News December 19, 2024

ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్, రుణమాఫీపై RBI ఆందోళన

image

రైతు రుణమాఫీ, పొలాలు, ఇళ్లకు ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్, ఫ్రీ సిలిండర్స్, మహిళలు, రైతులు, యువతకు నగదు బదిలీ వంటి రాష్ట్రాల సబ్సిడీలతో ఒత్తిడి పెరుగుతోందని RBI తెలిపింది. వాటిని నియంత్రించి, రేషనలైజ్ చేసుకోవాలని పేర్కొంది. ‘ఇలాంటి ఖర్చుల వల్ల వనరులు తగ్గిపోతాయి. సామాజిక, ఆర్థిక మౌలిక నిర్మాణాలకు వాటిని వాడుకొనే సామర్థ్యం నశిస్తుంది. ఈ భారం తగ్గించుకొని క్యాపిటల్ స్పెండింగ్ పెంచుకోవాలి’ అని సూచించింది.

News December 19, 2024

ఈ-కార్ రేసింగ్.. FIRలో కీలక అంశాలు

image

TG: ఈ-కార్ రేసింగ్‌పై నమోదు చేసిన FIRలో ఏసీబీ కీలక అంశాలను వెల్లడించింది.
*5 అంశాల్లో ఉల్లంఘనలు
*ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి FEOకు నిధులు బదలాయించినట్లు గుర్తింపు
*HMDAకు చెందిన రూ.54.88 కోట్ల దుర్వినియోగం
*ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చెల్లింపులు
*ఈసీ నుంచి అనుమతి తీసుకోలేదు
*అగ్రిమెంట్ లేకుండానే HMDA నిధులు వినియోగించారు.

News December 19, 2024

చిల్లర వ్యూహాలకు మేం భయపడం: కవిత

image

TG: అక్రమ కేసులతో తాము భయపడే రకం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ‘మేం కేసీఆర్ సైనికులం. పోరాటాలు, ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్లం. ఇలాంటి కేసులకు బెదరం. రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు. సీఎం రేవంత్‌కు అసెంబ్లీలో చర్చ పెట్టే దమ్ము లేదు. చిల్లర వ్యూహాలతో మమ్మల్ని భయపెట్టాలనుకోవడం అవివేకం’ అని ఆమె మండిపడ్డారు.

News December 19, 2024

Stock Markets: 4 రోజుల్లో ₹10.5L కోట్ల నష్టం

image

US FED హాకిష్ కామెంట్స్‌తో దేశీయ స్టాక్‌మార్కెట్లు కుదేలవుతున్నాయి. 4 సెషన్లలోనే నిఫ్టీ 913Pts మేర పతనమవ్వడంతో ఇన్వెస్టర్లు ఏకంగా రూ.10.5L కోట్లను నష్టపోయారు. నిన్న 25BPS మేర వడ్డీరేట్లను తగ్గించిన ఫెడ్ 2025లో కత్తిరింపు ఎక్కువగా ఉండదని సంకేతాలు పంపింది. దీంతో FIIలు షేర్లను తెగనమ్మి డబ్బు వెనక్కి తీసుకుంటుండటంతో రూపాయి వీక్ అవుతోంది. మరికొన్ని రోజులు సూచీలది ఇదే వైఖరని మార్కెట్ వర్గాల అంచనా.

News December 19, 2024

రామ్‌చరణ్‌ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం: డైరెక్టర్ శంకర్

image

రామ్‌చరణ్ అద్భుతమైన నటుడని ‘గేమ్‌ఛేంజర్’ డైరెక్టర్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘లోపల ఏదో శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకున్నారేమో.. టైమ్ వచ్చినప్పుడు ఆ శక్తి పేలుతుందేమో అన్నట్టుగా చరణ్ కనిపిస్తుంటారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. చాలా లోతైన నటనను, హావభావాల్ని పలికించగలిగే నటుడు’ అని తెలిపారు. రామ్ చరణ్‌, కియారా అద్వానీ జంటగా, దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ వచ్చే నెల 10న విడుదల కానుంది.

News December 19, 2024

రేపు భారీ వర్షాలు

image

AP: ఈ నెల 20న రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News December 19, 2024

మరికాసేపట్లో కేటీఆర్ ప్రెస్ మీట్

image

TG: ఏసీబీ కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఆయన పలు విషయాలపై మాట్లాడే అవకాశం ఉంది. కాగా ఈ ఫార్ములా రేస్ అంశంలో కేటీఆర్‌పై ACB కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఆయనను ఏ-1గా చేర్చింది.

News December 19, 2024

18 OTTలను బ్లాక్ చేశాం: కేంద్ర మంత్రి

image

అసభ్య, అశ్లీల కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్న 18 OTTలను బ్లాక్ చేసినట్టు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. SSUBT MP అనిల్ దేశాయ్ అడిగిన ప్రశ్నకు IT సహాయ మంత్రి L మురుగన్ లోక్‌సభలో జవాబిచ్చారు. 2024, మార్చి 14న 18 OTTలను బ్లాక్ చేసినట్టు చెప్పారు. ఈ అంశంలో అవి IT నిబంధనలను ఉల్లంఘించడాన్ని గమనించినట్టు తెలిపారు. డిజిటల్ న్యూస్ పబ్లిషర్లూ వాటిని పాటించాల్సి ఉంటుందన్నారు.

News December 19, 2024

నిజమైన శాంటా మీ తండ్రేనని గుర్తించండి!

image

క్రిస్మస్ దగ్గర పడుతుండటంతో శాంటాక్లాస్ అందించే గిఫ్టుల గురించి నెట్టింట చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆఫీసుల్లో సీక్రెట్ శాంటా గిఫ్టులు ఏం ఇస్తారనే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే, మెచ్యూరిటీగా ఆలోచిస్తే నిజమైన శాంటా తండ్రేనంటూ ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘నాన్నే మీ శాంటా అని గుర్తించండి. ఎందుకంటే ఆయన తన ఆనందాన్ని, జీవితాన్ని త్యాగం చేసి మీ కోరికలను నెరవేరుస్తాడు’ అని రాసుకొచ్చారు.

News December 19, 2024

అంబేడ్కర్ ఓడింది కాంగ్రెస్ హయాంలోనే: చంద్రబాబు

image

AP: ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై CM చంద్రబాబు మంత్రులతో చర్చించారు. మనం మంచి ఉద్దేశంతో మాట్లాడినా దానిని చెడుగా చిత్రీకరించేందుకు కొందరు ఎదురు చూస్తుంటారని సీఎం అన్నారు. ‘గతంలో నేను వ్యవసాయం దండగ అని అనలేదు. కానీ అన్నట్లు కొందరు ప్రచారం చేశారు. ఇప్పుడు అమిత్ షాపై కూడా ఇదే ప్రచారం జరుగుతోంది. అసలు అంబేడ్కర్ ఓడిపోయింది కాంగ్రెస్ హయాంలోనే. ఆ పార్టీ హయాంలోనే ఆయనకు గౌరవం దక్కలేదు’ అని పేర్కొన్నారు.