India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఇన్‌స్టాలో మండిపడ్డారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు సరైన సమయానికే చేరుకున్నప్పటికీ మేనేజర్ సుస్మిత వేరే కౌంటర్లకు తిప్పడంతో ఫ్లైట్ మిస్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది సాయం చేయకపోగా దురుసుగా ప్రవర్తించారన్నారు. తనకు వచ్చిన ఒక రోజు హాలిడేను నాశనం చేశారని విమర్శించారు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో అభిషేక్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
రష్యా చమురు పరిశ్రమపై US విధించిన తాజా ఆంక్షలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపనున్నాయి. 2022 నుంచి చౌకగా లభిస్తున్న రష్యా చమురుకు ప్రధాన దిగుమతిదారులుగా ఉన్న భారత్, చైనాలకు ఈ ఆంక్షలు ప్రతికూలంగా పరిణమించాయి. చైనా షాన్‌డాంగ్‌లోని స్వతంత్ర చమురు సంస్థలు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. భారత్ అవసరాల్లో మూడోవంతు రష్యా నుంచే వస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై ప్రభుత్వం నిపుణులతో చర్చిస్తోంది.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వైసీపీ థాంక్స్ చెప్పింది. జగన్ హయాంలో చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేస్తూ ఆయన తమకు స్టార్ క్యాంపెయినర్‌గా మారారని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. స్కూళ్లు, కర్నూలులో గ్రీన్‌కో సోలార్ ప్రాజెక్టు, పంప్ స్టోరేజ్, విశాఖలో రుషికొండ భవనాల వద్ద ఆయన ఫొటోలను షేర్ చేసింది. కాగా తమ ప్రభుత్వంలో పూర్తిచేసిన కార్యక్రమాలపై వైసీపీ ఇవాళ్టి నుంచి క్యాంపెయిన్ ప్రారంభించింది.
APలో మద్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. లిక్కర్ బ్రాండ్లలో ధరల తగ్గింపునకు కంపెనీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే మాన్షన్ హౌస్, అరిస్ట్రోకాట్ ప్రీమియం, కింగ్ ఫిషర్ వంటివి ధరలు తగ్గించుకోగా, బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ధరల తగ్గింపునకు ప్రభుత్వానికి అప్లై చేసుకుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
TG: రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్డుల జారీకి ఎలాంటి రికమెండేషన్స్ అవసరం లేదని, అర్హులైన వారందరికీ ఇస్తామని చెప్పారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారిలో ఎవరైనా అనర్హులుంటే గ్రామ సభల్లో చెప్పాలని అన్నారు. వారి అప్లికేషన్లను పక్కనపెడతామని పేర్కొన్నారు.
బీసీసీఐ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ట్రెజరర్‌గా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియాను ఎన్నుకున్నట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. తక్షణమే వీరు తమ బాధ్యతలను చేపడతారని పేర్కొంది. నిన్న జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపింది. జైషా, ఆశిష్ షెలార్ స్థానాలను భర్తీ చేస్తున్న వీరు సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ పేర్కొన్నారు.
హీరోయిన్ అన్షు గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాథరావుపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయనకు త్వరలోనే నోటీసు జారీ చేస్తామని ఛైర్‌పర్సన్ నేరేళ్ల శారద తెలిపారు. కాగా ‘అన్షు మళ్లీ నటిస్తున్నారు. ఆమె కొంచెం సన్నబడింది. అందుకే తిని పెంచమ్మా. తెలుగుకు సరిపోదు. అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా’ అని త్రినాథరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
క్రికెట్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ రెండు జట్లు తలపడితే దానినో యుద్ధంలా చూస్తారు. క్రికెట్ చరిత్రలో దాయాదుల పోరు గురించి NETFLIX ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్ చేసేందుకు వెళ్తోన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. INDvsPAK మ్యాచుల్లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి.
అక్షరాస్యత రేటులో ఒకశాతం పెరుగుదల మహిళల ఓటింగును 25% పెంచిందని SBI నివేదిక పేర్కొంది. 2019తో పోలిస్తే 2024లో 1.8 కోట్ల మహిళా ఓటర్లు పెరిగారు. అందులో 45 లక్షల వృద్ధికి అక్షరాస్యతే కారణమంది. ముద్రా వంటి స్కీములతో 36లక్షలు, పారిశుద్ధ్యం వల్ల 21లక్షలు, PMAY వల్ల 20లక్షల స్త్రీ ఓటర్లు పెరిగారని తెలిపింది. అక్షరాస్యత, ఉపాధి, గృహ యాజమాన్యం, విద్యుత్, నీరు వంటివి సానుకూల ప్రభావం చూపాయని వెల్లడించింది.
144 ఏళ్లకు ఓసారి వచ్చే మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్ (యూపీ)లో ఘనంగా ప్రారంభమైంది. లక్షలాది మంది హిందూ సాధువులు, ప్రజలు గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇందులో ఓ వ్యక్తి త్రివర్ణ పతాకం చేతబూని రెపరెపలాడించాడు. భక్తి, దేశభక్తి అద్భుతమంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఈ మహా కుంభమేళా దేశానికి గర్వకారణం, గుర్తింపు అని యూపీ అధికారులు ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.