News June 4, 2024

అనంతపురంలో ఆధిక్యాలు ఇలా

image

* కళ్యాణదుర్గం-సురేంద్రబాబు(టీడీపీ)-11,072
* అనంతపురం అర్బన్- దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్(టీడీపీ)- 5,026
* హిందూపురం- బాలకృష్ణ(టీడీపీ)-7,860
* ధర్మవరం-కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి(వైసీపీ)- 4,678
* పుట్టపర్తి-పల్లె సింధూరరెడ్డి(టీడీపీ)-1,008

News June 4, 2024

మల్కాజిగిరిలో కాషాయ రెపరెపలు

image

మల్కాజిగిరిలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లక్షా 40వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రధాని మోదీ రోడ్‌షో ఈటలకు కలిసివస్తోంది.

News June 4, 2024

అబ్ కీ బార్ 400 పార్ న‌హీ

image

‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదంతో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని హోరెత్తించిన బీజేపీని ఎర్లీట్రెండ్స్ టెన్ష‌న్ పెడుతున్నాయి. ఎన్డీయే – ఇండియా కూట‌ముల మ‌ధ్య హోరాహోరీ పోరు క‌నిపిస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే 289, ఇండియా కూట‌మి 223 స్థానాల్లో ముందంజ‌లో ఉన్నాయి. అయితే, ఎన్డీయే ఆధిక్యంలో ఉన్న 100కు పైగా స్థానాల్లో కేవ‌లం 5 వేల మెజారిటీయే ఉండ‌డం గ‌మ‌నార్హం.

News June 4, 2024

BRS టు కాంగ్రెస్, BJP

image

2019 BRS 9పార్లమెంట్ స్థానాల్లో గెలిచింది. అందులో మెదక్ మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్, BJP ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌కు వరంగల్, జహీరాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్ కర్నూల్, పెద్దపల్లి. BJPకి చేవెళ్ల, మహబూబ్‌నగర్ ఆధిక్యంలో ఉన్నాయి.

News June 4, 2024

నెల్లూరు రూరల్‌లో స్వల్ప ఆధిక్యంలో కోటంరెడ్డి

image

AP: నెల్లూరు రూరల్ TDP ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 1,369 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. YCP అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. అలాగే ఆత్మకూరులో YCP అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 1,711 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. ఉదయగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేశ్ 55 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

హిమాచల్‌ప్రదేశ్‌‌లో దూసుకుపోతున్న బీజేపీ

image

హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీ దూసుకుపోతోంది. హమీర్‌పూర్ నుంచి మంత్రి అనురాగ్ ఠాకూర్ పాతిక వేల ఓట్ల ఆధిక్యంలో ఉండగా, మండి నుంచి పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా 13 వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రాలో రాజీవ్ భరద్వాజ్ 44 వేలు, షిమ్లాలో సురేశ్ కుమార్ కశ్యప్ 18 వేల ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

బోసిపోయిన వైసీపీ కార్యాలయం

image

AP: ఎన్నికల ఫలితాల్లో వెనుకంజలో ఉండటంతో మంగళగిరిలోని వైసీపీ కార్యాలయం బోసిపోయింది. ఆ పరిసరాల్లో నేతలు, కార్యకర్తల జాడ కనిపించడం లేదు. ఊహించని ఫలితాలు వెలువడుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉండిపోయాయి. మరోవైపు పలు కౌంటింగ్ కేంద్రాల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు ఇంటి బాట పడుతున్నారు. తాడేపల్లిలోని నివాసంలో ఓఎస్డీతో కలిసి సీఎం జగన్‌ ఫలితాలు వీక్షిస్తున్నట్లు సమాచారం.

News June 4, 2024

మచిలీపట్నంలో వైసీపీ వెనుకంజ

image

AP: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు, వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర 6,691 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. ఇటు కైకలూరులో బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ లీడింగ్‌లో ఉన్నారు.

News June 4, 2024

1.50 లక్షల ఓట్ల మెజార్టీలో శివరాజ్ సింగ్

image

ఎంపీగా పోటీ చేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విదిశాలో తన సమీప ప్రత్యర్థి ప్రతాప్ భాను శర్మ(కాంగ్రెస్)పై ఆయన 1,50,870 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే శివరాజ్‌కు కేంద్రమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.

News June 4, 2024

BJP 242 vs INC 105: పెరిగిన కాంగ్రెస్ సీట్లు

image

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటములు నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం ఎన్డీయే 288, ఇండియా 225 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. పార్టీల వారీగా చూస్తే బీజేపీ డామినేటింగ్ పొజిషన్లో ఉంది. 240 స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాంగ్రెస్ 105 సీట్లకు పెరిగింది. దాదాపుగా పదేళ్ల తర్వాత రాహుల్ సేన సీట్లు వందకు పెరగడం గమనార్హం.