News June 4, 2024

భువనగిరిలో కాంగ్రెస్ గెలుపు

image

భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ ఆయనకు 1.95లక్షల మెజార్టీ లభించింది. బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, BRS నుంచి క్యామ మల్లేశ్ పోటీ చేశారు.

News June 4, 2024

సా.7 గంటలకు పార్టీ ఆఫీస్‌కు మోదీ

image

ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో మేజిక్ ఫిగర్‌ను దాటింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్‌కు చేరుకోనున్నారు. మూడోసారి అధికారం చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పార్టీ సీనియర్ నేతలతో చర్చించనున్నారు.

News June 4, 2024

ఐదోసారి అసదుద్దీన్ ఒవైసీ గెలుపు

image

ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదోసారి అసదుద్దీన్ ఒవైసీ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి మాధవీలతపై 3,15,811 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అంతకుముందు ఒవైసీ 2004, 2009, 2014, 2019లో ఎంపీగా గెలుపొందారు. మాధవీ లతకు 2,97,031 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

తేజస్వి సూర్యకు 2.50 లక్షల మెజారిటీ

image

బీజేపీ యువ సంచలనం తేజస్వి సూర్య సంచలన విజయం దిశగా సాగుతున్నారు. బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేసిన ఆయన 2.50 లక్షల ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. చిన్నవయసు నుంచే ఆయన RSSలో పని చేస్తున్నారు. 9 ఏళ్ల వయసులో పెయింటింగ్ వేసి, వచ్చిన డబ్బులు కార్గిల్ వీరుల కోసం డొనేట్ చేశారు.

News June 4, 2024

కాంగ్రెస్‌తో చంద్రబాబు కలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా: రఘువీరా రెడ్డి

image

APలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన TDPకి కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి ఓ ఆఫర్ ప్రకటించారు. ‘ఇప్పుడు కేంద్ర నుంచి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా సాధించుకునే గొప్ప అవకాశం ఉంది. ఇండియా ఈ హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. మీరు INDIAలోకి రాకపోతే NDAతో ఉండి సాధిస్తారా? AP ముఖచిత్రం మార్చడానికి ఇది మీకొక సువర్ణ అవకాశంగా భావిస్తున్నా’ అని Xలో పోస్ట్ చేశారు. దీనిపై CBN ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

News June 4, 2024

తెనాలిలో నాదెండ్ల మనోహర్ గెలుపు

image

గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన జయకేతనం ఎగరేసింది. అక్కడ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన నాదెండ్ల మనోహర్ విజయం సాధించారు. ఇప్పటివరకు జనసేన 7 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. మరో 14 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు రాయలసీమలోని రైల్వేకోడూరులోనూ జనసేన గెలిచింది.

News June 4, 2024

కడపలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 10 స్థానాలకుగాను వైసీపీ కేవలం 4 చోట్ల(పులివెందుల, రాయచోటి, బద్వేల్, రాజంపేట) మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే ప్రొద్దుటూరు, కడప, కమలాపురం, మైదుకూరు స్థానాలను టీడీపీ గెలుచుకుంది. మరో 2 చోట్ల(జమ్మలమడుగు-BJP, రైల్వే కోడూరు-జనసేన) కూటమి నేతలు ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

నల్గొండలో కాంగ్రెస్ భారీ విజయం

image

నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 5.5 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి సైదిరెడ్డి పోటీ చేశారు.

News June 4, 2024

ఎనిమిది జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ

image

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి భారీ షాక్ ఇస్తున్నాయి. ఏకంగా 8 జిల్లాల్లో ఆ పార్టీ ఖాతా తెరవలేదు. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, ప.గో, ప్రకాశం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఒక్కరూ ఆధిక్యంలో లేరు. విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా ఈ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం.. ఆ పార్టీపై ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతోంది.

News June 4, 2024

తమిళనాడులో క్లీన్ స్వీప్ దిశగా ఇండియా కూటమి!

image

తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. డీఎంకే 21, కాంగ్రెస్ 9, VCK 2, సీపీఐ 2, సీపీఎం 2 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. PMK, MDMK, IUML ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.