News January 12, 2025

SBI SCO అడ్మిట్ కార్డులు విడుదల

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్టు కేడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూ కోసం అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసింది. జనవరి 31 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు జనవరి 17 నుంచి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు జనవరి 20 నుంచి ఇంటర్వ్యూలు మొదలవుతాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 1497 ఉద్యోగాలను SBI భర్తీ చేస్తోంది. అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News January 12, 2025

70, 90 గంటలు కాదు.. వర్క్ క్వాలిటీ ముఖ్యం: ఆనంద్ మహీంద్రా

image

పని గంటలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. వారిపై తనకు గౌరవం ఉందంటూనే పని గంటలపై కాకుండా వర్క్ క్వాలిటీపై దృష్టిసారించాలని అభిప్రాయపడ్డారు. 70, 90 గంటల కంటే నాణ్యమైన పని 10 గంటలు చేస్తే ప్రపంచాన్ని మార్చేయవచ్చన్నారు. పలు దేశాలు వారంలో నాలుగు రోజుల వర్క్‌ కల్చర్‌కు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

News January 12, 2025

రాత్రుళ్లు రీల్స్ చూస్తున్నారా? మీరు డేంజర్‌లో ఉన్నట్లే!

image

నిద్రపోకుండా బెడ్‌పైనే గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా? ఇది మీకోసమే. రాత్రుళ్లు స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది. యువకులు, మధ్య వయస్కుల్లో వచ్చే హైబీపీ నిద్రవేళలో చూసే రీల్స్‌తో ముడిపడి ఉన్నట్లు తేలింది. బెడ్ టైమ్‌లో 4 గంటల కంటే ఎక్కువ సమయం రీల్స్ చూసేవారికి ప్రమాదం ఎక్కువని వెల్లడైంది. కాబట్టి పడుకునేటప్పుడు రీల్స్ చూడటం తగ్గించాలని వైద్యులు సూచించారు.

News January 11, 2025

HYDలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్: సీఎం

image

హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. వివిధ దేశాల్లో బెస్ట్ పాలసీలను పరిశీలించాలన్నారు. ORR లోపల విద్యుత్ కేబుల్స్‌తో పాటు అన్ని రకాల కేబుల్స్ పూర్తిగా అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు చౌర్యం, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే విద్యుత్ అంతరాయాలను అధిగమించవచ్చన్నారు.

News January 11, 2025

మూడు రోజుల పాటు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్

image

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈనెల 13 నుంచి15 వరకూ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. దీనికి సంబంధించిన లోగోను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. 16 దేశాల నుంచి 47 మంది కైట్ ప్లేయర్స్, 14 రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ క్లబ్ సభ్యులు పాల్గొంటున్నారు. జాతీయ‌, అంతర్జాతీయ స్వీట్లను, తెలంగాణ పిండి వంట‌ల‌ను స్టాళ్ల‌లో ప్రదర్శించనున్నారు. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

News January 11, 2025

మద్యం తాగేవారికి క్యాన్సర్ ముప్పు: వైద్యులు

image

ఆల్కహాల్ వినియోగం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పెద్దపేగు & మల క్యాన్సర్ వస్తుందని పేర్కొన్నారు. రోజుకు 20 గ్రాముల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ 15శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. దీంతోపాటు రోజుకు 30గ్రా ఎర్రమాంసం తినడం వల్ల కూడా పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 8% ఎక్కువని తేలింది. ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్లను తగ్గించవచ్చు.

News January 11, 2025

భన్సాలీతో అల్లు అర్జున్ భేటీ.. త్వరలో క్రేజీ ప్రాజెక్ట్?

image

బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని అల్లు అర్జున్ ఇటీవల ముంబైలో కలిశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మీడియాకు దూరంగా వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరి కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపైనే చర్చలు సాగాయని తెలుస్తోంది. త్రివిక్రమ్, సందీప్‌రెడ్డి సినిమాల తర్వాత భన్సాలీతో గ్లోబల్ స్థాయిలో మూవీ ఉంటుందని సమాచారం.

News January 11, 2025

హార్దిక్ పాండ్యకు BCCI ఝలక్

image

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు బీసీసీఐ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైస్ కెప్టెన్సీని అతడికి కాకుండా మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు కట్టబెట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ <<15128809>>సిరీస్‌కు <<>>స్టార్ పేసర్స్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌కు మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది.

News January 11, 2025

మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్

image

TG: లిక్కర్ కంపెనీల ఎంపికలో పారదర్శకత పాటించాలని సీఎం రేవంత్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. కొత్త కంపెనీలు దరఖాస్తు చేసుకునేందుకు వారికి కనీసం నెలరోజుల సమయం ఇవ్వాలని సూచించారు. ‘రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల సరఫరాకు ఈజీ డూయింగ్ పాలసీ అనుసరించాలి. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లిక్కర్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

News January 11, 2025

గాయంతో హీరోయిన్ రష్మిక(PHOTOS)

image

జిమ్‌లో గాయపడ్డ హీరోయిన్ రష్మిక తాజా ఫొటోలను పంచుకున్నారు. ‘కోలుకునేందుకు రోజులు, నెలలు పడుతుందో దేవుడికే తెలియాలి. త్వరలోనే సికందర్, కుబేర సెట్స్‌లోకి అడుగుపెడతానని ఆశిస్తున్నా. ఆలస్యానికి నా దర్శకులకు క్షమాపణలు. త్వరగా తిరిగొచ్చి యాక్షన్ సీన్లు చేయడానికి ప్రయత్నిస్తాను. ఈలోగా అవసరమైతే ఏదో ఒక మూలన కూర్చొని అడ్వాన్స్ పనులు చేస్తాను’ అని ఆమె పోస్ట్ పెట్టారు.