News December 18, 2024

శుభ ముహూర్తం (18-12-2024)

image

✒ తిథి: బహుళ తదియ మ.12:02 వరకు
✒ నక్షత్రం: పుష్యమి తె.3.30 వరకు
✒ శుభ సమయం: సా.4 నుంచి సా.5 గంటల వరకు
✒ రాహుకాలం: మ.12:00 నుంచి మ.1:30 వరకు
✒ యమగండం: ఉ.7:30 నుంచి ఉ.9:00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి మ.12.24 గంటల వరకు
✒ వర్జ్యం: ఉ.11.11 నుంచి మ.12.49 గంటల వరకు
✒ అమృత ఘడియలు: రా.12.49 నుంచి రా.2.27 వరకు

News December 18, 2024

ప్యాంగ్యాంగ్‌లో మళ్లీ భారత ఎంబసీ

image

ఉత్తర కొరియాలో ఎంబసీని 2021లో మూసేసిన భారత్, ఇప్పుడు దాన్ని మళ్లీ తెరుస్తోంది. ఆ దేశంతో బంధాన్ని భారత్ ఎప్పుడూ గోప్యంగానే ఉంచుతుంటుంది. 2021లో అధికారులు కరోనా కారణంగా ఎంబసీ మూసేశారని, ఇప్పుడు దాన్ని మళ్లీ సిద్ధం చేస్తున్నారని ది ట్రిబ్యూన్ పత్రిక తెలిపింది. నార్త్ కొరియాకు సంబంధించిన నిఘా పరికరాలేవీ తమ కార్యాలయంలో లేదని ఖరారు చేసుకున్న తర్వాతే అధికారులు భవనంలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

News December 18, 2024

TODAY HEADLINES

image

* డీప్‌టెక్ టెక్నాలజీపై పట్టు సాధించాలి: CM చంద్రబాబు
* ఇంకా విషమంగానే శ్రీతేజ్ ఆరోగ్యం
* ఏపీలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
* సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు
* శీతాకాల విడిదికి HYD చేరుకున్న రాష్ట్రపతి
* ఏసీబీ చేతుల్లోకి ఈ-ఫార్ములా కేసు!
* అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసుల అప్పీల్?
* జమిలి బిల్లు ప్రవేశపెట్టడానికి లోక్‌సభ ఆమోదం
* INDvsAUS: భారత్‌కు తప్పిన ఫాలో ఆన్ గండం

News December 18, 2024

పాత్రలు నిరాకరిస్తున్న విజయ్ సేతుపతి?

image

పాత్ర నచ్చితే ఆలోచించకుండా అంగీకరించే విజయ్ సేతుపతి ఇప్పుడు ఆచితూచి రోల్స్ ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌తో బుచ్చిబాబు తెరకెక్కించే మూవీలో కీలకమైన పాత్ర కోసం మేకర్స్ సంప్రదించగా ఆయన నో చెప్పిన సంగతి తెలిసిందే. బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పెనలోనూ ఆయన మంచి పాత్ర చేశారు. ఇకపై హీరో పాత్రలే చేయాలని సేతుపతి భావిస్తున్నారని, అందుకే చాలా రోల్స్ రిజెక్ట్ చేశారని సమాచారం.

News December 18, 2024

కొలీజియం ముందు హాజరైన జస్టిస్ శేఖర్

image

అలహాబాద్ HC జడ్జి జస్టిస్ శేఖర్ యాదవ్ Tue సుప్రీంకోర్టు కొలీజియం ముందు హాజరయ్యారు. Dec 8న VHP ప్రొగ్రాంలో పాల్గొన్న ఆయ‌న ‘అస‌మాన న్యాయ వ్య‌వ‌స్థ‌ల‌ను యూనిఫాం సివిల్ కోడ్‌ తొలగిస్తుంది’ అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం అవ్వడంతో సుప్రీంకోర్టు వివ‌ర‌ణ కోరింది. నిబంధ‌న‌ల ప్రకారం వివాదాలు ఎదుర్కొంటున్న న్యాయ‌మూర్తులు కొలీజియం ముందు త‌మ వాద‌న వినిపించే అవ‌కాశం ఉండ‌డంతో ఆయ‌న తాజాగా వివ‌ర‌ణ ఇచ్చారు.

