News December 17, 2024

పదో తరగతికి బోర్డు పరీక్షలుండవా?.. కేంద్రం ఏమందంటే?

image

నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఇకపై పదో తరగతికి బోర్డు పరీక్షలు ఉండవనే మెసేజ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని నమ్మిన విద్యార్థులు అయోమయంలో పడటంతో కేంద్రానికి చెందిన PIB FactCheck దీనిపై క్లారిటీ ఇచ్చింది. కేంద్ర విద్యాశాఖ ఇలాంటి ఆర్డర్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మి భయాందోళనకు గురికావొద్దని, దీనిని నమ్మి ఇతరులకు షేర్ చేయొద్దని కోరింది.

News December 17, 2024

నకిలీ బెదిరింపులు: ఇక నుంచి ₹లక్ష ఫైన్

image

విమానాలకు న‌కిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపే వారిపై క్రిమిన‌ల్ కేసుల న‌మోదుతోపాటు ఇక నుంచి రూ.ల‌క్ష వ‌ర‌కు జ‌రిమానా విధించ‌నున్నారు. అలాగే వారి విమాన ప్ర‌యాణాల‌పై నిషేధం విధించేలా పౌర విమానయాన భద్రతా బ్యూరో(BCAS)కు ప్ర‌భుత్వం ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ కొత్త నిబంధ‌న‌ల‌ను నోటిఫై చేసింది. ఇలా బెదిరింపు సందేశాలు పంపి అప్ప‌టికే విమానం ఎక్కిన వారిని కిందికి దింపే అధికారాన్ని కూడా క‌ల్పించింది.

News December 17, 2024

తెలుగు డైరెక్టర్‌తో ఆమిర్ ఖాన్ సినిమా?

image

తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు ఆమిర్ ఖాన్ అంగీకరించినట్లు ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. వరుసగా రెండు ఫ్లాపులు చవిచూసిన ఆమిర్, టాలీవుడ్ డైరెక్టర్‌తో పనిచేయాలని భావించినట్లు సమాచారం. ఇప్పటికే వంశీ స్టోరీ లైన్ చెప్పారని, ఆమిర్‌కు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ తయారుచేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించే అవకాశం ఉన్న ఈ మూవీపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

News December 17, 2024

శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల

image

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడ్డ <<14906305>>శ్రీతేజ్<<>> (9) ఆరోగ్యం విషమంగానే ఉందని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అతడు ఐసీయూలో వెంటిలేటర్‌పైనే ఉన్నాడని, జ్వరం పెరుగుతోందని పేర్కొన్నారు. మెదడుకు ఆక్సిజన్ సరిగా అందట్లేదని, బాలుడిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని చెప్పారు.

News December 17, 2024

ACB చేతుల్లోకి ఈ-ఫార్ములా కేసు!

image

TG: ఈ-ఫార్ములా రేసింగ్‌లో నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. ఈ కేసుకు సబంధించి ఇటీవల గవర్నర్ ఇచ్చిన అనుమతి లేఖను కూడా జత చేసి పంపారు. కాగా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రూ.53 కోట్లను ఓ విదేశీ సంస్థకు ఆర్బీఐ అనుమతులు లేకుండా నేరుగా ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

News December 17, 2024

పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి

image

AP: అమరావతిని పైప్డ్ గ్యాస్ రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పైప్డ్ గ్యాస్ అందించేందుకు IOC (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) ప్రభుత్వాన్ని సంప్రదించింది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ తరహాలో పైప్డ్ గ్యాస్ అందిస్తామని తెలిపింది. దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దుతామని పేర్కొంది. కాగా నివాసాలు, హోటళ్లు, సంస్థలు అన్నింటికీ సిలిండర్లతో కాకుండా పైపులతోనే గ్యాస్ అందిస్తారు.

News December 17, 2024

పృథ్వీ షా, రహానేకు మొండిచేయి

image

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షాకు మరో బిగ్ షాక్ తగిలింది. విజయ్ హజారే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో ముంబై అతడికి చోటివ్వలేదు. ఆయనతోపాటు రహానేకు కూడా మొండిచేయి చూపింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీషాను ఎవరూ కొనుగోలు చేయని విషయం తెలిసిందే. కాగా ఈ టోర్నీకి ఎంపిక కాకపోవడంతో పృథ్వీ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘దేవుడా ఇంకెన్ని పరుగులు చేయాలి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

News December 17, 2024

సంధ్య థియేటర్ క్లోజేనా?

image

సంధ్య థియేటర్ లైసెన్స్‌పై పోలీసులు <<14906082>>షోకాజ్<<>> నోటీసులు ఇవ్వడంతో దాన్ని క్లోజ్ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పుష్ప-2 మూవీ టీం వస్తుందని పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వకపోవడం, సెక్యూరిటీ ఏర్పాట్లు చేయకపోవడంపై పోలీసులు గుర్రుగా ఉన్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ వివరాలు, టికెట్ వెరిఫికేషన్ సిస్టమ్ లేకపోవడం, భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, పార్కింగ్ సమస్య.. ఇలా చాలా సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.

News December 17, 2024

తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్లు.. ఎప్పుడు, ఎక్కడ?

image

AP: తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉండనున్నాయి. దానికి సంబంధించిన టికెట్ల వివరాలు..
*DEC 23న ఆన్‌లైన్‌లో ఉ.11 గం.కు శ్రీవాణి వీఐపీ టికెట్ల విడుదల
*DEC 24న ఆన్‌లైన్‌లో ఉ.11 గం.కు రూ.300 స్పెషల్ దర్శన టోకెన్ల విడుదల
*తిరుపతిలోని ఎం.ఆర్ పల్లి, జీవకోన, ఇందిరా మైదానం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో SSD టోకెన్ల కేటాయింపు

News December 17, 2024

గబ్బా టెస్టు డ్రాగా ముగుస్తుందా?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న గబ్బా టెస్టు చివరి రోజు కూడా వర్షం పడొచ్చని తెలుస్తోంది. రేపు వర్షం పడేందుకు 90 శాతం అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్.కామ్ తెలిపింది. దీంతో ఈ టెస్టు డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252/9 పరుగులు చేసి ఫాలో ఆన్ తప్పించుకుంది. ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది.