News June 4, 2024

డబుల్ డిజిట్ దక్కేదెవరికో?

image

TG: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. BRS 0-1 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన నేపథ్యంలో.. డబుల్ డిజిట్ సీట్లు కాంగ్రెస్, BJPల్లో ఎవరికి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. మరి తెలంగాణలో డబుల్ డిజిట్ ఎవరిని వరిస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ ద్వారా తెలియజేయండి.

News June 4, 2024

కోడ్‌ ముగిసినా పలు రాష్ట్రాల్లో కేంద్ర బలగాలు

image

ఎన్నికల ఫలితాల తర్వాత అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగకుండా AP సహా కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర బలగాల సేవలను కొనసాగించాలని EC నిర్ణయించింది. కోడ్‌ ముగిసినా బలగాలను మోహరించడం ఇదే తొలిసారి కానుంది. AP, బెంగాల్, UP, మణిపుర్‌ వంటి రాష్ట్రాల్లో 15 రోజుల పాటు ఇవి అందుబాటులో ఉంటాయి. హింసకు ఆస్కారం ఉండదని తాము నమ్ముతున్నా, అలాంటి అవకాశం తలెత్తే రాష్ట్రాల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

News June 4, 2024

అందరిచూపు మాధవీలతపైనే..

image

TG: పోటీచేస్తున్న తొలిసారే ప్రధాని మోదీ చేత ప్రశంసలు అందుకున్న బీజేపీ HYD అభ్యర్థి కొంపెల్లి మాధవీలత భవితవ్యం కాసేపట్లో తేలనుంది. హిందూత్వమే ప్రధాన అస్త్రంగా ఆమె ప్రచారంలో దూసుకెళ్లారు. సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేశారు. MIM కంచుకోటను ఆమె బద్దలు కొడతారా? వరుసగా 4సార్లు ఎంపీగా విజయం సాధించిన అసదుద్దీన్ ఓవైసీతో ఏమేరకు పోటీ ఇవ్వగలరనేది ఆసక్తిగా మారింది.

News June 4, 2024

కాసేపట్లో ప్రజాతీర్పు

image

AP ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఉ.8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8.30 గంటలకు EVMల కౌంటింగ్ షురూ కానుంది. కొవ్వూరు, నరసాపురం స్థానాల్లో(MLA) తొలి ఫలితం వెలువడనుంది. భీమిలి, పాణ్యం ఫలితం చివరిగా రానుంది. రాజమండ్రి, నరసాపురం MP స్థానాల్లో తొలి ఫలితం రానుండగా.. అమలాపురం ఫలితం ఆలస్యం కానుంది. EVM కౌంటింగ్‌కు ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాలు పట్టనుండగా మ.1 కల్లా మెజార్టీ ఎవరిదో తేలనుంది.

News June 4, 2024

కౌంటింగ్ సిబ్బంది, భద్రత లెక్క ఇలా

image

AP: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కోసం EC 25,209 మంది సిబ్బందిని వినియోగిస్తోంది. కౌంటింగ్‌ను పరిశీలించడానికి 119 మంది కేంద్ర అబ్జర్వర్లు ఏపీకి చేరుకున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 45,000 మంది పోలీస్ సిబ్బంది, 67 కంపెనీల సాయుధ బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. సెంటర్ల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుంది. ఈవీఎంల తరలింపు నుంచి ఓట్ల లెక్కింపు వరకు మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తారు.

News June 4, 2024

33 కేంద్రాల్లో కౌంటింగ్..

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. 33 కేంద్రాల్లోని 401 హాళ్లలో ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. శాసనసభ బరిలో 2,387 మంది, లోక్‌సభ బరిలో 454 మంది ఉన్నారు. అసెంబ్లీ బరిలో వైసీపీ 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. కూటమిలోని టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ, బీజేపీ 10 ఎమ్మెల్యే, ఆరు పార్లమెంట్, జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగాయి.

News June 4, 2024

అంచనాలు తారుమారవుతాయి: సోనియా

image

ఈ లోక్‌సభ ఎన్నికల్లో NDA కూటమి భారీ విజయం సాధించబోతుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తోసిపుచ్చారు. తాము ఎన్నికల ఫలితాలపై ఆశాభావంతో ఉన్నామని, ఈరోజు ఓట్ల లెక్కింపుతో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారవుతాయని భావిస్తున్నామన్నారు. అప్పటి వరకు వేచి చూద్దామని అన్నారు. సర్వేల్లో దాదాపు అన్నీ ఎగ్జిట్ పోల్స్ NDA అధికారం చేపడుతుందనే అంచనా వేయడం తెలిసిందే.

News June 4, 2024

ఆ రోజు రానే వచ్చింది.. దేశమంతా ఉత్కంఠ!

image

యావత్తు దేశంతో పాటు పలు ప్రపంచ దేశాలూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వచ్చే 5ఏళ్ల పాటు మన దేశ పాలనను ప్రజలు ఎవరి చేతుల్లో పెట్టారో నేటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల రూపంలో తేలనుంది. 8amకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 543 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. 272MP సీట్లు గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది. అటు హ్యాట్రిక్‌ కొడతామని BJP, ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉన్నాయి.

News June 4, 2024

ఒకే రోజు 76 తీర్పులతో రికార్డు

image

తెలంగాణ హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద ఒకే రోజు 76 తీర్పులు వెలువరించి రికార్డు నెలకొల్పారు. వేసవి సెలవుల అనంతరం సోమవారం కోర్టు ప్రారంభం కాగా జస్టిస్ నంద ఆయా కేసులను పరిష్కరించారు. గతేడాది వేసవి సెలవుల అనంతరం సైతం ఒకే రోజు 71 కేసుల్లో తీర్పు ఇచ్చారు.

News June 4, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారంతో పోలిస్తే సోమవారం స్వల్పంగా తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 15 గంటలు పడుతోంది. రూ.300 టికెట్ల ద్వారా వెళ్లే భక్తులు రెండు గంటల్లో దర్శనం లభిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఆదివారం శ్రీవారిని 83,740 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.71కోట్ల హుండీ కానుకలు లభించాయి. కాగా అంతకుముందు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు పట్టేది.