News January 13, 2025

సంక్రాంతి కానుక.. ఇవాళే అకౌంట్లలోకి డబ్బులు

image

AP: ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.2వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనున్నట్లు AP NGO అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ వెల్లడించారు. పోలీసుల సరెండర్ లీవ్, ఉద్యోగుల GPF, మెడికల్ రీయింబర్స్‌మెంట్, FTA బిల్లులు సాయంత్రంలోపు అకౌంట్లలోకి జమ కానున్నాయని తెలిపారు. సర్వీస్ పోస్టేజ్, ఇంటర్నెట్ ఛార్జీలు, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, మైనర్ రిపేర్స్ బిల్లులూ త్వరలో విడుదలవుతాయన్నారు.

Similar News

News February 10, 2025

ALERT.. నోటిఫికేషన్ విడుదల

image

AP మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి జూనియర్ ఇంటర్, 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. FEB 15 నుంచి MAR 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 6, 7, 8, 9, తరగతుల్లో బ్యాక్ లాగ్ అడ్మిషన్లకు సైతం అప్లై చేయవచ్చు. జూనియర్ ఇంటర్‌కు ఏప్రిల్ 20, 5వ తరగతికి ఏప్రిల్ 27, బ్యాక్ లాగ్ క్లాసుల్లో చేరే వారికి ఏప్రిల్ 28న పరీక్ష ఉంటుంది.

News February 10, 2025

మస్తాన్ సాయి కస్టడీకి కోర్టు అనుమతి

image

TG: మహిళల వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న కేసులో అరెస్టైన మస్తాన్ సాయి పోలీస్ కస్టడీకి రాజేంద్రనగర్ కోర్టు అనుమతించింది. 5 రోజుల కస్టడీకి నార్సింగి పోలీసులు అనుమతి కోరగా, 2 రోజులకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ నెల 13న మస్తాన్‌ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.

News February 10, 2025

SHOCKING: వాట్సాప్‌లో పెళ్లి.. పోలీస్ స్టేషన్‌లో యువకుడి రచ్చ

image

బిహార్ ముజఫర్‌పూర్‌లో అసాధారణ ఘటన జరిగింది. ఇంటర్ బాలికను వాట్సాప్‌లో పెళ్లాడినట్లు బాలుడు పేర్కొన్నాడు. నిఖా కబూల్ హై(పెళ్లి సమ్మతమేనా?) అనే మెసేజ్‌కు ఇద్దరూ 3సార్లు అంగీకారం తెలిపినట్లు చెబుతున్నాడు. ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో రచ్చ చేశాడు. కౌన్సెలింగ్ ఇచ్చినా మార్పురాలేదు. పేరెంట్స్ నుంచి అధికారిక ఫిర్యాదు తర్వాత లీగల్ యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు ఎదురుచూస్తున్నారు.

error: Content is protected !!