News December 18, 2024

రోహిత్ ధీమాగా లేడు: దినేశ్ కార్తీక్

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మలో ధీమా లేదని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. ఆ ప్రభావం ఆయన ఆటమీద కూడా కనిపిస్తోందని పేర్కొన్నారు. ‘రోహిత్ తన టెక్నిక్‌ను తాను విశ్వసించాలి. ఆ టెక్నిక్‌తోనే కదా దశాబ్దానికి పైగా క్రికెట్ ఆడారు. తన సమస్య అది కాదు. ఆయనలో విశ్వాసం లోపించినట్లు కనిపిస్తోంది. వాటిపై పోరాడాలి. తనపై తనకు నమ్మకమున్న రోహిత్ శర్మ ఇప్పుడు దేశానికి అవసరం’ అని పేర్కొన్నారు.

News December 18, 2024

నితీశ్.. కుర్రాడి నుంచి మగాడిగా మారుతున్నాడు: గవాస్కర్

image

మూడో టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డి పరిణతిని క్రికెట్ దిగ్గజం గవాస్కర్ ప్రశంసించారు. ‘తొలి 2 మ్యాచుల్లోనూ అతడికి అటువైపున టెయిలెండర్స్ ఉన్నారు. దాంతో దూకుడుగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో జడేజా ఉన్నాడు కాబట్టి భాగస్వామ్యం కోసం చాలా నియంత్రణతో అద్భుతంగా ఆడాడు. అనవసరమైన షాట్ల జోలికి పోలేదు. 16 పరుగులే చేసినా అందుకోసం 61 బంతుల్ని అడ్డుకున్నాడు. 22 ఏళ్ల ఆ కుర్రాడు ఇప్పుడు మగాడిగా మారుతున్నాడు’ అని కొనియాడారు.

News December 18, 2024

జేపీసీకి పేర్లు పంపండి.. పార్టీలను కోరిన స్పీకర్

image

జమిలి ఎన్నిక‌ల బిల్లుల‌పై JPC ఏర్పాటు విష‌య‌మై స‌భ్యుల పేర్ల‌ను ప్రతిపాదించాలని పార్టీల‌ను LS స్పీక‌ర్ ఓం బిర్లా కోరారు. 129 రాజ్యాంగ సవరణ సహా, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణల బిల్లుల‌ను కేంద్రం మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ బిల్లుల‌పై అన్ని స్థాయుల్లో విస్తృత చ‌ర్చ‌ల‌కు 31 మందితో జేపీసీ ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది. బీజేపీ స‌భ్యుడే ఛైర్మ‌న్‌గా వ్యవహరిస్తారు.

News December 18, 2024

Work Smart.. నాట్ హార్డ్‌: Dell CEO

image

ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎప్పుడూ స్మార్ట్‌గా ప‌నిచేయాలి త‌ప్ప హార్డ్‌గా కాద‌ని ఉద్యోగుల‌కు Dell CEO Michael Dell సూచించారు. రోజులో అధిక ప‌నిగంట‌లు ప్ర‌తికూల ఫ‌లితాలు ఇస్తాయ‌న్నారు. ప‌ని ప్ర‌దేశాల్లో స‌ర‌దాగా ఉండ‌క‌పోతే ప‌నిచేసే విధానం స‌రిగాలేద‌నే అర్థ‌మ‌న్నారు. ప‌నిలో ప్ర‌యోగాలు చేయాల‌ని, రిస్క్ తీసుకోవాల‌ని, విఫ‌ల‌మ‌వ్వాల‌ని, క్లిష్ట స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ ధైర్యంగా ముందుకు సాగాల‌ని సూచించారు.

News December 17, 2024

ఆ ఫొటోలు లీకైనప్పుడు కెరీర్ ముగిసిందనుకున్నా: మహీరా ఖాన్

image

రణ్‌బీర్ కపూర్‌తో కలిసి సిగరెట్ తాగిన ఫొటోలు లీక్ అయినప్పుడు తన కెరీర్ నాశనమైందని భావించినట్లు పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ అన్నారు. ఫొటోల కారణంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ చాలా కోల్పోయానని ఆమె వాపోయారు. ‘నా జీవితంలో పెళ్లి, విడాకులు, పాప పుట్టడం, సింగిల్‌గా ఉండటం, రణ్‌బీర్‌తో కలిసి ఉన్న ఫొటోలు లీక్ కావడం, ఓ దేశంలో నాపై నిషేధం విధించడం. ఇవన్నీ నాకు కష్టకాలంగా అనిపించాయి’ అని ఆమె పేర్కొన్నారు.