News January 14, 2025
ఈ ఏడాదీ బాదుడే.. పెరగనున్న రీఛార్జ్ ధరలు?

గత ఏడాది 25 శాతం వరకు టారిఫ్‌లను పెంచిన టెలికం కంపెనీలు కొత్త సంవత్సరంలోనూ బాదుడుకు సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు 10 శాతం ధరలను పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 5G సేవలకు నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని పేర్కొంటున్నాయి. ధరల పెంపుతో జియో, ఎయిర్‌టెల్, VIల యావరేజ్ రెవెన్యూ కనీసం 25 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Similar News
News February 19, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట

TG: పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు, రాధాకిషన్ రావుకు ఊరట లభించింది. కేసు దర్యాప్తుపై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ (మార్చి 3) వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్టర్ చక్రధర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు హరీశ్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిని క్వాష్ చేయాలని హరీశ్ రావు, రాధాకిషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
News February 19, 2025
ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని డిమాండ్

తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెల రాక ముందే ఎండలు మండిపోతున్నాయి. ఉ.10 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో స్కూళ్లలో ఈసారి ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సాధారణంగా మార్చి మూడో వారం నుంచి హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. పరీక్షలు ముగిసే వరకు ఉ.7.45 నుంచి మ.12.30 వరకు స్కూళ్లు పని చేస్తాయి.
News February 19, 2025
ఇండియాలో అత్యంత ఎత్తైన ఫ్యామిలీ వీళ్లదే!

కుటుంబంలో ఒక్కరు లేదా ఇద్దరు పొడుగ్గా ఉండటం కామన్. కానీ ఫ్యామిలీలో ఉన్న నలుగురూ తలెత్తుకుని చూసేంత ఎత్తుగా ఉంటే? మహారాష్ట్రలోని పుణేలో కులకర్ణి కుటుంబం ఇండియాలోనే అత్యంత ఎత్తైనది. గతంలో అత్యంత ఎత్తైన కుటుంబంగా లిమ్కా బుక్ వరల్డ్ రికార్డులోనూ చోటు సంపాదించుకుంది. నలుగురి ఉమ్మడి ఎత్తు 26 అడుగులు. తండ్రి 6.8 ఫీట్, తల్లి 6.2 ఫీట్, మొదటి కూతురు 6.6 ఫీట్, రెండో కూతురు 6.4 ఫీట్ ఉన్నారు.