News December 18, 2024

3 నెలల్లో రూల్స్ రూపొందిస్తాం: పొంగులేటి

image

TG: భూభారతి బిల్లుపై మూడు నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం ధరణి తెచ్చి మూడేళ్లు దాటినా రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడంతో తప్పులు జరిగాయన్నారు. రూల్స్ ఫ్రేమ్ అయ్యాక గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టి, ప్రజాప్రతినిధులతో కలిసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఆనాటి ధరణిలో 33 ఆప్షన్స్ ఉంటే, ఇప్పుడు వాటిని 6 మాడ్యూళ్లకు కుదిస్తున్నట్లు చెప్పారు.

News December 18, 2024

H1B దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్

image

H1B వీసాలను సరళీకరిస్తూ అగ్రరాజ్యం కొత్త నిబంధనలు ప్రకటించింది. దీంతో అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడం ఈజీ కానుంది. అటు, ఎఫ్-1 విద్యార్థి వీసాలను H1Bగా మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో పాటు కొన్ని సంస్థల్లో నియామకాలకు H1B వార్షిక పరిమితి నుంచి మినహాయింపు ఇస్తూ బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. H1B వీసా ఉండి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తులకు వేగంగా పరిష్కారం దొరకనుంది.

News December 18, 2024

జైలుకెళ్తే ట్రెండ్ అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారు: కాంగ్రెస్ ఎంపీ

image

TG: మాజీ మంత్రి కేటీఆర్ జైలుకెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ఎద్దేవా చేశారు. జైలుకు వెళ్తే ట్రెండ్ అవుతానని ఆయన అనుకుంటున్నారని విమర్శించారు. అందుకే తనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని కేటీఆర్ అడుగుతున్నారని చామల అన్నారు. కాగా ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చామల కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

News December 18, 2024

ASHWIN RETIRES: క్రికెట్లో నిత్య విద్యార్థి

image

అశ్విన్‌ క్రికెట్లో నిత్య విద్యార్థి. ఎప్పుడూ కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటూనే ఉండేవారు. రిస్ట్ స్పిన్నర్ల నుంచి పోటీ ఎదురై జట్టులో చోటు కష్టమైనప్పుడు అతడి రీఎంట్రీ ఘనంగా ఉండేది. క్యారమ్ బాల్ అలా వచ్చిందే. దేశవాళీలో చేతివేళ్లను మారుస్తూ కొత్త బంతులు ట్రై చేసేవారు. టాప్ స్పిన్, దూస్రా, ఫ్లిప్పర్, గూగ్లీ, స్లోబాల్, ఆర్మ్ బాల్‌ను సమర్థంగా వాడేవారు. అతడి నిలకడకు బ్యాటర్లు దాసోహం అనేవారు.

News December 18, 2024

ప్రభాస్ అభిమానులకు SAD NEWS!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘ది రాజాసాబ్’ విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. షూటింగ్‌తో పాటు వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావని, అందుకే ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల చేయడం కష్టమేనని చెబుతున్నాయి. దీంతో సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న ‘జాక్’ మూవీ ఈ తేదీని బుక్ చేసుకోవడం గమనార్హం. తాజాగా ఈ చిత్రం కొత్త రిలీజ్ తేదీని ప్రకటించింది.

News December 18, 2024

రిటైర్మెంట్ గురించి చెప్పడంతో భావోద్వేగానికి లోనయ్యా: కోహ్లీ

image

అశ్విన్ రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ స్పందించారు. ‘14 ఏళ్లుగా నీతో ఆడుతున్నా. రిటైర్ అవుతున్నట్లు నాతో చెప్పడంతో భావోద్వేగానికి లోనయ్యా. నీతో ఆడిన రోజులన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. నీతో ఆడిన ప్రతిసారి నేను గేమ్‌ను ఆస్వాదించా. భారత క్రికెట్‌కు నైపుణ్యంతో కూడిన మ్యాచ్ విన్నింగ్ సహకారం మరువలేనిది. నువ్వు ఎప్పటికీ భారత క్రికెట్ లెజెండ్‌గా గుర్తుండిపోతావు. ధన్యవాదాలు మిత్రమా’ అని ట్వీట్ చేశారు.

News December 18, 2024

మస్క్ సంపద రూ.42.46 లక్షల కోట్లు

image

అపరకుబేరుడు ఎలాన్ మస్క్ ఆస్తులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. అమెరికాలో రాజకీయ మార్పులు, టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల షేర్లు పెరగడంతో ఆస్తులకు రెక్కలొచ్చాయి. తాజాగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ నికర ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో $500 బిలియన్లకు చేరుకుంది. అంటే అక్షరాలా రూ.42.46 లక్షల కోట్లు. ప్రపంచంలో ఇంత ఆస్తి కలిగిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు.

News December 18, 2024

న్యూజిలాండ్ వన్డే, T20 కెప్టెన్‌గా శాంట్నర్

image

న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌ నియమితులయ్యారు. మిచెల్ శాంట్నర్‌ను వన్డే, T20 కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు కివీస్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. ఇది తనకు దక్కిన గౌరవం అని శాంట్నర్‌ తెలిపారు. జాతీయ జట్టుకు ఆడాలని చిన్నప్పటి నుంచి కల కంటామని, కానీ సారథ్య బాధ్యతలు రావడం ప్రత్యేకమన్నారు. ఈ నెలాఖరున శ్రీలంకతో ప్రారంభం కానున్న సిరీస్‌తో శాంట్నర్ పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోనున్నారు.

News December 18, 2024

రూ.76వేల కోట్లు ఇవ్వాలని అడిగాం: పవన్

image

AP: జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తామని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ పథకం అమలుకు ₹76వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు VJAలో జల్‌జీవన్ మిషన్ అమలుపై వర్క్‌షాప్‌లో తెలిపారు. ఈ పథకానికి అన్ని రాష్ట్రాలు ₹లక్ష కోట్లు అడిగితే, YCP ప్రభుత్వం ₹26వేల కోట్లే అడిగిందని ఆరోపించారు. ఈ స్కీంతో ప్రతి వ్యక్తికి 55 లీటర్ల నీళ్లు ఇచ్చి, ప్రధాని మోదీ కలను సాకారం చేస్తామన్నారు.

News December 18, 2024

GOAT అశ్విన్: ఈ రికార్డులు అతడికే సొంతం

image

అశ్విన్ అనేక రికార్డులు సృష్టించారు. టెస్టుల్లో 11సార్లు MPSA పొందిన క్రికెటర్ అతడు. ఎక్కువ వికెట్లు (537) తీసిన 7th ఆటగాడు. ఒక ఇన్నింగ్సులో ఎక్కువ ఫిఫర్స్ 37 సాధించిన 2nd ప్లేయర్. బౌల్డ్ చేసి ఎక్కువ వికెట్లు 109 తీసిన 4th బౌలర్. వేగంగా (66 మ్యాచుల్లోనే) 350 వికెట్ల ఘనత అందుకున్న 1st క్రికెటర్. ఒకే ఇన్నింగ్సులో సెంచరీ, 5 వికెట్లు, ఒకే సిరీసులో 250 రన్స్, 20 వికెట్స్ రికార్డులు అతడి సొంతం.