News April 9, 2025

ఒకే జిల్లాల్లో 13,500మందిలో క్యాన్సర్ లక్షణాలు!

image

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో సర్కారు నిర్వహించిన ‘సంజీవని అభిమాన్’ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో 13,500కు పైగా మహిళలు క్యాన్సర్ ముప్పు ముంగిట ఉన్నట్లు తేలింది. జిల్లా కలెక్టర్ అభివన్ గోయెల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘7వేలమందిలో గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు, 3500మందిలో రొమ్ము క్యాన్సర్, 2వేల మందిలో నోటి క్యాన్సర్, వెయ్యి మందిలో ఇతర క్యాన్సర్ల లక్షణాల్ని వైద్యులు గుర్తించారు’ అని తెలిపారు.

News April 9, 2025

బ్రిటన్ యువరాజు ప్రాణాలకు ముప్పు: లాయర్

image

బ్రిటన్ యువరాజు హ్యారీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన తరఫు న్యాయవాది ఫాతిమా లండన్ కోర్టుకు తెలిపారు. హ్యారీ తన భార్యతో కలిసి 2020లో అమెరికాకు షిఫ్ట్ అయ్యారు. ఆయన బ్రిటన్ వచ్చినప్పుడు కల్పించే భద్రతను ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఈ నేపథ్యంలోనే హ్యారీ కోర్టును ఆశ్రయించారు. ‘హ్యారీని చంపాలంటూ ఆల్ ఖైదా ఈమధ్యే పిలుపునిచ్చింది. ఇక ఆయన్ను, ఆయన భార్యను మీడియా డేగలా వెంటాడుతోంది’ అని ఫాతిమా వివరించారు.

News April 9, 2025

‘ఓజీ’లో అకీరా నందన్.. రేణూ దేశాయ్ స్పందనిదే

image

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ మూవీలో అకీరా నందన్ నటిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై నటి రేణూ దేశాయ్ ఓ పాడ్ కాస్ట్‌లో స్పందించారు. ‘అకీరా ప్రస్తుతం ఏ మూవీలోనూ నటించడం లేదు. ఆయన తండ్రి పవన్ నటిస్తున్న ‘ఓజీ’లోనూ ఆయన లేరు. ఒకవేళ అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే నేనే సోషల్ మీడియాలో ప్రకటిస్తా. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వార్తలన్నీ నిరాధారం’ అని ఆమె స్పష్టం చేశారు.

News April 9, 2025

చైనాకు ట్రంప్ భారీ షాక్.. చెప్పినట్లే భారీ సుంకాలు

image

చైనా తమపై విధించిన ప్రతీకార సుంకాల విషయంలో వెనక్కి తగ్గకపోతే ఆ దేశంపై టారిఫ్స్‌ను 104శాతానికి పెంచుతానన్న ట్రంప్, అదే చేశారు. తన హెచ్చరికల్ని లైట్ తీసుకున్న చైనాపై అదనంగా 50శాతం సుంకాలు విధించారు. దీంతో ఆ దేశంపై అమెరికా మొత్తం టారిఫ్‌లు 104శాతానికి చేరాయి. దీనిపై చైనా స్పందించాల్సి ఉంది. ఈ వాణిజ్య యుద్ధం ఎక్కడకు దారి తీస్తుందోనని ఆర్థిక వేత్తల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

News April 9, 2025

TG మాజీ గవర్నర్ తమిళిసైకు పితృవియోగం

image

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి, తమిళనాడు కాంగ్రెస్‌లో సీనియర్ లీడరైన కుమారి అనంతన్(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో ఈరోజు పరిస్థితి విషమించి మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

News April 9, 2025

మొరిగే కుక్కలన్నీ ధోనీ ఆటను చూశాయనుకుంటున్నా: తమన్

image

ఈరోజు PBKS-CSK మ్యాచ్‌లో MS ధోనీ ఆటపై సంగీత దర్శకుడు తమన్ ట్విటర్లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఆయనపై మొరుగుతున్న కుక్కలన్నీ ఆ దిగ్గజం ఆటను చూశాయని భావిస్తున్నా’ అని ఒక పోస్ట్ పెట్టారు. దాని కింద విమర్శలు వస్తుండటంతో సమాధానంగా మరో ట్వీట్ చేశారు. ‘ఇది సీఎస్కే గెలుపు గురించి కాదు. దేశానికి ఎన్నో సిరీస్‌లు గెలిపించిన మనిషి గురించి. మనతో ఆ ట్రోఫీలు ఉన్నాయంటే ఆ ఒక్కడి వల్లే’ అని అందులో పేర్కొన్నారు.

News April 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 9, 2025

ఏప్రిల్ 9: చరిత్రలో ఈరోజు

image

1860: మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది
1893: రచయిత రాహుల్ సాంకృత్యాయన్ జననం(కుడి ఫొటో)
1930: నటుడు మన్నవ బాలయ్య జననం(ఎడమ ఫొటో)
1948: హిందీ నటి జయా బచ్చన్ జననం
1989: గాయకుడు, సంగీత దర్శకుడు ఏ.ఎం.రాజా మరణం
1994: స్వాతంత్య్ర సమరయోధుడు చండ్ర రాజేశ్వరరావు మరణం
2022: నటుడు మన్నవ బాలయ్య మరణం

News April 9, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

ఏప్రిల్ 9, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.31 గంటలకు
ఇష: రాత్రి 7.44 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 9, 2025

శుభ ముహూర్తం (09-04-2025)(బుధవారం)

image

తిథి: శుక్ల ద్వాదశి రా.11.56 వరకు
నక్షత్రం: మఖ ఉ.11.16 వరకు
రాహుకాలం: మ.12.00-మ.1.30 వరకు
యమగండం: ఉ.7.30-ఉ.9.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.36-ఉ.12.24 వరకు
వర్జ్యం: రా.7.49-రా.9.31 గంటల వరకు
అమృత ఘడియలు: ఉ.9.08-ఉ.10.48 వరకు

error: Content is protected !!