News June 4, 2024

చంద్రబాబు, పవన్‌కు నాని విషెస్

image

ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌కి హీరో నాని విషెస్ తెలిపారు. ‘ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ హీరో పవన్ కళ్యాణ్‌కి అభినందనలు. అవమానాలను ఎదుర్కొంటూ పోరాడి గెలిచిన తీరు ఎంతో మందికి పాఠం. మీ విజయం చూస్తుంటే గర్వంగా ఉంది సర్. మీరు మరింత ఎత్తుకు చేరుకోవాలని, మీ పనితో పలువురికి ఉదాహరణగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 4, 2024

డియర్ కళ్యాణ్ బాబు.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: చిరంజీవి

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘డియర్ కళ్యాణ్ బాబు.. నువ్వు తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changerవే కాదు, Man of the matchవి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News June 4, 2024

విజయవాడ చేరుకున్న పవన్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు బయల్దేరారు. కౌంటింగ్ సరళిపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించే ఛాన్సుంది. అనంతరం ఇవాళ రాత్రికి టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని భేటీ కానున్నారు.

News June 4, 2024

25 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలుపు

image

AP: రాష్ట్రంలో అతి తక్కువ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్. రాజు తన సమీప ప్రత్యర్థి ఈర లక్కప్పపై 25 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 78347 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్పకి 78,322 ఓట్లు నమోదయ్యాయి.

News June 4, 2024

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘన విజయం

image

AP: నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై 31971 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అలాగే కోవూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై దాదాపు 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

News June 4, 2024

ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయి: KTR

image

రాష్ట్రంలో ఒక్క MP సీటును గెలవకపోవడంపై కేటీఆర్ స్పందించారు. ‘TRS స్థాపించిన 24 ఏళ్లలో విజయాలు, ఎదురుదెబ్బలు అన్నీ చూశాం. తెలంగాణను సాధించడమే మా అతిపెద్ద విజయం. 2014లో 63/119, 2018లో 88/119 సీట్లు సాధించాం. ప్రస్తుతం 39 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. నేటి ఎన్నికల ఎదురుదెబ్బ కచ్చితంగా చాలా నిరాశపరిచింది. కానీ మేము శ్రమిస్తూనే ఉంటాం. మళ్లీ గట్టిగా తిరిగొస్తాం’ అని ట్వీట్ చేశారు.

News June 4, 2024

రిజల్ట్స్.. మెజారిటీలో ఆల్‌టైమ్ రికార్డు

image

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి శంకర్ లల్వాణీ రికార్డు సృష్టించారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోక్‌సభ స్థానంలో 11,75,092 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో మెజారిటీ సాధించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఆయన తర్వాత అత్యధికంగా నోటాకు 2,18,674 ఓట్లు వచ్చాయి. మరోవైపు ఇక్కడ బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.

News June 4, 2024

ఆళ్లగడ్డ, జమ్మలమడుగులో కూటమి విజయం

image

రాయలసీమలోని ఆళ్లగడ్డ, జమ్మలమడుగులో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ, జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గెలిచారు.

News June 4, 2024

బద్వేలు, మంత్రాలయంలో వైసీపీ గెలుపు

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి నాలుగో విజయం దక్కింది. బద్వేలులో బీజేపీ నేత బొజ్జా రోషన్నపై దాసరి సుధ, మంత్రాలయంలో టీడీపీ నేత రాఘవేంద్రారెడ్డిపై బాలనాగిరెడ్డి గెలిచారు. పులివెందులలో వైఎస్ జగన్, రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు.

News June 4, 2024

BREAKING: కాసేపట్లో చంద్రబాబు ప్రెస్‌మీట్

image

APలో తిరుగులేని మెజార్టీతో NDA ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. కూటమి అభ్యర్థుల విజయం, ప్రభుత్వ ఏర్పాటు సహా పలు అంశాలపై ఆయన వివరణ ఇవ్వనున్నారు.