India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిద్రపోకుండా బెడ్‌పైనే గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా? ఇది మీకోసమే. రాత్రుళ్లు స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది. యువకులు, మధ్య వయస్కుల్లో వచ్చే హైబీపీ నిద్రవేళలో చూసే రీల్స్‌తో ముడిపడి ఉన్నట్లు తేలింది. బెడ్ టైమ్‌లో 4 గంటల కంటే ఎక్కువ సమయం రీల్స్ చూసేవారికి ప్రమాదం ఎక్కువని వెల్లడైంది. కాబట్టి పడుకునేటప్పుడు రీల్స్ చూడటం తగ్గించాలని వైద్యులు సూచించారు.
హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. వివిధ దేశాల్లో బెస్ట్ పాలసీలను పరిశీలించాలన్నారు. ORR లోపల విద్యుత్ కేబుల్స్‌తో పాటు అన్ని రకాల కేబుల్స్ పూర్తిగా అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు చౌర్యం, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే విద్యుత్ అంతరాయాలను అధిగమించవచ్చన్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈనెల 13 నుంచి15 వరకూ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. దీనికి సంబంధించిన లోగోను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. 16 దేశాల నుంచి 47 మంది కైట్ ప్లేయర్స్, 14 రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ క్లబ్ సభ్యులు పాల్గొంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను, తెలంగాణ పిండి వంటలను స్టాళ్లలో ప్రదర్శించనున్నారు. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
ఆల్కహాల్ వినియోగం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పెద్దపేగు & మల క్యాన్సర్ వస్తుందని పేర్కొన్నారు. రోజుకు 20 గ్రాముల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ 15శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. దీంతోపాటు రోజుకు 30గ్రా ఎర్రమాంసం తినడం వల్ల కూడా పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 8% ఎక్కువని తేలింది. ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్లను తగ్గించవచ్చు.
బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని అల్లు అర్జున్ ఇటీవల ముంబైలో కలిశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మీడియాకు దూరంగా వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరి కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపైనే చర్చలు సాగాయని తెలుస్తోంది. త్రివిక్రమ్, సందీప్‌రెడ్డి సినిమాల తర్వాత భన్సాలీతో గ్లోబల్ స్థాయిలో మూవీ ఉంటుందని సమాచారం.
టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు బీసీసీఐ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైస్ కెప్టెన్సీని అతడికి కాకుండా మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు కట్టబెట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ <<15128809>>సిరీస్‌కు <<>>స్టార్ పేసర్స్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌కు మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది.
TG: లిక్కర్ కంపెనీల ఎంపికలో పారదర్శకత పాటించాలని సీఎం రేవంత్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. కొత్త కంపెనీలు దరఖాస్తు చేసుకునేందుకు వారికి కనీసం నెలరోజుల సమయం ఇవ్వాలని సూచించారు. ‘రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల సరఫరాకు ఈజీ డూయింగ్ పాలసీ అనుసరించాలి. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లిక్కర్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.
జిమ్‌లో గాయపడ్డ హీరోయిన్ రష్మిక తాజా ఫొటోలను పంచుకున్నారు. ‘కోలుకునేందుకు రోజులు, నెలలు పడుతుందో దేవుడికే తెలియాలి. త్వరలోనే సికందర్, కుబేర సెట్స్‌లోకి అడుగుపెడతానని ఆశిస్తున్నా. ఆలస్యానికి నా దర్శకులకు క్షమాపణలు. త్వరగా తిరిగొచ్చి యాక్షన్ సీన్లు చేయడానికి ప్రయత్నిస్తాను. ఈలోగా అవసరమైతే ఏదో ఒక మూలన కూర్చొని అడ్వాన్స్ పనులు చేస్తాను’ అని ఆమె పోస్ట్ పెట్టారు.
AP: సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులకు CM చంద్రబాబు శుభవార్త అందించారని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘కంసమామ మోసం చేసి పోతే చంద్రన్న న్యాయం చేస్తున్నారు. జగన్ బకాయిలు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను విడుదల చేస్తున్నారు. గత పాలకుల పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని నేను మంత్రి అయ్యాక విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. రూ.788 కోట్లు చెల్లిస్తున్నాం’ అని లోకేశ్ Xలో ట్వీట్ చేశారు.
☛ జనవరి 22- తొలి T20- కోల్‌కతా
☛ జనవరి 25- రెండో T20- చెన్నై
☛ జనవరి 28- మూడో T20- రాజ్‌కోట్
☛ జనవరి 31- 4వ T20- పుణే
☛ ఫిబ్రవరి 2- ఐదో T20- ముంబై
☛ ☛ అన్ని <<15128809>>మ్యాచ్‌లు <<>>రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతాయి.
Sorry, no posts matched your criteria.