News June 4, 2024

నరసరావుపేట, రాజమండ్రి కూటమి ఎంపీ అభ్యర్థుల లీడింగ్

image

AP: రాజమండ్రి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి పురందీశ్వరి, నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు లీడింగ్‌లో ఉన్నారు.

News June 4, 2024

వరంగల్‌లో కడియం కావ్య ముందంజ

image

TG: వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్య ముందంజలో ఉన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచారు. కాంగ్రెస్ మొత్తం 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

News June 4, 2024

కౌంటింగ్ డే: ద‌లాల్ స్ట్రీట్ ఏమంటోంది?

image

ఎన్నికల ఫలితాల రోజున‌ ద‌లాల్ స్ట్రీట్ వ‌ర్గాల స్పంద‌న‌పై ఆస‌క్తి నెల‌కొంది. 2004 ఎన్నిక‌ల ఫ‌లితాల రోజున‌ సెన్సెక్స్, నిఫ్టీ 11.10% – 12.20% న‌ష్ట‌పోయాయి. అయితే, 2009లో సెన్సెక్స్ – నిఫ్టీ రెండూ 17% కంటే అధికంగా ఎగ‌బాకాయి. 2014 ఎన్నికల ఫలితాల రోజున బెంచ్‌మార్క్ సూచీలు 0.90% పెరిగాయి, అదే 2019లో 0.76% తగ్గాయి. మ‌రి ఈ రోజు మార్కెట్ వ‌ర్గాలు ఎలా స్పందిస్తాయ‌న్న‌దానిపై ఆస‌క్తి నెల‌కొంది.

News June 4, 2024

మంగళగిరిలో లోకేశ్ ఆధిక్యం

image

గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

వెనుకంజలో లాలూ ‘డాటర్స్’

image

బిహార్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆర్జేడీ నుంచి ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ వారసులే ఎక్కువగా పోటీ చేస్తున్నారు. బ్యాలెట్ ఓట్లలో వారి కుమార్తెలు వెనుకంజలో ఉన్నారని అప్డేట్స్ వస్తున్నాయి. సరణ్‌లో రాజీవ్ ప్రతాప్ రూఢీకి రోహిణీ ఆచార్య పోటీనివ్వలేకపోతున్నారు. పాటలీపుత్రలో మీసా భారతికి కష్టాలు ఎదురవుతున్నాయి. రామ్ కృపాల్ యాదవ్‌ ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

UP: 20 స్థానాల్లో బీజేపీ, 3 సీట్లలో కాంగ్రెస్ ముందంజ

image

ఉత్తర్ ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థులు దుమ్మురేపుతున్నారు. ఎర్లీ ట్రెండ్స్‌లో 20 స్థానాల్లో కమలం పార్టీ ముందంజలో ఉంది. వారణాసిలో మోదీ, అమేథీలో స్మృతి ఇరానీ, సుల్తాన్‌పూర్‌లో మేనకగాంధీ దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ మూడు సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఎస్పీలో అఖిలేశ్ యాదవ్ అతడి భార్య డింపుల్ ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

పెద్దపల్లి, నల్గొండలో కాంగ్రెస్ ఆధిక్యం

image

పెద్దపల్లి, నల్గొండ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో గడ్డం వంశీకృష్ణ, రఘువీర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మరోవైపు ఖమ్మం నుంచి కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

News June 4, 2024

BIG BREAKING: 33 స్థానాల్లో కూటమి ఆధిక్యం

image

ఏపీలో ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం కూటమి 33 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇందులో టీడీపీ 28 చోట్ల, జనసేన 5 స్థానాల్లో ఉన్నాయి. టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేశ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పూతలపట్టులో మురళీ మోహన్ లీడ్‌లో ఉన్నారు. ఇక పిఠాపురంలో పవన్, తెనాలిలో నాదెండ్ల మనోహర్ లీడ్ కనబరుస్తున్నారు.

News June 4, 2024

పిఠాపురంలో పవన్ ఆధిక్యం

image

AP: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ప్రత్యర్థి వంగా గీతపై 1000 ఓట్లకు పైగా ఆధిక్యంలో పవన్ ఉన్నారు.

News June 4, 2024

2019లో నోటా ఓట్ల లెక్క‌

image

2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాకు 65,22,772 ఓట్లు పోల్ అయ్యాయి. బిహార్‌లో అత్య‌ధికంగా 8.16 ల‌క్ష‌ల ఓట్లు, ఉత్తరప్రదేశ్‌లో 7.25 ల‌క్ష‌లు, తమిళనాడులో 5.50 ల‌క్ష‌ల ఓట్లు, పశ్చిమ బెంగాల్‌లో 5.46 ల‌క్ష‌ల ఓట్లు, మహారాష్ట్రలో 4.88 ల‌క్ష‌ల ఓట్లు పోల‌య్యాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీలో 1.28% ఓట్లు నోటాకు పోల‌య్యాయి.