News June 4, 2024

33 కేంద్రాల్లో కౌంటింగ్..

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. 33 కేంద్రాల్లోని 401 హాళ్లలో ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. శాసనసభ బరిలో 2,387 మంది, లోక్‌సభ బరిలో 454 మంది ఉన్నారు. అసెంబ్లీ బరిలో వైసీపీ 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. కూటమిలోని టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ, బీజేపీ 10 ఎమ్మెల్యే, ఆరు పార్లమెంట్, జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగాయి.

News June 4, 2024

అంచనాలు తారుమారవుతాయి: సోనియా

image

ఈ లోక్‌సభ ఎన్నికల్లో NDA కూటమి భారీ విజయం సాధించబోతుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తోసిపుచ్చారు. తాము ఎన్నికల ఫలితాలపై ఆశాభావంతో ఉన్నామని, ఈరోజు ఓట్ల లెక్కింపుతో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారవుతాయని భావిస్తున్నామన్నారు. అప్పటి వరకు వేచి చూద్దామని అన్నారు. సర్వేల్లో దాదాపు అన్నీ ఎగ్జిట్ పోల్స్ NDA అధికారం చేపడుతుందనే అంచనా వేయడం తెలిసిందే.

News June 4, 2024

ఆ రోజు రానే వచ్చింది.. దేశమంతా ఉత్కంఠ!

image

యావత్తు దేశంతో పాటు పలు ప్రపంచ దేశాలూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వచ్చే 5ఏళ్ల పాటు మన దేశ పాలనను ప్రజలు ఎవరి చేతుల్లో పెట్టారో నేటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల రూపంలో తేలనుంది. 8amకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 543 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. 272MP సీట్లు గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది. అటు హ్యాట్రిక్‌ కొడతామని BJP, ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉన్నాయి.

News June 4, 2024

ఒకే రోజు 76 తీర్పులతో రికార్డు

image

తెలంగాణ హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద ఒకే రోజు 76 తీర్పులు వెలువరించి రికార్డు నెలకొల్పారు. వేసవి సెలవుల అనంతరం సోమవారం కోర్టు ప్రారంభం కాగా జస్టిస్ నంద ఆయా కేసులను పరిష్కరించారు. గతేడాది వేసవి సెలవుల అనంతరం సైతం ఒకే రోజు 71 కేసుల్లో తీర్పు ఇచ్చారు.

News June 4, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారంతో పోలిస్తే సోమవారం స్వల్పంగా తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 15 గంటలు పడుతోంది. రూ.300 టికెట్ల ద్వారా వెళ్లే భక్తులు రెండు గంటల్లో దర్శనం లభిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఆదివారం శ్రీవారిని 83,740 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.71కోట్ల హుండీ కానుకలు లభించాయి. కాగా అంతకుముందు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు పట్టేది.

News June 4, 2024

ఫ్రెంచ్ ఓపెన్.. క్వార్టర్స్‌కు జకోవిచ్

image

ఫ్రెంచ్ ఓపెన్‌ పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జకోవిచ్‌ ఈ మ్యాచ్ గెలిచేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. సెరున్‌డొలోపై (అర్జెంటీనా) గెలిచేందుకు ఐదు సెట్లు (6-1, 5-7, 3-6, 7-5, 6-3) పోరాడాల్సి వచ్చింది. మరోవైపు స్టార్ ఆటగాడు డానియల్ మెద్వెదెవ్ (రష్యా) సీడ్ డిమెనార్ (ఆసీస్) చేతిలో ఓడటంతో ఇంటిముఖం పట్టారు.

News June 4, 2024

ఎల్-నినో పోయి లా నినా ఎంట్రీ?

image

ఎల్-నినో ప్రభావంతో నమోదవుతున్న రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలకు ఇక తెరపడే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. ‘జూలై-సెప్టెంబరు మధ్య లా నినా ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలు పడొచ్చు. జూలై-ఆగస్టులో తటస్థ పరిస్థితులు నెలకొనడానికి, లా నినా ఏర్పడటానికి 50-50 అవకాశాలు ఉన్నాయి. లా నినా ఏర్పడటానికి JUL-SEP మధ్య 60%, ఆగస్టు నుంచి NOV మధ్య 70% ఛాన్స్ ఉంది’ అని తెలిపింది.

News June 4, 2024

రాజస్థాన్‌లో బీజేపీ మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుందా?

image

లోక్‌సభ ఎన్నికల్లో 2014 నుంచి రాజస్థాన్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న BJP మరోసారి క్లీన్‌స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో 25 సీట్లలో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేకపోయింది. మోదీ ఇమేజ్, అయోధ్య రామమందిరం మొదలైన అంశాలు పార్టీకి కలిసొచ్చాయి. కాగా ఈసారి విజయాన్ని కూడా బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరోవైపు బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

News June 4, 2024

ఆ అంశాలే బీజేపీకి ధీమా!

image

హ్యాట్రిక్‌పై బీజేపీ ధీమా వెనుక ఐదు ప్రధాన అంశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ‘మోదీ ఇమేజ్ కీలక పాత్ర పోషించింది. కార్యకర్తలు, RSS అండ ఆ పార్టీకి బలంగా మారింది. ఆర్థికంగా బలంగా ఉండటమూ పార్టీకి కలిసొచ్చింది. మహిళలు, యువత, రైతులు, పేదలే లక్ష్యంగా ప్రచారం చేసి ఓటర్ బేస్ పెంచుకునే ప్రయత్నం చేసింది. 2019 ఎన్నికల్లో ఓట్ షేర్ 45%కు పెరగడంతో ఈసారి కూడా ఆ ప్రభావం ఉండొచ్చని ధీమాగా ఉంది’ అని పేర్కొన్నారు.

News June 4, 2024

ఇండియా కూటమికి 295 సీట్లు సాధ్యమా? – 2/2

image

రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా మొదలైన రాష్ట్రాలు ఈ రెండో జాబితాలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఈ రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, మిత్రపక్షాలు ఆ 119 స్థానాలు గెలవడం సవాల్‌గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ 2019 లెక్కలను మార్చగలిగితే ఇప్పుడు ఆశిస్తున్న టార్గెట్‌ను చేరుకునే అవకాశం ఉందంటున్నారు.