హరిరామజోగయ్య

image

AP: పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి భారీ విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు.. కాపు ఉద్యమనేత హరిరామజోగయ్య శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాధికారంలో భాగస్వామిగా ధర్మపాలన సాగించాలని పవన్‌కు రాసిన లేఖలో ఆకాంక్షించారు. నీతివంతమైన పాలనతో రాష్ట్రాన్ని ముందుండి నడిపించి.. జాతికి మంచి పేరు తీసుకోవాలని కోరారు.

News June 5, 2024

ఫలితాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

image

TG: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ జోడో యాత్రతో దేశంలో కాంగ్రెస్ పరిస్థితి మారిందని మీడియా సమావేశంలో చెప్పారు. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ 3 సీట్లు గెలిస్తే, ప్రస్తుతం 8 గెలిచామని చెప్పారు. 100 రోజుల పాలన తర్వాత కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు వచ్చాయని వెల్లడించారు. BJPని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుందని దుయ్యబట్టారు.

News June 5, 2024

మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

image

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టేందుకు డేట్ ఫిక్స్ అయింది. జూన్ 8న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రమాణస్వీకార మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత సీఎంలతో పాటు ఎన్డీఏ కూటమి నేతలు హాజరుకానున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు రాగా మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ 293 స్థానాల్లో గెలిచింది.

News June 5, 2024

లోక్‌సభను రద్దు చేస్తూ తీర్మానం

image

17వ లోక్‌సభ రద్దైంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో 17వ లోక్‌సభను రద్దు చేస్తూ ఓ తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని రాష్ట్రపతి ముర్ముకు పంపించారు. ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాక కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కలుగుతుంది.

News June 5, 2024

జనసేనకు మరో గుడ్‌న్యూస్

image

ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్‌న్యూస్. ఈ ఫలితాలతో ‘గాజు గ్లాసు’ గుర్తును ఆ పార్టీకి EC శాశ్వతంగా కేటాయించనుంది. పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 MLA, ఒక MP సీటు గెలవాలి. ఈ ఎన్నికల్లో JSP 21 MLA, 2 MP స్థానాలు దక్కించుకోవడంతో సింబల్ టెన్షన్ తీరిపోయింది. త్వరలోనే EC అధికారికంగా ఆ పార్టీకి గ్లాస్ గుర్తు ఇవ్వనుంది.

News June 5, 2024

ఆస్పత్రిలో ‘బలగం’ మొగిలయ్య!

image

బలగం సినిమా ఫేమ్ మొగిలయ్య తీవ్ర అస్వస్థతతో వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయన చికిత్సకు అవసరమైన డబ్బులు లేవని, ప్రభుత్వం ఆదుకోవాలని భార్య కొమురమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడిన ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. బలగం క్లైమాక్స్‌లో ఈ దంపతులు పాడిన పాట అందరి గుండెలను పిండేసింది.

News June 5, 2024

ఓటమికి ఇదీ ఓ కారణమా?

image

ప్రజల్లోకి నేతలు వెళ్లకపోవడం తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల ఓటమికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం సంక్షేమమే కాదు ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను పట్టించుకోవాలని చెబుతున్నారు. ఏపీలో వైఎస్ జగన్ బటన్ నొక్కడానికే పరిమితమయ్యారని, జనం సమస్యలను పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. తెలంగాణలో కేసీఆర్‌ను ఇదే కారణంతో ప్రజలు తిరస్కరించినట్లు తెలుస్తోంది.

News June 5, 2024

ఐక్యత వల్లే ఏపీలో కూటమి విజయం: నారాయణ

image

ఏపీలో కూటమి విజయానికి కూటమి పార్టీల మధ్య ఐక్యతే కారణమని CPI జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. APలో ఓట్లే లేని BJPకి సీట్లు రావడానికి ఈ ఐక్యతే కారణమని వ్యాఖ్యానించారు. ఇదే లోపించి తెలంగాణలో కాంగ్రెస్‌కు MP సీట్లు తగ్గాయని చెప్పారు. సీట్లు, ఓట్లు లేవని పార్టీలను పక్కన పెట్టడం వల్లే కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను సాధించలేదని.. ఈ విషయంలో డీఎంకే స్టాలిన్‌ను కాంగ్రెస్ ఆదర్శంగా తీసుకోవాలని సలహా ఇచ్చారు.