News January 14, 2025
‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్లపై ఆర్జీవీ సెటైర్లు

‘గేమ్ ఛేంజర్’ మూవీ కలెక్షన్లపై దర్శకుడు RGV సెటైర్లు వేశారు. ఒకవేళ GC తొలి రోజు రూ.186 కోట్లు వసూలు చేస్తే ‘పుష్ప-2’ రూ.1,860 కోట్లు కలెక్షన్లు రావల్సిందన్నారు. గేమ్ ఛేంజర్‌కు రూ.450 కోట్ల ఖర్చయితే అద్భుతమైన విజువల్స్ ఉన్న RRR మూవీకి రూ.4,500 కోట్లు ఖర్చయి ఉండాలన్నారు. గేమ్ ఛేంజర్ విషయంలో అబద్దాలు నమ్మదగినవిగా ఉండాలని పేర్కొన్నారు. అయితే వీటి వెనుక దిల్ రాజు ఉండరని నమ్ముతున్నట్లు రాసుకొచ్చారు.
Similar News
News February 19, 2025
నేటి ముఖ్యాంశాలు

* ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్ కావాలి: CM చంద్రబాబు
* ఎవరినీ వదిలిపెట్టం.. బట్టలు ఊడదీసి నిలబెడతాం: YS జగన్
* చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోంది: YCP
* విభజన హామీలను పవనే సాధించాలి: ఉండవల్లి
* సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్‌గా ఉంచుతాం: రేవంత్
* రేవంత్ నిజాయితీగల మోసగాడు: KTR
News February 19, 2025
MLC ఎన్నికలు.. పదేపదే కాల్స్‌తో తలనొప్పి!

తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఏపీలో ఉభయ గోదావరి-గుంటూరు, కృష్ణా, తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. కొత్త కొత్త నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ మద్దతు అడుగుతున్నారని.. రోజుకు 10 కాల్స్ వస్తే 7-8 కాల్స్ వాళ్లవే అని అసహనానికి గురవుతున్నారు. మరి మీకూ కాల్స్ వస్తున్నాయా?
News February 19, 2025
మరో ఐదు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

TG: మూడో విడతలో ఐదు జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. నారాయణ పేటకు సత్యయాదవ్, సూర్యాపేటకు శ్రీలత రెడ్డి, నిర్మల్‌కు రితేశ్ రాథోడ్, సిద్దిపేటకు బైరి శంకర్ ముదిరాజ్, రాజన్న సిరిసిల్లకు గోపి ముదిరాజ్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది. సంస్థాగతంగా తెలంగాణలో బీజేపీకి 38 జిల్లాలు ఉన్నాయి. వీటిలో మూడు విడతల్లో 28 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది.