News June 5, 2024

డిపాజిట్లు కోల్పోయిన ట్రాన్స్‌జెండర్లు!

image

లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన ముగ్గురు ట్రాన్స్‌జెండర్లూ డిపాజిట్లు కోల్పోయారు. ధన్‌బాద్ నుంచి పోటీ చేసిన సునైనా కిన్నార్ అనే స్వతంత్ర అభ్యర్థికి 3,462 ఓట్లు వచ్చాయి. దక్షిణ ఢిల్లీ నుంచి బరిలో నిలిచిన రాజన్ సింగ్‌కు కేవలం 325 ఓట్లే పోలయ్యాయి. మరోవైపు మధ్యప్రదేశ్‌లో దామో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దుర్గా మౌసికి 1,124 ఓట్లు వచ్చాయి.

News June 5, 2024

ఈ రాష్ట్రాలే ‘400 పార్’ కలను చెదరగొట్టాయా?

image

NDA 293 సీట్లకే పరిమితం కావడం వెనుక UP, మహారాష్ట్ర, బెంగాల్, బిహార్ రాష్ట్రాల ప్రభావం ఉందంటున్నారు విశ్లేషకులు. యూపీలో 80 సీట్లూ క్లీన్ స్వీప్ చేస్తామని ఆశించిన బీజేపీకి 36 సీట్లే వచ్చాయి. మహారాష్ట్రలో 2019లో 48లో 41 సీట్లు సాధించిన NDA ఈసారి 17 సీట్లకు పరిమితమైంది. బెంగాల్‌లో TMC దెబ్బకు BJP 12 సీట్లకే చతికిలపడింది. బిహార్‌లోనూ NDA 2019తో పోలిస్తే తొమ్మిది సీట్లు కోల్పోయి 39కి పరిమితమైంది.

News June 5, 2024

మోదీకి ఇటలీ అధ్యక్షురాలు మెలోనీ అభినందనలు

image

NDA కూటమి గెలుపొందడంపై ఇటలీ అధ్యక్షురాలు జార్జియా మెలోనీ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య బంధం బలోపేతానికి మరింత కృషి చేస్తామని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఎన్నికల్లో NDA 293 సీట్లతో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టింది. వారణాసి నుంచి బరిలోకి దిగిన ప్రధాని మోదీ 1.52లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

News June 5, 2024

మోదీ 3.0 @292

image

‘400 పార్..’ ఆశించిన NDAకి ఓటర్లు 292 సీట్లతో సరిపెట్టారు. మెజార్టీ మార్క్ అయిన 272 దాటడంతో త్వరలోనే NDA కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. లెక్కింపులో భాగంగా ఓ దశలో NDA 300 స్థానాల్లో ఆధిక్యం సంపాదించినా ఇండియా కూటమి NDA జోరుకు బ్రేకులు వేసింది. మరోవైపు 295 సీట్లు వస్తాయని ఆశించిన ఇండియా కూటమికి 234 సీట్లు దక్కాయి. దీంతో పాటు 17 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.

News June 5, 2024

ఒడిశాలో ఎవరికి ఎన్ని స్థానాలు అంటే?

image

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేడీ కంచుకోటగా ఉన్న రాష్ట్రంలో మొత్తం 147 స్థానాల్లో పోటీ చేసి 78 సీట్లు గెలుపొందింది. మరోవైపు బీజేడీ 51 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 14 సీట్లు, ఇతరులు నాలుగు సీట్లు గెలుపొందారు. మెజార్టీ మార్క్ 74 కంటే ఎక్కువ సీట్లే గెలవడంతో బీజేపీ త్వరలోనే ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బీజేపీ గెలుపుతో నవీన్ పట్నాయక్ 24ఏళ్ల పాలనకు తెరపడింది.

News June 5, 2024

చంద్రబాబుకు దేవగౌడ అభినందనలు

image

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయంపై MP, జేడీ(ఎస్) వ్యవస్థాపకుడు దేవ గౌడ TDP చీఫ్ చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చంద్రబాబు నిబద్ధతతో పనిచేస్తారని, అందులో సందేహం లేదన్నారు. ఈ విజయం తనకు 1996లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్షణాన్ని గుర్తు చేసిందన్నారు. మరోవైపు కేంద్రంలో NDA గెలుపొందడంపై కూడా ప్రధాని మోదీకి దేవగౌడ అభినందనలు తెలిపారు.

News June 5, 2024

ఈ ఎన్నికల్లో కోటీశ్వరులదే హవా!

image

ఈ లోక్‌సభ ఎన్నికల్లో కోటీశ్వరుల హవా కొనసాగింది. దేశవ్యాప్తంగా 2,573 మంది కోటీశ్వరులు బరిలో నిలవగా 503 మంది ఎంపీలుగా గెలుపొందారు. 4,013 మంది గ్రాడ్యుయేట్లు పోటీ చేయగా వారిలో 391 మంది విజయం సాధించారు. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 1643 మందిపై పలు కేసులు ఉండగా వారిలో 250 మంది ఎంపీలుగా గెలిచారు. ఇక 324 మంది సిట్టింగ్ ఎంపీలు మరోసారి పోటీ చేయగా 213 మంది గెలుపొందారు.

News June 5, 2024

APలో ఊహకందని విజయం

image

పసుపు ప్రభంజనానికి YCP తుడిచిపెట్టుకుపోయింది. ఐదేళ్ల కిందట 151 సీట్లతో కనీవినీ ఎరుగని విజయం సాధించిన జగన్ పార్టీని ఈసారి ఆంధ్రా ప్రజలు పక్కన పెట్టేశారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను కూటమి కొల్లగొట్టింది. పెద్దిరెడ్డి తప్ప మంత్రులందరూ ఇంటిదారి పట్టారు. 13 ఉమ్మడి జిల్లాలకు గాను 8 జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవలేకపోయిందంటే కూటమి సునామీ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

News June 5, 2024

T20WC: తొలి మ్యాచ్‌‌కు సిద్ధం

image

పొట్టి ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తమ తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా నేడు ఐర్లాండ్‌తో ఫస్ట్ మ్యాచ్‌ ఆడనుంది. ఈ క్రమంలో భారత క్రికెటర్లు నెట్స్‌లో ఇవాళ చెమటోడ్చారు. ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన ఫొటోలను బీసీసీఐ Xలో పోస్ట్ చేసింది.

News June 5, 2024

62 తర్వాతి రికార్డు.. 60 ఏళ్ల తర్వాత బ్రేక్

image

దేశంలో 1962 తర్వాత హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పడలేదు. 1951-52, 1952-57, 1957-62 మధ్య కాంగ్రెస్ వరుసగా 3 పర్యాయాలు పాలించింది. 2014, 19 తర్వాత NDA ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కి 60 ఏళ్ల రికార్డు సమం చేయనుంది. అటు దేశానికి 1947-62 మధ్య నెహ్రూ PMగా 16 సం.ల 286 రోజులున్నారు. కానీ రాజ్యాంగం అమలయ్యాక చూస్తే ఇది 13సం.లు. దీంతో గణతంత్ర భారతంలో మోదీ 15సం. PMగా కొనసాగి నెహ్రూ రికార్డు బద్దలవనుంది.