News June 4, 2024

టీడీపీ పరిస్థితి మారేనా?

image

AP:ఉత్తరాంధ్రలో 2019 ఫలితాల్లో TDP 34 స్థానాలకు గాను 6 స్థానాల్లోనే గెలిచింది. SKLMలో 10 స్థానాలకు గాను 2, ఉమ్మడి VSPలో 15 స్థానాలకు గాను 4 స్థానాల్లోనే గెలిచింది. VZMలో 9 స్థానాలుండగా TDP ఖాతా తెరవలేదు. ఈ ఎన్నికల్లో TDP, జనసేన, BJP కూటమిగా బరిలో దిగడంతో పరిస్థితి మారుతుందని ఆయా పార్టీల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విజయనగరంలో కూటమి ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.

News June 4, 2024

సీమలో పోటీలో ఉన్న ప్రముఖులు

image

AP: రెండు ప్రధాన పార్టీల(YCP, TDP) అధ్యక్షులు వైఎస్ జగన్(పులివెందుల), చంద్రబాబు(కుప్పం) సహా పలువురు ప్రముఖులు రాయలసీమ నుంచి బరిలో ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు), నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(రాజంపేట ఎంపీ), బాలకృష్ణ(హిందూపురం) గెలుపోటములపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కిరణ్ తొలిసారి ఎంపీ బరిలో నిలిచారు.

News June 4, 2024

రెండు చోట్ల టీడీపీ ముందంజ

image

రాజమండ్రి రూరల్ స్థానంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ 900కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ లీడింగ్‌లో ఉన్నారు.

News June 4, 2024

ఫస్ట్ ఫలితం నిజామాబాద్‌దే..

image

తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో మొదటి ఫలితం నిజామాబాద్ నుంచే వెలువడనుంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున మరోసారి బరిలో నిలిచారు. అధికార కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్థన్ పోటీలో ఉన్నారు. ఓట్ల కౌంటింగ్ కోసం 140 టేబుళ్లు ఏర్పాటు చేయగా 15రౌండ్లలో ఫలితం తేలనుంది.

News June 4, 2024

ట్రెండింగ్‌లో #400Paar

image

ఎన్నికల కౌంటింగ్ మొదలైన వేళ ట్విటర్‌లో ‘400 పార్’ ట్రెండ్ అవుతోంది. ఆ పార్టీ శ్రేణులు #400Paar అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ‘అబ్కీ బార్ 400 పార్’ అంటూ ఎన్నికల సమరంలోకి దిగిన బీజేపీ 400 స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. మరికొన్ని గంటల్లోనే వారి నినాదం నిజమవుతుందో లేదో తేలిపోనుంది.

News June 4, 2024

2019, 2014 ఎన్నికల్లో ఎవ‌రికి ఎన్ని సీట్లు?

image

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 52 సీట్లకు ప‌రిమిత‌మైంది. 2014లో బీజేపీ 282 స్థానాల్లో గెలిచి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో ఎన్డీయే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 44 సీట్లు ద‌క్కించుకుంది. ఇక 2024 ఎన్నిక‌ల్లో ఎవ‌రికి ఎన్ని సీట్లు ద‌క్కుతాయ‌న్న‌ది మ‌రి కొద్దిసేప‌ట్లో తేల‌నుంది.

News June 4, 2024

ఈ సారి ప్రకాశం ఎటు వైపో?

image

AP: గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో YCP 8 స్థానాలు, TDP నాలుగు స్థానాల్లో గెలిచాయి. వైసీపీ గాలిలో కూడా జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకుని ఉనికిని కాపాడుకుంది. జిల్లాలోని గిద్దలూరులో వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు ఏకంగా 81,035 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇది సీఎం జగన్ తర్వాత అత్యధిక మెజారిటీ. మరి ఈసారి జిల్లా ప్రజలు ఎటు వైపు మొగ్గుచూపుతారో చూడాలి.

News June 4, 2024

ఈ ఎన్నిక‌లు ఓ రికార్డు

image

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ మొత్తం 7 ద‌శ‌ల్లో 44 రోజుల‌పాటు సాగి కొత్త రికార్డు నమోదు చేసింది. అదే, 1996లో 11 రోజులు, 1998లో 8 రోజులు, 1999లో 28 రోజులు, 2004లో 21 రోజులు, 2009లో 28 రోజులు, 2014లో 36 రోజులు, 2019లో 39 రోజులపాటు ఎన్నిక‌ల ప్రక్రియ సాగింది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ సుదీర్ఘంగా నిర్వ‌హిస్తుండ‌డంపై ప్ర‌తిప‌క్షాలు అభ్యంత‌రాలు లేవ‌నెత్తిన విష‌యం తెలిసిందే.

News June 4, 2024

ఆ రికార్డును తిరగ రాస్తారా?

image

AP: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పాడేరు నియోజక వర్గం నుంచి వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి.. టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై (40,930) ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన అత్యధిక మెజార్టీ ఇదే. తర్వాత అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి YCPఅభ్యర్థి ఫల్గుణ.. TDP అభ్యర్థి శ్రావణ్ కుమార్‌పై 31,647 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును ఎవరు తిరగరాస్తారో చూడాలి.

News June 4, 2024

అమరావతి ఓటు ఎటువైపు?

image

AP: రాజధాని అమరావతి విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లా గుంటూరు. ఇటు పక్కనే ఉన్న కృష్ణా జిల్లాలో సైతం రాజధాని ప్రభావం కనిపిస్తోంది. రెండు జిల్లాల్లో మొత్తం 33(గుంటూరు 17, కృష్ణా 16) నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరులో YCP 15, TDP 2 స్థానాల్లో, ఉమ్మడి కృష్ణాలో YCP 15 గెలిస్తే, TDP ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. మరి ఈసారి రాజధాని అంశంతో తమకు ఎక్కువ సీట్లు రావొచ్చని టీడీపీ లెక్కలు వేస్తోంది.