News June 3, 2024

మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా షీన్‌బామ్!

image

మెక్సికో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదు కానుంది. ఆ దేశ అధ్యక్షురాలిగా తొలిసారిగా ఓ మహిళ ఎన్నికవనున్నారు. రూలింగ్ పార్టీకి చెందిన క్లాడియా షీన్‌బామ్ 60% ఓట్లు సాధిస్తారని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇటు ప్రతిపక్ష అభ్యర్థిగానూ మహిళే బరిలో నిలిచారు. విపక్షానికి చెందిన గాల్వెజ్‌కు 30% ఓట్లు వస్తాయని అంచనా. కాగా ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఒకసారి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి మరోసారి పోటీ చేయకూడదు.

News June 3, 2024

స్టాక్ మార్కెట్ల జోరు.. ₹12.48L cr లాభం

image

ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో స్టాక్ మార్కెట్లు భారీ <<13366755>>లాభాల్లో<<>> కొనసాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.12.48 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందారు. PSU బ్యాంకులు, ఆయిల్, గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్స్, రియాల్టీ, ఆటో రంగాలు 3-5 శాతం లాభాలు పొందాయి. ఇవాళ ఒకానొక దశలో సెన్సెక్స్ 2,621 పాయింట్ల లాభంతో 76,583, నిఫ్టీ 800 పాయింట్ల లాభంతో 23,227 పాయింట్ల గరిష్ఠాలను తాకాయి.

News June 3, 2024

టెన్షన్.. టెన్షన్

image

AP ఎన్నికల కౌటింగ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్. మరికొన్ని గంటల్లో ప్రజా తీర్పు వెలువడనుండగా.. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ నలుగురు వ్యక్తులు కలిసినా రిజల్ట్‌పైనే చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ భిన్న అంచనాలను వెల్లడించడంతో ఓటర్ల తీర్పు ఎవరికీ అర్థం కావడం లేదు. వైసీపీ, టీడీపీ మాత్రం అధికారం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రేపు ఈ సమయానికి ఓటర్లు ఏ గట్టున ఉన్నారన్న విషయం తేలిపోనుంది.

News June 3, 2024

ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఓటర్లు: ఈసీ

image

దేశంలో 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించామని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డు అని చెప్పారు. ఇది G7 దేశాలైన USA, UK, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రెట్లు ఎక్కువన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా మనదేశంలో 31.2కోట్ల మంది మహిళలు ఓట్లు వేసినట్లు ఎన్నికల తర్వాత నిర్వహించిన తొలి ప్రెస్‌మీట్‌లో ఆయన వివరించారు.

News June 3, 2024

దొంగతనానికి వెళ్లి AC ఆన్ చేసుకుని నిద్రపోయాడు

image

UPలోని లక్నోలో ఓ వ్యక్తి దొంగతనానికి వెళ్లి ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుని హాయిగా నిద్రపోయాడు. పోలీసులు అతడిని నిద్రలేపి అరెస్టు చేశారు. ఓ డాక్టర్ కుటుంబం పనిమీద వారణాసికి వెళ్లగా, పీకలదాకా మద్యం తాగిన దొంగ వారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఏసీ ఆన్ చేసుకుని నేలపై పడుకున్నాడు. బయట గేట్ ఓపెన్ చేసి ఉండటంతో పక్కింటి వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు.

News June 3, 2024

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.66,100కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.72,110 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.700 తగ్గి రూ.97,300కు చేరింది.

News June 3, 2024

భారీ ర్యాలీకి బీజేపీ ప్లాన్!

image

మళ్లీ కమల ప్రభంజనమే అని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంగా ప్రకటించడంతో బీజేపీ గెలుపు సంబరాలకు ప్లాన్ చేస్తోంది. రేపు ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసం నుంచి బీజేపీ జాతీయ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ర్యాలీలో మోదీ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం గెలుపు ప్రసంగంలో తొలి 100 రోజుల ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

News June 3, 2024

వైసీపీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు

image

AP: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో <<13364354>>సుప్రీంకోర్టులోనూ<<>> వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్‌కు అర్హత ఉంటుందని హైకోర్టు ఇచ్చిన <<13358298>>తీర్పును<<>> వైసీపీ సుప్రీంలో సవాల్ చేసింది.

News June 3, 2024

నోటా ఓటుతో కలవరపాటు!

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. కాగా ఈసారి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నోటా ఓట్లు కూడా అభ్యర్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి. ఎందుకంటే.. గత రెండు ఎన్నికల్లోనూ నోటా ఓట్లు భారీగానే పోలయ్యాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60,02,942 మంది, 2019లో 65,22,772 మంది నోటా బటన్ నొక్కేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఈ ఓట్లు అభ్యర్థులకు పడితే ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ కూడా ఉండేది.

News June 3, 2024

BREAKING: పాలిసెట్ ఫలితాలు విడుదల

image

తెలంగాణ పాలిసెట్ ఫలితాలను విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. Way2News యాప్‌లో సులభంగా, వేగంగా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. మే 24న జరిగిన ఈ పరీక్షకు 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు.