News June 4, 2024

BIG BREAKING: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు

image

జనసేనాని అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. పవర్ స్టార్ ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా అమరావతి శాసనసభకు వెళ్లడమే మిగిలింది. తాజాగా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ 50 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

News June 4, 2024

‘గుడ్డు’ పగిలింది.. గాజువాకలో మంత్రి అమర్నాథ్ ఓటమి

image

మంత్రి అమర్నాథ్ గాజువాకలో ఓటమి పాలయ్యారు. TDP అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచిన అమర్నాథ్ ఈసారి గాజువాక నుంచి బరిలో దిగిన విషయం తెలిసిందే. కాగా, APకి పెట్టుబడుల విషయంలో అమర్నాథ్ చేసిన ‘కోడిగుడ్డు’ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. దీంతో ‘గుడ్డు’ పగిలింది అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

News June 4, 2024

జనసేనాని విజయాన్ని సెలబ్రేట్ చేసుకోనున్న మెగా ఫ్యామిలీ!

image

పిఠాపురం ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ గెలుపు లాంఛనమవడంతో మెగా ఫ్యామిలీ సంబరాలకు సిద్ధమైంది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆయన ఇంట్లో జరిగే వేడుకలకు కుటుంబసభ్యులంతా హాజరవుతారని సినీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ముందే తమ్ముడు పవన్‌కి చిరు సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటు పిఠాపురం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి నాగబాబు కౌంటింగ్ ఫలితాలను పరిశీలిస్తున్నారు.

News June 4, 2024

5.18లక్షల ఓట్ల ఆధిక్యంలో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి

image

నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి రికార్డు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా చివరి దశ ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా… ప్రస్తుతం 5.18లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణలో అత్యధిక మెజార్టీ సాధించే అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి రికార్డు నెలకొల్పనున్నారు.

News June 4, 2024

రాహుల్ – అఖిలేష్ కాంబో బంప‌ర్ హిట్‌

image

యూపీలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ – ఎస్పీ చీఫ్ అఖిలేష్‌ యాద‌వ్ కాంబో స‌త్ఫ‌లితాలు సాధిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. రాజ్‌పుత్‌లు, మైనారిటీలు, యాద‌వ్ వ‌ర్గాల మ‌ద్ద‌తు, రైతులు, పేప‌ర్ లీక్ వ‌ల్ల న‌ష్ట‌పోయిన ల‌క్ష‌లాది యువ‌త మ‌ద్ద‌తును ఇండియా కూట‌మికి కూడ‌గ‌ట్ట‌డంలో రాహుల్ – అఖిలేష్ ద్వ‌యం స‌క్సెస్ అయింది. ఇవి ఓట్లుగా మారడంతో UPలో ఇండియా కూటమి 43, ఎన్డీయే 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

News June 4, 2024

జగన్‌కు భారీగా తగ్గనున్న మెజార్టీ?

image

AP: ఈ ఎన్నికల్లో పులివెందులలో జగన్‌కు భారీగా మెజారిటీ తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 10 రౌండ్లు పూర్తి కాగా 37 వేలకుపైగా మెజారిటీతో ఆయన కొనసాగుతున్నారు. మొత్తం 22 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు 60 వేల నుంచి 70 వేల మెజారిటీ రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా గత ఎన్నికల్లో జగన్‌కు 90 వేలకుపైగా మెజారిటీ వచ్చిన సంగతి తెలిసిందే.

News June 4, 2024

జనసేన జెండా ఎగిరింది

image

ఏపీలో జనసేన బోణీ కొట్టింది. రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ 34,048 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అటు భీమవరంలోనూ జనసేన జెండా ఎగిరింది.

News June 4, 2024

ఓటమి దిశగా తమిళిసై, అన్నామలై!

image

తమిళనాడులో చెన్నై సౌత్ బీజేపీ అభ్యర్థి తమిళిసై ఓటమి దిశగా సాగుతున్నారు. ఆమెపై డీఎంకే అభ్యర్థి 32,887 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు కోయంబత్తూరులో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై 20,479 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అక్కడ డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్ కుమార్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు.

News June 4, 2024

చరిత్ర సృష్టించిన నారా లోకేశ్

image

AP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి సీటులో ఆ పార్టీ జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచింది రెండు సార్లే. 1985లో చివరిగా గెలిచింది. 2019లో ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండటం, సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను విపరీతంగా పెంచాయి.

News June 4, 2024

చంద్రబాబుకు మోదీ ఫోన్

image

టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఏపీలో కూటమి విజయం పట్ల అభినందనలు తెలిపారు. మరోవైపు ఈ రాత్రికి అమరావతిలో చంద్రబాబు, పవన్ భేటీ కానున్నారు. కాగా జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమికి చంద్రబాబు సపోర్ట్ కీలకం కానుంది.