India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంటులో జమిలి ఎన్నిక బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులకు లోనవుతుంది. సెన్సెక్స్ 998 పాయింట్లు నష్టపోయి 80,757 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 291 పాయింట్లు నష్టపోయి 24,376 పాయింట్లతో కొనసాగుతోంది.
గుడ్డు ఎక్కడైనా గుండ్రంగా ఉండటాన్ని చూశారా? ఇలాంటి గుడ్డును స్కాట్లాండ్‌లోని ఒక సూపర్ మార్కెట్లో ఓ మహిళ గుర్తించారు. ఈ గుడ్డును ఆమె 150 పౌండ్లకు ఇంగ్లండ్‌కు చెందిన ఎడ్ పౌనెల్‌కు అమ్మేశారు. ఆయన దీన్ని లువెంటాస్ ఫౌండేషన్‌కు విరాళమివ్వగా దీన్ని వేలం వేస్తే 200 పౌండ్లు(రూ.21,520) వచ్చాయి. కాగా, సుమారు వంద కోట్ల గుడ్లలో ఇలాంటి గుండ్రటి గుడ్డు ఒక్కటి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
జమిలి బిల్లును జేపీసీకి పంపడంపై లోక్‌సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. మొత్తం 369 మంది ఓటింగ్‌లో పాల్గొనగా 220 మంది సభ్యులు YES చెప్పారు. 149 మంది NO అని ఓటేశారు. పలువురు సభ్యులు స్లిప్పుల ద్వారా ఓటు వేశారు. స్పీకర్ క్రాస్ చెకింగ్‌కు అవకాశమిచ్చారు. కాగా మొత్తం 543 మంది సభ్యులున్న లోక్‌సభలో 369 మందే ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో పాల్గొన్నారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు వెలుతురు లేమి కారణంగా అంపైర్లు నాలుగో రోజు ఆట ముగిసినట్లుగా ప్రకటించారు. అంతకుముందు భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. దీంతో ఫాలో ఆన్ గండం తప్పింది. టీమ్ ఇండియా ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది. భారత ఇన్నింగ్సులో రాహుల్(84), జడేజా(77) పరుగులు చేశారు. కమిన్స్ 4, స్టార్క్ 3 వికెట్లు తీశారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 13735 క్లర్క్ పోస్టుల భర్తీకి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు ప్రారంభం కాగా, వచ్చే ఏడాది జనవరి 7న ముగుస్తుంది. ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో, మెయిన్ పరీక్ష మార్చి/ ఏప్రిల్‌లో జరగనుంది. జనరల్/ OBC/ EWS కేటగిరీ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. మిగతా కేటగిరీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ <
కేంద్రం జమిలి బిల్లు ప్రవేశపెట్టడంతో లోక్‌సభలో దుమారం రేగింది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపడానికి డివిజన్ కోరాయి. దీంతో జేపీసీకి పంపడానికి కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ సభలో ప్రతిపాదన పెట్టారు. అందుకు స్పీకర్ ఓంబిర్లా ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ డివిజన్ జరుగుతోంది. సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
జమిలి ఎన్నికల బిల్లు ద్వారా సమాఖ్య విధానం, రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ అన్నారు. కేశవానంద భారతీ కేసులో సుప్రీం కోర్టు సమాఖ్య విధానం గురించి వివరించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర, కాంకరెంట్ లిస్టులోని అంశాలపై అంబేడ్కర్ చెప్పిన కొటేషన్స్‌ను కోట్ చేశారు. వాటి ప్రకారం ఈ బిల్లుతో రాష్ట్రాల అసెంబ్లీలకు ఇబ్బందేమీ ఉండదన్నారు. బిల్లును JPCకి పంపుతామన్నారు.
కిరాతక జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్నామని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే అసెంబ్లీల కాల వ్యవధి తగ్గిపోతుందన్నారు. ఇది రాజ్యాంగ మౌలిక నిర్మాణం, సమాఖ్య విధానానికి వ్యతిరేకమన్నారు. ‘ఈ బిల్లుతో పరోక్షంగా రాష్ట్రపతి తరహా పాలన వస్తుంది. ప్రాంతీయ పార్టీలు చచ్చిపోతాయి. సుప్రీం లీడర్ (మోదీ) అహాన్ని సంతృప్తి పరిచేందుకే దీనిని తీసుకొచ్చారు’ అని వివరించారు.
ప్రతిపక్షాల వినతి మేరకు జమిలి బిల్లును జేపీసీకి పంపేందుకు తాము సిద్ధమని కేంద్రమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రకటించారు. క్యాబినెట్ భేటీలోనూ ప్రధాని మోదీ ఇదే విషయాన్ని తమకు స్పష్టం చేశారని చెప్పారు. ఈమేరకు ఆయన న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్‌కు సూచన చేశారు. మరోవైపు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే తదితర పార్టీల ఎంపీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేశ పురోగతి కోసమే లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టినట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ‘ఐదేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. గతంలోనూ ఏకకాలంలో ఎన్నికలు జరిగేవి. ఎన్నికల కమిషన్, న్యాయ కమిషన్ సూచనల మేరకే బిల్లును తీసుకొచ్చాం. దేశ ప్రయోజనాల కోసం తీసుకొచ్చాం. సభ్యుల వద్ద సలహాలు ఉంటే ఇవ్వొచ్చు. అయితే వ్యతిరేకించడం సరికాదు’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.