India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందుకోసం USకు చెందిన ఐటీ సర్వ్ అలయన్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. తొలి విడతలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలకు విస్తరిస్తామన్నారు. ఆయా జిల్లాల్లో స్థానికులకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి, 30 వేల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్‌లో 2025 జనవరి నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్(UCC)ను అమలు చేయబోతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ ధామీ ప్రకటించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ నిర్ణయంతో దేశంలో స్వాతంత్య్రం తర్వాత UCC అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. మతంతో సంబంధం లేకుండా పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత వంటి విషయాల్లో దేశంలోని ప్రజలందరికీ ఒకే విధమైన చట్టాన్ని అమలు చేయడమే UCC ముఖ్య ఉద్దేశం.
శైలేశ్ కొలను దర్శకత్వంలో నాని నటిస్తున్న ‘హిట్-3’ షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది. పలు కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్లు చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీలో నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ‘KGF’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 2025, మే 1న ఈ మూవీ రిలీజ్ కానుంది.
AP: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ఇవాళ ఉ.11 గంటలకు సమావేశం కానుంది. పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలు, సోషల్ మీడియా పోస్టులపై కేసులు, రాజధాని అమరావతి నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు వంటి పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల కోసం ‘భవానీ దీక్ష 2024’ పేరుతో యాప్‌ను రూపొందించామని, ఇందులో ఆలయానికి సంబంధించిన సమాచారం ఉంటుందని చెప్పారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. రోజుకు సుమారు లక్ష మంది చొప్పున భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు.
తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తే 60 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచిత వైద్యం అందిస్తామని AAP చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ‘సంజీవని’ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు ఎంత ఖర్చయినా తామే భరిస్తామని తెలిపారు. ఆప్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఈ స్కీమ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ చేస్తారని పేర్కొన్నారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. AQI 450 మార్కును దాటింది. దీనిని ‘సివియర్ ప్లస్’ కేటగిరీగా పరిగణిస్తారు. ఇప్పటికే <<14615828>>గ్రేప్-4 ఆంక్షలు<<>> అమలవుతున్నాయి. నెహ్రూ నగర్(485), వజిర్‌పుర్(482), రోహిణి(478), ఆనంద్ విహార్(478), పంజాబీ బాగ్(475) ప్రాంతాల్లో తీవ్ర వాయు కాలుష్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్కూల్ విద్యార్థులకు హైబ్రిడ్ మోడల్‌లో (ఫిజికల్/ఆన్‌లైన్) క్లాసులు నిర్వహిస్తున్నారు.
మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా షూటింగ్ 80% పూర్తయినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. డే&నైట్ షెడ్యూల్స్‌లో చిత్రీకరణ జరుగుతోందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఊపందుకుందని తెలిపింది. క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ సందర్భంగా టీజర్ రిలీజ్ కానున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఏవైనా అప్‌డేట్స్ ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొంది.
ముంబై <<14917232>>పడవ ప్రమాదంలో<<>> మరణించిన మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ₹2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ₹50,000 చొప్పున ఇవ్వనున్నట్లు PMO తెలిపింది. ఫెర్రీ బోట్‌ను నేవీ స్పీడ్ బోటు వేగంగా ఢీకొట్టడంతో 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. నేవీ స్పీడ్ బోటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు MH సర్కార్ ఇప్పటికే ₹5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
తన నుంచి ₹14,131cr రికవరీ చేసినట్లు FM నిర్మలా సీతారామన్ <<14914173>>ప్రకటించడంపై<<>> విజయ్ మాల్యా స్పందించారు. DRT ప్రకారం వడ్డీతో సహా తాను చెల్లించాల్సిన మొత్తం ₹6203cr అని తెలిపారు. కానీ ED, బ్యాంకులు దీనికి రెండు రెట్ల కంటే ఎక్కువ రికవరీ చేశాయని, ఎందుకు ఎక్కువ తీసుకున్నాయో చట్టబద్ధంగా నిరూపించాలని ట్వీట్ చేశారు. అప్పు రికవరీ అయ్యాక కూడా తాను ఇంకా నేరస్థుడిని ఎలా అవుతానని ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.