News January 14, 2025

లాస్ ఏంజెలిస్: మళ్లీ మంటలు.. హెచ్చరికలు

image

లాస్ ఏంజెలిస్ (అమెరికా)కు మరో ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. లాస్ ఏంజెలిస్ తూర్పు ప్రాంతంలోని శాంటా అనా నది పక్కన కొత్తగా మంటలు ప్రారంభమయ్యాయని, భీకర గాలులతో ఇవి వేగంగా విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. జురుపా అవెన్యూ, క్రెస్ట్ అవెన్యూ, బురెన్ ప్రజలు తక్షణం తమ నివాస ప్రాంతాలను వదిలి వెళ్లాలని హెచ్చరించారు. మరోవైపు గాలులతో మంటలు ఆర్పడం ఫైర్ ఫైటర్లకు కష్టంగా మారింది.

News January 14, 2025

పాకిస్థాన్‌కు రోహిత్ శర్మ?

image

<<14970733>>ఛాంపియన్స్ ట్రోఫీ<<>> ప్రారంభానికి ముందు IND కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ICC టోర్నీల ప్రారంభానికి ముందు హోస్ట్ నేషన్‌లో అన్ని జట్ల కెప్టెన్లు ఫొటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. ఈసారి CTని పాక్ హోస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి రోహిత్ వెళ్తారా? లేదా ఫొటో షూట్‌ను వేరే చోట నిర్వహిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

News January 14, 2025

కొత్త రైలు ఇంజిన్‌తో ప్రపంచాన్ని స్టన్‌చేసిన భారత్!

image

భారత్ మరో అద్భుతం చేసింది. US సహా ప్రపంచాన్ని స్టన్‌ చేసింది. తొలిసారిగా 1200 హార్స్‌పవర్‌తో నడిచే హైడ్రోజన్ రైల్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. మరికొన్ని రోజుల్లోనే ట్రయల్ రన్ చేపట్టనుంది. ఇప్పటి వరకు అమెరికా, చైనా, జర్మనీలోనే ఇలాంటి రైలు ఇంజిన్లు ఉన్నాయి. వాటి సామర్థ్యమూ 500-600HPS మధ్యే ఉంటుంది. భారత్ మాత్రం 1200HPS, 140KMSతో అబ్బురపరిచింది. వీటికి డీజిల్, కరెంటు అవసరం లేదు. కాలుష్యం వెలువడదు.

News January 14, 2025

No Pollution: హైడ్రోరైళ్లతో లాభాలేంటంటే..

image

హైడ్రోజన్ రైళ్లను ప్రపంచం ఫ్యూచర్‌గా భావిస్తోంది. కాలుష్యాన్ని నివారించి జీరో ఎమిషన్ టార్గెట్ సాధించాలంటే ఇది తప్పనిసరి. హైడ్రోజన్, ఆక్సిజన్‌ ఉండే ఫ్యూయల్ సెల్స్ ఉత్పత్తి చేసే కరెంటుతో ఈ ఇంజిన్లు నడుస్తాయి. బైప్రొడక్ట్‌గా పొగకు బదులు పరిసరాలకు హాని కలిగించని నీటిఆవిరి విడుదలవుతుంది. ఎలక్ట్రిఫికేషన్ లేని ట్రాకుల్లోనూ నడుస్తాయి. పైగా డీజిల్, వైరింగ్ అవసరం లేదు. దీంతో చాలా డబ్బులు ఆదా అవుతాయి.

News January 14, 2025

‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్లకు ఏమైంది?

image

‘గేమ్ ఛేంజర్’ రిలీజైన తొలిరోజు రూ.186 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు మూవీ టీమ్ ట్వీట్ చేసింది. ఏమైందో తెలియదు గానీ ఆ తర్వాతి రోజు నుంచి అధికారికంగా వసూళ్లను వెల్లడించట్లేదు. తొలి రోజు తర్వాత కలెక్షన్లు తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ సినిమాపై కుట్ర జరుగుతోందని, పైరసీ ప్రింట్ లీక్ చేశారని మూవీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, రూ.400 కోట్లతో దీన్ని తెరకెక్కించారు.

News January 14, 2025

నన్ను ఆ పేరుతో పిలవకండి: తమిళ హీరో

image

తమిళ హీరో జయం రవి అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. ఇకపై తనను జయం రవి అని కాకుండా రవి లేదా రవి మోహన్ అని పిలవాలని కోరారు. జయం రీమేక్‌లో నటించడంతో ఆయన పేరు జయం రవిగా మారింది. ఈ క్రమంలో తనను పాత పేరుతోనే పిలవాలన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన కాదళిక్క నేరమిళై మూవీ ఇవాళ థియేటర్లలో విడుదల కానుంది.

News January 14, 2025

‘మీ పరిహారం హోటల్ ఖర్చులకూ సరిపోదు’.. బైడెన్‌పై సెటైర్లు

image

కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ బాధితులకు అధ్యక్షుడు జో బైడెన్ పరిహారం ప్రకటించారు. వన్ టైమ్ పేమెంట్ కింద సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు 770 డాలర్ల (రూ.66,687) చొప్పున ఇస్తామని తెలిపారు. దీనిపై కొందరు అమెరికా పౌరులు మండిపడుతున్నారు. ఉక్రెయిన్‌కు బిలియన్ల డాలర్లు ఇస్తూ తమకు ఇంత తక్కువ పరిహారం ఇస్తారా అని పోస్టులు చేస్తున్నారు. ఆ 770 డాలర్లు ఒక రోజు నైట్ హోటల్ ఖర్చులకూ చాలవని సెటైర్లు వేస్తున్నారు.

News January 14, 2025

ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం: మంత్రి

image

TG: రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. దీని వల్ల ప్రభుత్వంపై రూ.12వేల కోట్ల వరకూ భారం పడుతుందన్నారు. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ లబ్ధిదారులకు ఒకొక్కరికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులను ఈనెల 26 నుంచి జారీ చేయనున్నారు.

News January 14, 2025

Stock Markets: నేడు పుల్‌బ్యాక్ ర్యాలీకి ఛాన్స్!

image

దేశీయ స్టాక్‌మార్కెట్లలో నేడు పుల్‌బ్యాక్ ర్యాలీకి ఆస్కారం కనిపిస్తోంది. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 160PTS లాభంతో 23,289 వద్ద ట్రేడవుతుండటం సానుకూల పరిణామం. డాలర్ ఇండెక్స్ పెరుగుతున్నప్పటికీ బాండ్ యీల్డులు, క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గాయి. జపాన్ నిక్కీ భారీగా పతనమైంది. తైవాన్ సూచీ పెరిగింది. STOCKS 2 WATCH: HCL, ANGEL ONE, ANAND RATHI, HSCL, DEN, ADANI ENERGY

News January 14, 2025

విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్టే!

image

TG: వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలను పెంచొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఛార్జీల పెంపునకు డిస్కంలు అనుమతి కోరగా తిరస్కరించింది. ప్రస్తుత ఛార్జీలనే కొనసాగించాలని ఆదేశించింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ ERCకి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ మేరకు ఈనెల 18న డిస్కంలు తమ ప్రతిపాదనలను ERCకి సమర్పించే ఛాన్సుంది. డిస్కంల నష్టాల మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తేనే ఛార్జీల పెంపు ఉండదని సమాచారం.