News June 4, 2024

అనకాపల్లిలో సీఎం రమేశ్ ముందంజ

image

AP: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బూడి ముత్యాలనాయుడు పోటీలో ఉన్నారు. 1వ రౌండ్‌లో సీఎం రమేశ్‌కు 4,278 ఓట్లు పోలవ్వగా.. బూడి ముత్యాలనాయుడుకి 3,289 ఓట్లు పడ్డాయి. సీఎం రమేశ్ 989 మెజార్టీలో ఉన్నారు.

News June 4, 2024

MP: 17 స్థానాల్లో బీజేపీ దూకుడు.. శివరాజ్, సింధియా ముందంజ

image

మధ్య‌ప్రదేశ్‌లో వార్ వన్‌సైడ్ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో ఎన్డీయే అత్యధిక స్థానాల్లో దూసుకుపోతోంది. మొత్తం 29 నియోజకవర్గాల్లో బీజేపీ 17 స్థానాల్లో అదరగొడుతోంది. విపక్ష ఇండియా కూటమి రెండిట్లో ఆధిక్యంలో ఉంది. గుణలో జ్యోతిరాధిత్య సింధియా, విదిశాలో శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకెళ్తున్నారు. చింద్వాడాలో నకుల్ కమల్‌నాథ్ (కాంగ్రెస్), బాలాఘాట్‌లో అశోక్ సింగ్ (కాంగ్రెస్) పోటీనిస్తున్నారు.

News June 4, 2024

గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన లీడ్

image

ఉమ్మడి ప.గో. జిల్లా భీమవరంలో జనసేన అభ్యర్థి అంజిబాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు కాకినాడ రూరల్‌లో జనసేన క్యాండిడేట్ పంతం నానాజీ, తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధిక్యంలో ఉన్నారు. అటు ఉండి, రాజమండ్రి సిటీ, పాలకొల్లు, దెందులూరులో టీడీపీ అభ్యర్థులు రఘురామకృష్ణరాజు, ఆదిరెడ్డి వాసు, నిమ్మల రామానాయుడు, చింతమనేని ప్రభాకర్ లీడ్‌లో ఉన్నారు.

News June 4, 2024

ఒంగోలులో దామచర్ల ఆధిక్యం

image

AP: ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్ రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2,760 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

19,935ఓట్ల లీడింగ్‌లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి

image

TG: ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫస్ట్ రౌండ్‌లో 19,935 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

News June 4, 2024

పొన్నూరులో ధూళిపాళ్ల లీడింగ్

image

AP: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య వెనుకంజలో ఉన్నారు. పొన్నూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

తిరుపతి ఎంపీ: గురుమూర్తికి ఆధిక్యం

image

AP: తిరుపతి పార్లమెంట్ స్థానంలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ మద్దెల గురుమూర్తి ఆధిక్యంలో వచ్చారు. తొలి రౌండులో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ లీడింగులో ఉండగా, ఇప్పుడు గురుమూర్తి ముందంజలో ఉన్నారు. అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ నుంచి అనంత వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు. పుట్టపర్తిలో శ్రీధర్‌రెడ్డి(వైసీపీ) లీడింగులో ఉన్నారు.

News June 4, 2024

శ్రీకాకుళం ఎంపీ స్థానంలో టీడీపీ ముందంజ

image

AP: శ్రీకాకుళం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌పై రామ్మోహన్ నాయుడు 1,861 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

హైదరాబాద్‌లో మాధవీ లత లీడింగ్

image

హైదరాబాద్ ఎంపీ స్థానంలో BJP అభ్యర్థి మాధవీలత లీడింగ్‌లో ఉన్నారు. అక్కడ ఎవరూ ఊహించని విధంగా అసదుద్దీన్ ఒవైసీ వెనకబడ్డారు.

News June 4, 2024

జగ్గంపేట, ముమ్మడివరం, అమలాపురంలో టీడీపీ హవా

image

AP: జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రు 3550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ముమ్మడివరం, అమలాపురంలో టీడీపీ అభ్యర్థులు దాట్ల సుబ్బరాజు, అయితాబత్తుల ముందంజలో ఉన్నారు.