News January 14, 2025

TODAY HEADLINES

image

✒ కుంభమేళా.. తొలి రోజే కోటి మంది పుణ్యస్నానాలు
✒ ఒకే రోజు 23 పైసలు డౌన్.. 86.27కు రూపాయి
✒ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మోదీ, చిరంజీవి
✒ APలో మరోసారి తగ్గనున్న మద్యం ధరలు!
✒ నారావారిపల్లెలో సీఎం CBN సంక్రాంతి వేడుకలు
✒ TTDలో సమన్వయ లోపం లేదు: ఛైర్మన్, ఈవో
✒ TG: కౌశిక్ రెడ్డి అరెస్ట్.. దుర్మార్గమన్న కేటీఆర్
✒ TG: కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు
✒ TG: రేపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

News January 14, 2025

పన్ను వసూళ్లలో 15.88 శాతం వృద్ధి

image

FY2024-25లో ఈ నెల 12 వరకు రూ.16.89 లక్షల కోట్లు ఇన్‌కమ్ ట్యాక్స్ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. FY2023-24లో ఇదే సమయంతో పోలిస్తే 15.88 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. ఇందులో వ్యక్తిగత ఆదాయ పన్ను రూ.8.74 లక్షల కోట్లు, కార్పొరేట్ పన్ను రూ.7.68 లక్షల కోట్లు, సెక్యూరిటీ లావాదేవీల పన్ను రూ.44,538 కోట్లు, ఇతర పన్నులు రూ.2,819 కోట్లు ఉన్నాయంది.

News January 14, 2025

కరీంనగర్‌కు కౌశిక్ రెడ్డి తరలింపు

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కరీంనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తారనే సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరికాసేపట్లో ఆయనను జడ్జి ముందే ప్రవేశపెట్టే అవకాశముంది. మరోవైపు కౌశిక్‌ను అరెస్ట్ చేయడం అక్రమమని హరీశ్ రావు అన్నారు.

News January 14, 2025

నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను భర్త చూసుకుంటున్నారు: పీవీ సింధు

image

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆస్పత్రిలో ఉన్న వీడియో చూసినప్పుడు ఎమోషనల్‌ అయినట్లు పీవీ సింధు చెప్పారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలన్నారు. ‘నా ఆదాయం, పన్నుల వ్యవహారాన్ని పేరెంట్స్ చూసుకుంటున్నారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను భర్త దత్తసాయి మేనేజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు నాకు ఎలాంటి ఆర్థిక సమస్యలు రాలేదు. అందుకు నేను సంతోషిస్తున్నా’ అని పేర్కొన్నారు.

News January 14, 2025

రేపు సాయంత్రం 6 గంటలకు..

image

సంక్రాంతి సందర్భంగా కేరళ శబరిమలలో మకరజ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. రేపు సాయంత్రం 6-7 గంటల మధ్య జ్యోతి దర్శనం ఇస్తుంది. ఎన్నో దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఆకాశంలో నక్షత్రంలా కనిపించే ఈ కాంతిని దర్శించుకుంటే జీవితంలో సుఖ, సంతోషాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అక్కడికి వెళ్లలేకపోయినా టీవీలో వీక్షించేందుకు కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు.

News January 13, 2025

శ్రీవారి పరకామణిలో చోరీ.. వెలుగులోకి సంచలన విషయాలు

image

AP: తిరుమల శ్రీవారి పరకామణిలో 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ చోరీ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్య కొన్ని నెలలుగా ఇదే తరహాలో దొంగతనాలు చేసినట్లు వెల్లడైంది. అతని నుంచి 555 గ్రాముల బంగారు బిస్కెట్‌లు, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.అర కోటి ఉంటుందని తెలిపారు.

News January 13, 2025

పసుపు బోర్డు ఏర్పాటు హర్షణీయం: కిషన్ రెడ్డి

image

తెలంగాణలోని నిజామాబాద్‌లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుండటంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావద్దేశానికి సంక్రాంతి కానుక అని తెలిపారు. రేపటి నుంచి పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుందని, ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ దీన్ని ఏర్పాటు చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.

News January 13, 2025

పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్ కేసులు

image

హైదరాబాద్‌లో కొద్దిరోజులుగా స్కార్లెట్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 5-15 ఏళ్ల పిల్లలకు వ్యాపించే ఈ వైరస్‌తో ఆహారంపై అనాసక్తి, తీవ్రజ్వరం, నాలుక కందిపోవడం, నోట్లో పొక్కులు, గొంతులో మంట, నీరసం వంటి లక్షణాలుంటాయి. వీటితో పాటు 2-5 రోజుల్లో ఆయాసం, ముఖం వాపు, మూత్రం తగ్గడం, మూత్రంలో రక్తం గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.

News January 13, 2025

యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

image

ఎల్లుండి(15న) జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్షను NTA వాయిదా వేసింది. అభ్యర్థుల వినతి మేరకు సంక్రాంతి, పొంగల్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. కొత్త డేట్‌ను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. అటు 16న జరగాల్సిన ఎగ్జామ్ యథావిధిగా కొనసాగుతుందని చెప్పింది. కాగా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభమయ్యాయి.

News January 13, 2025

మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కన్నుమూత

image

AP: రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. రాజశేఖరం ZP ఛైర్మన్‌గా, 1994లో ఉణుకూరు MLAగా(ఆ నియోజకవర్గం ఇప్పుడు రద్దయ్యింది), రాజ్యసభ ఎంపీగా సేవలు అందించారు. ఈయన కుమారుడు పాలవలస విక్రాంత్ YCP MLCగా ఉన్నారు. కూతురు రెడ్డి శాంతి పాత పట్నం మాజీ ఎమ్మెల్యే.