News January 12, 2025

మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత

image

AP: హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు సహాయం చేశారు. విశాఖపట్నంలోని పాత గాజువాక జంక్షన్‌లో అనిత కారులో వెళ్తున్నారు. అదే సమయంలో ఓ బైక్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి గాయపడింది. వెంటనే ఆమె తన సిబ్బందిని ఆదేశించి ఆస్పత్రికి పంపించారు. ఇది చూసిన స్థానికులు మంత్రిని అభినందిస్తున్నారు.

News January 12, 2025

10th బాలికలను షర్ట్స్ లేకుండా ఇంటికి పంపిన ప్రిన్సిపల్: BJP ఫైర్

image

షర్ట్స్ విప్పించి 80 మంది 10th బాలికలను ఇన్నర్స్, బ్లేజర్స్‌తో ఇంటికి పంపిన ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని ఝార్ఖండ్ BJP డిమాండ్ చేసింది. పేరెంట్స్ ఫిర్యాదు చేసినా సెలవులని పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమంది. పెన్‌డే కావడంతో ధన్‌బాద్‌లోని ఓ Pvt స్కూల్ బాలికలు షర్ట్స్‌పై సందేశాలు రాయించుకోవడంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్ దేవశ్రీ వాటిని విప్పించారు. వివాదం కావడంతో Govt దర్యాప్తు కమిటీని వేసింది.

News January 12, 2025

ఎంఎస్ ధోనీ భయం ఎరగని వ్యక్తి: యోగరాజ్ సింగ్

image

భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఫియర్‌లెస్ మ్యాన్ అని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ అన్నారు. ఆయన ఒక మోటివేటెడ్ కెప్టెన్ అని ప్రశంసలు కురిపించారు. కాగా గతంలో తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరీర్‌ను ధోనీ సర్వనాశనం చేశాడని యోగరాజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనని హెచ్చరించారు. ఎప్పటికీ అతడిని క్షమించనని, అతడితో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వనని పేర్కొన్నారు.

News January 12, 2025

ఇంటింటికీ గ్యాస్ సరఫరా ప్రారంభించిన సీఎం

image

AP: సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. తిరుచానూరులో ఇంటింటికీ గ్యాస్ సరఫరాను ప్రారంభించారు. సీఎన్జీ వాహనాలను పరిశీలించారు. పలువురు న్యాచురల్ గ్యాస్ లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఓ ఇంట్లో స్టవ్ వెలిగించి స్వయంగా టీ చేసి సేవించారు. కాసేపట్లో ఆయన స్వగ్రామం నారావారిపల్లెకు వెళతారు. 3 రోజులపాటు అక్కడే కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు.

News January 12, 2025

భోగి మంటల్లో వీటిని వేస్తున్నారా?

image

సంక్రాంతి పండుగలో భాగంగా భోగి మంటలు వేయడం ఆనవాయితీ. హోమాన్ని ఎంత పవిత్రంగా భావిస్తామో భోగి మంటను అంతే పవిత్రంగా భావించాలి. శుచిగా ఉన్న వ్యక్తి కర్పూరంతో భోగి మంట వెలిగించాలి. భోగి మంటల్లో పనికిరాని వస్తువులు, విరిగిన కుర్చీలు, టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, పెట్రోల్, కిరోసిన్ వేయకూడదు. చెట్టు బెరడు, పిడకలు, కొబ్బరి ఆకులు, ఎండిన కొమ్మలు, ఆవు నెయ్యి, ఔషధ మొక్కలు వంటి వాటితో మండించాలి.

News January 12, 2025

కరుణ్ నాయర్ మళ్లీ సెంచరీ

image

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ కెప్టెన్ <<15055540>>కరుణ్ నాయర్<<>> ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాయర్ (122*) మరో సెంచరీ బాదారు. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. 82 బంతుల్లోనే 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. నాయర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో విదర్భ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

News January 12, 2025

హింసా రాజకీయాలకు సీఎం రేవంత్ ప్రోత్సాహం: హరీశ్ రావు

image

TG: INC ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసిందని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. ప్రజలు ఆరు గ్యారంటీలను ప్రశ్నించకుండా ఉండేందుకు CM రేవంత్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రైతు కూలీలు, అన్ని రకాల వడ్లకు బోనస్, రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా స్పందించడం లేదని ఫైరయ్యారు. ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు కూడా రైతు కూలీలేనని, వారికి కూడా రూ.12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News January 12, 2025

మార్చి 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం

image

ఈ ఏడాది మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అలాగే మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ జరుగుతుందని చెప్పారు. బీసీసీఐ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్‌కు కొత్త కమిషనర్‌ను ఎన్నుకుంటామని వెల్లడించారు. కాగా తొలుత మార్చి 23 నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతుందని శుక్లా ప్రకటించారు. అనంతరం 21నే ప్రారంభిస్తామని చెప్పారు.

News January 12, 2025

శనగలు ఉడికిస్తూ ఇద్దరు యువకులు మృతి

image

శనగలు ఉడికించే క్రమంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. నోయిడాకు చెందిన యువకులు శనగలను ఉడికించేందుకు స్టవ్‌పై చిన్న మంటతో పెట్టి మరిచిపోయారు. రాత్రంతా అలాగే ఉండడంతో ఆ మంట నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలైంది. ఈ విషపూరితమైన వాయువుకు రంగు, రుచి, వాసన ఉండదు. ఇంటి డోర్, కిటికీలు క్లోజ్ చేసి ఉండడంతో ఆ వాయువు గదంతా వ్యాపించింది. దీంతో ఆక్సిజన్ అందక వారిద్దరూ స్పృహ కోల్పోయి చనిపోయారు.

News January 12, 2025

WC ఆడుతూ యువీ చనిపోయినా గర్వపడేవాడిని: తండ్రి యోగ్‌రాజ్

image

క్యాన్సర్‌తో బాధపడుతూ, రక్తపు వాంతులు చేసుకుంటూ 2011 WCలో యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్‌లు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆ ఘటనపై తాజాగా ఆయన తండ్రి యోగ్‌రాజ్ స్పందించారు. దేశం కోసం WC ఆడుతూ తన కొడుకు చనిపోయినా గర్వపడేవాడినని తెలిపారు. ఇదే విషయం అప్పట్లో యువీకి ఫోన్‌లో చెప్పానని గుర్తుచేసుకున్నారు. ‘నువ్వు బాధపడకు. నీకు ఏం కాదు. దేశం కోసం వరల్డ్ కప్ గెలువు’ అని ధైర్యం నూరిపోశానని పేర్కొన్నారు.