News December 19, 2024

KTRను అరెస్టు చేస్తారా?

image

TG: ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. గవర్నర్ అనుమతి తీసుకోవడం, సీఎస్ ఏసీబీకి లేఖ రాయడం, ఏసీబీ కేసు నమోదు చేయడం వెనువెంటనే జరిగిపోయాయి. కేటీఆర్, అరవింద్ కుమార్, BLN రెడ్డిలు విచారణకు హాజరుకావాలని ఏసీబీ ఈరోజు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. విచారణలో నేరం చేసినట్లు తేలితే అరెస్టు చేయొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

News December 19, 2024

KTRపై అన్యాయంగా కేసు పెట్టారు: హరీశ్

image

TG: KTRపై కేసు నమోదు చేయడాన్ని హరీశ్ రావు ఖండించారు. ఆయనపై అన్యాయంగా కేసు నమోదు చేశారని అన్నారు. ఈ-కార్ రేసు ద్వారా రాష్ట్ర ఇమేజ్ పెంచేందుకు పని చేస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పేది నిజమైతే రేపు లేదా ఎల్లుండి అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.

News December 19, 2024

అశ్విన్ అందుకే రిటైర్ అయ్యారనుకుంటున్నా: హర్భజన్

image

అశ్విన్ రిటైర్‌మెంట్ వెనుక కారణాన్ని హర్భజన్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో అంచనా వేశారు. ‘సిరీస్ నడుస్తుండగానే అశ్విన్ రిటైర్ కావడం చాలా ఆశ్చర్యం కలిగించింది. నాకున్న సమాచారం ప్రకారం.. BGT తర్వాత భారత్ స్వదేశంలో, ఇంగ్లండ్‌లో టెస్టులు ఆడనుంది. సెలక్టర్లు ఆ మ్యాచ్‌లకు అశ్విన్‌ను పరిగణించడం లేదు. అందుకే వెయిట్ చేయకుండా తనంతట తానే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు’ అని పేర్కొన్నారు.

News December 19, 2024

KTRపై కేసు.. సెక్షన్లు ఇవే

image

ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి <<14924276>>KTRపై<<>> ఏసీబీ 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నాన్-బెయిలబుల్ సెక్షన్లైన 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120 B కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నేరం రుజువైతే ఏడాది నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

News December 19, 2024

KTRపై కేసు నమోదు

image

HYDలో eకార్ రేస్ అంశంలో మాజీ మంత్రి KTRపై ACB కేసు నమోదైంది. ఈ కేసులో A-1గా KTR, A-2గా IAS అరవింద్ కుమార్, A-3గా HMDA ఆఫీసర్ BLN రెడ్డి ఉన్నారు. రేస్ నిర్వహణకై విదేశీ సంస్థకు BRS ప్రభుత్వం ₹46Crను డాలర్లుగా చెల్లించింది. ఫారిన్ కరెన్సీతో చెల్లింపుకు RBI అనుమతి ఉండాలి. ఇలా జరగలేదని RBI ₹8Cr ఫైన్ విధించగా చెల్లించిన రేవంత్ సర్కారు.. ఈ రేసింగ్‌లో అవినీతి జరిగి ఉండొచ్చని ACB విచారణకు ఆదేశించింది.

News December 19, 2024

హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్ ట్రోఫీ-2025

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ICC నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ నిర్వహించే టోర్నీ మ్యాచులను ఇండియా తటస్థ వేదికలో ఆడనుంది. అలాగే పాక్ కూడా ఇండియా నిర్వహించే టోర్నీ మ్యాచులన్నీ తటస్థ వేదికలో ఆడుతుంది. దీంతోపాటు 2024 నుంచి 2027 వరకు జరిగే అన్ని ICC ఈవెంట్స్ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతాయని ఐసీసీ వెల్లడించింది.

News December 19, 2024

మంత్రులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

image

AP: కొందరు మంత్రుల వద్ద పెండింగ్ ఫైళ్లు పేరుకుపోతున్నాయంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని ఆదేశించారు. ‘మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా. వారు టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకోవడం లేదు. ఏ మంత్రి వద్ద ఫైళ్లు ఎంత సేపు పెండింగ్‌లో ఉంటున్నాయో నాకు తెలుసు’ అని సీఎం ఫైర్ అయ్యారు.

News December 19, 2024

శ్రీతేజ్‌ను పరామర్శించిన డైరెక్టర్ సుకుమార్

image

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను డైరెక్టర్ సుకుమార్ పరామర్శించారు. కిమ్స్ వైద్యులను అడిగి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరాతీశారు. కాగా నిన్న హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా బాలుడిని పరామర్శించిన విషయం తెలిసిందే. అతడికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు.

News December 19, 2024

ఎన్టీఆర్‌పైనా మీ పిల్లికూతలు?: KTR

image

కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలుగువాడి ఆత్మగౌరవం కోసం గర్జించిన NTR మీదనా మీ పిల్లికూతలు? పేదల ఇళ్లు కూల్చినా మీ ఆకలి తీరలేదా? మహోన్నతుల సమాధులను కూడా వదిలిపెట్టరా? విధ్వంసకారుడి వికృత ఆలోచ‌న‌ల‌కు ఈ ప్రభుత్వం ప్రతిరూపం’ అని ట్వీట్ చేశారు. NTR ఘాట్ తొలగించాలని కాంగ్రెస్ MLA రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది.

News December 19, 2024

STOCK MARKETS: రూ.5లక్షల కోట్ల నష్టం

image

స్టాక్‌మార్కెట్లు విలవిల్లాడాయి. ఊహించినట్టుగానే భారీ నష్టాల్లో ముగిశాయి. US FED 25BPS వడ్డీరేట్ల కోత, భవిష్యత్తులో ఎక్కువగా తగ్గించకపోవచ్చన్న అంచనాలే ఇందుకు కారణం. నిఫ్టీ 23,951 (-247), సెన్సెక్స్ 79,218 (-964) వద్ద స్థిరపడ్డాయి. దీంతో మదుపరులు ఏకంగా రూ.5L కోట్ల మేర సంపదను కోల్పోయారు. నేడు ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. BAJAJFINSV, JSWSTEEL, BAJFIN, GRASIM, ASIANPAINT టాప్ లూజర్స్.