News June 4, 2024

NDA vs INDIA: క్రాష్ అవుతున్న స్టాక్ మార్కెట్లు

image

ఎర్లీ ట్రెండ్స్ సరళిని గమనిస్తే ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. పోటీ ఏకపక్షంగా లేకపోవడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ పతనం దిశగా సాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 612 పాయింట్ల నష్టంతో 22,651, బీఎస్ఈ సెన్సెక్స్ 2117 పాయింట్లు పతనమై 74,313 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు నిఫ్టీ 1440 పాయింట్లు ఎరుపెక్కి 49,539 వద్ద ఉన్నాయి. ప్రస్తుత పతనంతో మదుపర్లు రూ.6 లక్షల కోట్లు నష్టపోయారు.

News June 4, 2024

పాణ్యంలో టీడీపీ అభ్యర్థి 2,365 ఓట్ల లీడింగ్

image

బద్వేలులో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ లీడింగులో ఉన్నారు. పాణ్యంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరిత 2,365 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పులివెందులలో తొలి రౌండులో సీఎం జగన్‌ 1,888 ఓట్ల లీడింగులో కొనసాగుతున్నారు. పెనుకొండలో సవిత వెయ్యి ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ లీడింగులో ఉన్నారు.

News June 4, 2024

చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధిక్యం

image

చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసే సమయానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 3,773 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 3,214 ఓట్లు పడ్డాయి.

News June 4, 2024

ఖమ్మంలో 55వేల ఆధిక్యంలో కాంగ్రెస్

image

TG: ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి మొదటి నుంచి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రఘురాంరెడ్డి రెండో రౌండ్ ముగిసే సమయానికి 55,654 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గతంలో ఇది బీఆర్ఎస్ సిటింగ్ సీటు.

News June 4, 2024

కొండపిలో టీడీపీ ఆధిక్యం

image

AP: కొండపి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డీబీవీ స్వామి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ వెనుకంజలో ఉన్నారు. అలాగే సంతనూతలపాడులో టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి మేరుగు నాగార్జున వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

BIG BREAKING: ప్రధాని నరేంద్ర మోదీ వెనుకంజ

image

వారణాసి నుంచి పోటీలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న అజయ్ లీడ్ కనబరుస్తున్నారు. మోదీ 6 వేలకు పైగా ఓట్ల వెనకబడ్డట్లు తెలుస్తోంది.

News June 4, 2024

BREAKING: మాచర్లలో పిన్నెల్లి వెనుకంజ

image

అత్యంత వివాదాస్పదంగా మారిన మాచర్ల నియోజకవర్గంలో ఊహించని ఫలితం రాబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి 1,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, మాచర్లలో పోలింగ్ సందర్భంగా పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో ఆ నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

News June 4, 2024

జమ్మలమడుగులో ఆది నారాయణ లీడింగ్

image

AP: తిరుపతి అసెంబ్లీ స్థానంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు లీడింగులో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అక్కడ వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి బరిలో ఉన్నారు.

News June 4, 2024

నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

image

TG: నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

News June 4, 2024

భువనగిరిలో మారిన ఆధిక్యం

image

భువనగిరిలో ఆధిక్యం మారుతోంది. మొదట బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ముందంజలో ఉండగా.. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.