India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: స్టెల్లా నౌకలో తమ బియ్యం లోడ్ చేయకుండా అడ్డుకుంటున్నారని చిత్ర, యాగ్రీ, ఎక్స్‌పోర్ట్, పద్మశ్రీ, సూర్యశ్రీ రైస్ మిల్లుల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. లోడ్ చేసేందుకు తమకు అనుమతి ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు బియ్యం లోడ్ చేయకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏంటని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని సర్కార్‌ను ఆదేశించింది.
జమిలి ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనుండడంతో పార్టీ ఎంపీలకు బీజేపీ సోమవారం విప్ జారీ చేసింది. అయితే, మంగళవారం సభలో బిల్లు ప్రవేశపెట్టడంపై జరిగిన ఓటింగ్‌కు 20 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. దీంతో విప్‌ను ధిక్కరించిన సభ్యులందరికీ నోటీసులు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కీలక సమయంలో సభకు రాకపోవడంపై పార్టీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.
విజయ్ హజారే ట్రోఫీకి యువ ఆటగాడు పృథ్వీ షాను ముంబై జట్టు పక్కన పెట్టింది. దీంతో షా ఇన్‌స్టాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘65 ఇన్నింగ్స్‌లో 55.7 సగటు, 126 స్ట్రైక్ రేట్‌తో 3399 పరుగులు చేశాను. దేవుడా నేను ఇంకా ఏం చేయాలో చెప్పు? ఈ స్టాట్స్ ఉన్న నేను పనికిరానా? నీపైనే నమ్మకం పెట్టుకున్నా. జనానికి నమ్మకం ఉందని ఆశిస్తున్నా. ఎందుకంటే నేను కచ్చితంగా తిరిగొస్తా. ఓం సాయిరాం’ అని స్టోరీ పోస్ట్ చేశారు.
కులం ఆధారంగానే రిజర్వేషన్లను కొనసాగించాలా? లేక ఆర్థిక స్థితిపై కల్పించాలన్న విషయంలో పార్లమెంటు పునరాలోచించాలని Ex PM దేవెగౌడ వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చినవి ప్రజల స్థితిని మార్చలేకపోయాయని, ఇప్పటికీ రెండు పూటలా భోజనానికి తిప్పలు పడుతున్నవారు అనేక మంది ఉన్నారన్నారు. పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలా? ఆర్థిక స్థితిపై ఇవ్వాలా? అనేదానిపై మనసు పెట్టి ఆలోచించాలన్నారు.
జీమెయిల్‌కు పోటీగా కొత్తగా ఎక్స్‌మెయిల్‌ను తీసుకురానున్నట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. వినియోగదారులకు మరింత సౌకర్యాన్నిస్తామని తెలిపారు. ‘సంప్రదాయ మెయిల్స్‌లా కాకుండా మెసేజింగ్‌కు వాడుతున్న చాటింగ్ ఫార్మాట్‌లో మెయిల్స్ ఉంటాయి. చాలా సింపుల్ డిజైన్‌తో అందరికీ సులువుగా అర్థమయ్యేలా ఉంటుంది. మెసేజింగ్, ఈమెయిలింగ్ వంటి వాటన్నింటిపై మనం పునరాలోచించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
APSRTC ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు ఈ అలవెన్సులు ఉండగా, వైసీపీ హయాంలో ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎత్తివేశారు. దాన్ని ఇప్పుడు తిరిగి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీని వల్ల ఉద్యోగులకు నెలకు రూ.5వేల నుంచి రూ.6వేలు అదనంగా అందనున్నాయి.
TG: హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాటపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఒకరి మృతికి కారణమైన థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని పేర్కొన్నారు.
AP: తన భార్యను అడ్డుపెట్టుకుని YCP MP విజయసాయిరెడ్డి విశాఖలో రూ.1,500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. ‘VSR నా భార్యతో సహజీవనం చేసి మగబిడ్డను కన్నారు. ఆయనకు డీఎన్ఏ టెస్టు నిర్వహించాలి. శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలి. ఆమెకు అనేక చోట్ల ఉన్న విలువైన ఆస్తులపై విచారణ జరిపించాలి’ అని ఆయన కోరారు.
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టవడంతో దేశం మొత్తం ‘పుష్ప-2’ గురించి మాట్లాడుకుంటోంది. దీంతో సినిమాకు ఊహించని విధంగా కలెక్షన్లు పెరిగినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా నార్త్‌లో అరెస్ట్ తర్వాతే సినిమా కలెక్షన్లు భారీగా పెరిగాయని, ప్రపంచవ్యాప్తంగా 74శాతం మేర పెరిగినట్లు వెల్లడించాయి. కాగా ఈ సినిమాకు ఇప్పటివరకు రూ.1409 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.
TG: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గన్నవరం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రపతికి సీఎం రేవంత్, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు స్వాగతం పలికారు. ఈ నెల 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. 20న ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహిస్తారు. కాగా ఇవాళ ఉదయం ద్రౌపదీ ముర్ము ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.