India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సంక్రాంతి వేడుకల కోసం స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. రూ.3 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి, రూ.2 కోట్లతో రోడ్లు, రూ.కోటితో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు మహిళల ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీలు తిలకించి, విజేతలకు బహుమతులు అందించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
AP: ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ బరులు సిద్ధం చేసి నిర్వాహకులు పందేలు నిర్వహిస్తున్నారు. దీంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పందేల్లో సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక పొరుగు రాష్ట్రాలైన TG, TN, కర్ణాటక నుంచి కూడా చాలామంది ఆసక్తితో కోడిపందేల కోసమే గోదావరి జిల్లాలకు రావడం విశేషం.
చైనాలో hMPV కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వైరస్ వ్యాప్తిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఇది చాలా దశాబ్దాలుగా ఉందని, ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందని చైనా వైద్యాధికారులు తెలిపారు. పిల్లల్లో వైరస్ వ్యాప్తి తగ్గిందని వివరించారు. భారత్‌లో 17 hMPV కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.
లాస్ ఏంజెలిస్‌లో చెలరేగిన కార్చిచ్చును అదుపుచేసే క్రమంలో ఏర్పడిన నీటి కొరతకు హాలీవుడ్ నటులే కారణమని తెలుస్తోంది. విస్తారమైన వారి ఇంటి గార్డెన్ల నిర్వహణకు మోతాదుకు మించి నీటిని వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. గతంలో పరిమితికి మించి నీటిని వినియోగించారని కిమ్ కర్దాషియన్‌కు ఫైన్ విధించారు. సిల్వస్టెర్ స్టాలోన్, కెవిన్ హార్ట్ వంటి ప్రముఖులూ ఫైన్ చెల్లించిన వారిలో ఉన్నారు.
AP: రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటల సమ్మేళనమే సంక్రాంతి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు పరుగులు తీశాయని చెప్పారు. భారతీయులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి వేళ పల్లెలు పిల్లా పాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉందని తెలిపారు. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
AP: ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.2వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనున్నట్లు AP NGO అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ వెల్లడించారు. పోలీసుల సరెండర్ లీవ్, ఉద్యోగుల GPF, మెడికల్ రీయింబర్స్మెంట్, FTA బిల్లులు సాయంత్రంలోపు అకౌంట్లలోకి జమ కానున్నాయని తెలిపారు. సర్వీస్ పోస్టేజ్, ఇంటర్నెట్ ఛార్జీలు, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, మైనర్ రిపేర్స్ బిల్లులూ త్వరలో విడుదలవుతాయన్నారు.
రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ మూవీ జైలర్ సీక్వెల్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా రేపు సా.6 గంటలకు కొత్త సినిమా అనౌన్స్మెంట్ టీజర్‌ను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు ‘సన్ పిక్చర్స్’ ప్రకటించింది. ‘SUPER SAGA’ పేరుతో ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆ అనౌన్స్మెంట్ జైలర్-2 గురించే అని సూపర్‌స్టార్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,048 పాయింట్లు నష్టపోయి 76,330 వద్ద, నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోయి 23,085 వద్ద ముగిశాయి. Pre-Marketలో Gap Downలో ఓపెన్ అయిన సూచీలు కొంత వరకు కోలుకుంటున్నట్టు కనిపించినా మిడ్ సెషన్ నుంచి Lower Low’sతో నేల చూపులు చూశాయి. రియల్టీ 6%, మెటల్ 3.77% మేర నష్టపోయాయి. అన్ని కీలక రంగాల షేర్లపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
యూపీ ప్రయాగ్‌రాజ్‌లో ఇవాళ మహాకుంభమేళా వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజే దాదాపు కోటి మంది పుణ్యస్నానాలను ఆచరించారు. 45 రోజులు సాగే ఈ మేళాకు యూపీ ప్రభుత్వం రూ.7వేల కోట్లు కేటాయించింది. మొత్తం 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. వసతి, రవాణా, ఫుడ్, ఇతరాలకు ఒక్కొక్కరు సగటున రూ.5వేలు ఖర్చు చేస్తే రూ.2లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది మరింత పెరగొచ్చని పేర్కొంటున్నారు.
AP: రాష్ట్రంలోని బ్యాంకు ఉద్యోగులకు మరోరోజు సెలవు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికే వారికి సంక్రాంతి(14న)కి సెలవు ఇవ్వగా 15న కూడా హాలిడే ఇవ్వాలని యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్, AP స్టేట్ యూనిట్ ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో 15న సెలవు ఇస్తూ గతేడాది డిసెంబర్ 6న జారీ చేసిన జీవో నంబర్ 2116కు సవరణ చేసింది. ఫలితంగా బ్యాంకు ఉద్యోగులకు 14, 15న రెండు రోజులు హాలిడేస్ ఉండనున్నాయి.
Sorry, no posts matched your criteria.